పార్టీ మారాలంటే బాధతో గరికపాటి మోహనరావుకు బీపీ డౌన్ అయిందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి రఘురాం వ్యాఖ్యానించారు. టీడీపీలో కీలకపాత్ర పోషించిన గరికపాటి వంటి వారే పార్టీ మారడం అక్కడి దుస్థితిని తెలియజేస్తోందని రఘురాం పేర్కొన్నారు. దుర్యోధనుడి కొడుకు ఉత్తర కుమారుడిలా..చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను తెచ్చి జాతీయ ప్రధాన కార్యదర్శిని చేశారని గురువారం ఓ టీవీ చర్చలో వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఇప్పుడు తండ్రీ కొడుకుల పెత్తనం నుంచి, బానిసత్వం నుంచి స్వేచ్ఛవైపు బయటపడుతున్నారనిపేర్కొన్నారు.
2019-06-20పార్టీ మారాలనుకున్న టీడీపీ రాజ్యసభ సభ్యులు గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. పార్టీ రాజ్యసభా పక్ష నేత సుజనా చౌదరి, ఉప నేత సిఎం రమేష్ నాయకత్వంలో ఈ సమావేశం జరిగింది. తెలుగుదేశం రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తూ వారు తీర్మానం చేశారు. ఈ విలీనాన్ని అంగీకరిస్తూ రాజ్యసభ అధ్యక్షుడికి ఒక తీర్మానాన్ని పంపాలని కోరుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడికి లేఖ రాయాలని నిర్ణయించారు. విలీనాన్ని ఆమోదించి తమను బీజేపీ పక్షంలో భాగంగా గుర్తించాలని కోరుతూ రాజ్యసభ అధ్యక్షుడికి లేఖ రాయాలని మరో తీర్మానం చేశారు.
2019-06-20తాము వీడినా తెలుగుదేశం మరింత బలపడుతుందని ఆ పార్టీ రాజ్యసభాపక్ష నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. ఓ టీవీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడిన సుజనాను అదెలా అని ప్రశ్నిస్తే.. ‘మా స్థానంలో కొత్తవాళ్ళు వస్తారు కాబట్టి’ అని బదులిచ్చారు. బీజేపీకి వచ్చిన ఓట్లు చూస్తే దేశ ప్రజల ఆలోచన అర్ధమవుతోందని, దేశాభివృద్ధిలో భాగం కావాలనే బీజేపీలో చేరుతున్నామని సుజనా చెప్పుకొచ్చారు. తమపైన ఎలాంటి ఒత్తిళ్లూ లేవని, తనపైన ఉన్న కేసులకు.. ఈ నిర్ణయానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.
2019-06-20తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు నలుగురు టీడీపీకి వీడ్కోలు పలికారు. అందులో ముగ్గురు గురువారం ఢిల్లీలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మోడీ 1.0 ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన టీడీపీ రాజ్యసభాపక్ష నేత సుజనా చౌదరి, ఎంపీలు సిఎం రమేష్, టీజీ వెంకటేశ్ బీజేపీ కండువాలు కప్పుకొన్నారు. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని లేఖ ఇచ్చిన నాలుగో ఎంపీ గరికపాటి మోహన్ రావు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయన కాలి గాయం కారణంగా రాలేదని జె.పి. నడ్డా చెప్పారు.
2019-06-20తెలుగుదేశం పార్టీలో రెండున్నర దశాబ్దాల తర్వాత అసాధారణ పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగంగా టీడీపీనుంచి ఫిరాయింపులు మొదలయ్యాయి. టీడీపీ రాజ్యసభ సభ్యులు ఆరుగురిలో మూడింట రెండొంతులు (నలుగురు) తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరుతూ సభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుక లేఖ ఇచ్చారు. రాజ్యసభలో టీడీపీ పక్ష నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఉప నేత సిఎం రమేష్, గరికపాటి మోహనరావు, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ వారిలో ఉన్నారు.
2019-06-20జమిలి ఎన్నికల (ఒకే దేశం.. ఒకే ఎన్నికలు) విధానం అమలుకోసం ఒక కమిటీని నియమించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఆ కమిటీ రాజకీయపరమైనదని, వివిధ పార్టీల నేతలు అందులో ఉంటారని రాజ్ నాథ్ చెప్పారు. జమిలి ఎన్నికలకు మద్ధతు కూడగట్టడంకోసం 40 పార్టీల అధ్యక్షులను కేంద్రం సమావేశానికి ఆహ్వానించగా 21 పార్టీల ముఖ్యులు హాజరయ్యారు.
2019-06-19 Read Moreముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా ఆయన చిరకాల మిత్రుడు సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఆయన కేబినెట్ ర్యాంకుతో ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించనున్నారు. సజ్జల జగన్ స్థాపించిన పత్రిక ‘సాక్షి’కి ఎడిటోరియల్ డైరెక్టర్ హోదాలో పని చేశారు.
2019-06-18తెలంగాణ కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణానికి ఈ నెల 27వ తేదీన భూమిపూజ చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. పాత సచివాలయం స్థానంలోనే కొత్త భవనాలను రూ. 400 కోట్లతోనూ, అసెంబ్లీ భవనాన్ని రూ. 100 కోట్లతో ఎర్రమంజిల్ లోనూ నిర్మిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుత అసెంబ్లీ భవనాన్ని వారసత్వ సంపదలా కాపాడుతామని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ మంత్రివర్గ సమావేశం అనంతరం నిర్ణయాలను సిఎం స్వయంగా ప్రకటించారు.
2019-06-18విభజననాటి ముందస్తు హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ప్రత్యేక కేటగిరి హోదా’ ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. హోదా విషయంలో ఏపీ అసెంబ్లీలో తీర్మానం రావడం ఇది మూడోసారి. గత ప్రభుత్వం రెండుసార్లు హోదాపై తీర్మానం చేసింది. అయితే, తర్వాత ‘ప్రత్యేక ప్యాకేజీ’కి అంగీకరిస్తూ కేంద్రానికి ధన్యవాద తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అందువల్లనే ఇప్పుడు.. ప్రత్యేక ప్యాకేజీ వద్దని, హోదానే కావాలని మరోసారి తీర్మానం చేయవలసి వస్తోందని జగన్ చెప్పారు.
2019-06-18ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కోన మంత్రివర్గంలో చోటు ఆశించారు. అయితే, ఈ విడతలో అవకాశం ఇవ్వలేకపోయిన సిఎం జగన్మోహన్ రెడ్డి ఉపసభాపతిగా ఎంపిక చేశారు. కోన గుంటూరు జిల్లా బాపట్ల నుంచి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మంగళవారం కోన ఎన్నికను ప్రకటించాక ఆయనను సభా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు వెంటబెట్టుకొని సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్లారు.
2019-06-18