ఉద్యమాలను అణిచేందుకు, మత విద్వేషాన్ని పెంచేందుకు ఫేస్ బుక్ ఉపయోగపడుతోందన్న విమర్శలకు ఊతమిచ్చే ఉదంతమిది. కేంద్ర వ్యవసాయ చట్టాల ఉపసంహరణకోసం పోరాడుతున్న రైతుల ఫేస్ బుక్ పేజీ ‘కిసాన్ ఏక్తా మోర్చా’ని ఆ సామాజిక మాధ్యమ సంస్థ నిలిపివేసింది. తన అనుబంధ సంస్థ ఇన్ట్సాగ్రామ్ లోనూ మోర్చా పేజీని బ్లాక్ చేసింది. మోర్చా పేజీ కమ్యూనిటీ ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఫేస్ బుక్ పేర్కొనగా, నిరసన స్వరాలను అణచివేయడానికి భారత ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని మోర్చా విమర్శించింది.
2020-12-20కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం మరింత ఉధ్రుతమవుతోంది. ఈ నెల 25-27 తేదీల్లో హర్యానాలో టోల్ గేట్ వసూళ్లను అడ్డుకోవాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. 23న రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నాయి. ఈ సందర్భంగా ఆ ఒక్క రోజు మధ్యాహ్న భోజనం వండకుండా సంఘీభావం తెలపాలని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ దేశ ప్రజానీకానికి విన్నవించారు. ఈ నెల 21న నిరసన స్థలాల వద్ద రైతులు 24 గంటల నిరాహార దీక్షను చేపడతారని స్వరాజ్ ఇండియా పార్టీ నేత యోగేంద్ర యాదవ్ ప్రకటించారు.
2020-12-20ఏపీలో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందో లేదో విచారణ చేయాల్సిందేనంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అక్టోబర్ 1న తాను ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించడానికి హైకోర్టు నిరాకరించడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ విన్నపాన్ని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం, హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ తదుపరి విచారణను శీతాకాల సెలవుల తర్వాత చేపడతామని ప్రకటించింది.
2020-12-18కరోనా మహమ్మారి కరాళ నృత్యానికి అధికంగా గురైన దేశాల్లో ఇండియా రెండవది. వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య కోటి దాటిన రెండో దేశంగా తాజాగా రికార్డులకు ఎక్కింది. కరోనా పాజిటివ్ కేసులు శుక్రవారానికి 1,00,04,506కి చేరగా వారిలో 1,45,190 మంది మరణించారు. అమెరికా 1,72,33,022 కేసులతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా, బ్రెజిల్ 71,10,434 కేసులతో మూడో స్థానంలో నిలిచింది. మరణాల్లోనూ అమెరికా (3,11,010) మొదటి స్థానంలో ఉండగా, బ్రెజిల్ (1,84,827) రెండో స్థానంలో ఉంది. కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యల్లో ఈ మూడు దేశాల నాయకత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి.
2020-12-18ప్రధానమంత్రి శుక్రవారం చేసిన ప్రసంగంలో రైతులపైనే దాడికి దిగారని, కనీస మద్ధతు ధర (ఎం.ఎస్.పి)పై అబద్ధాలు చెప్పారని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. ‘‘ప్రతిపక్ష పార్టీలతో సంబంధం ఉందంటూ ప్రధానమంత్రి భారత రైతాంగంపైనే బహిరంగ పార్టీ దాడిని ప్రారంభించారు’’ అని అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ (ఎ.ఐ.కె.ఎస్.సి.సి) ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఆయన దేశ కార్యనిర్వాహక వ్యవస్థకు బాధ్యతాయుతమైన అధిపతిగా సమస్యలను పరిష్కరించాల్సిన పాత్రను విస్మరించి, ఒక పార్టీ నాయకుడిగా తనను తాను కుదించుకున్నారు’’ అని విమర్శించింది.
2020-12-18కొత్త వ్యవసాయ చట్టాలు అమలైతే కనీస మద్ధతు ధర (ఎం.ఎస్.పి) రద్దవుతుందన్న మాట కంటే పెద్ద అబద్ధం మరేదీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కొత్త చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతు మహోద్యమం జరుగుతున్న నేపథ్యంలో.. తమ విధానాలను మోదీ మరోసారి సమర్ధించుకున్నారు. ఈ చట్టాలు రాత్రికి రాత్రే రాలేదని, 20-30 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణలపై సవివరంగా చర్చించాకే చట్టాలు తెచ్చామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జరుగుతున్న ఆందోళన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని మరోసారి ఆరోపించారు.
2020-12-18పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న రాజస్థాన్ అధికార కాంగ్రెస్, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంజుకుంది. పన్నెండు జిల్లాల్లోని 50 పట్టణాల్లో 1,775 వార్డులకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 619, బిజెపి 548 గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్ధుల (596) కంటే బిజెపికి తక్కువ వార్డులు వచ్చాయి. ఇటీవల పంచాయతీరాజ్ ఎన్నికల్లో 12 జిల్లా ప్రముఖ్ స్థానాలను బిజెపి గెలవగా, కాంగ్రెస్ 5కి పరిమితమైంది. తాజా ఫలితాల తర్వాత మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్, బిజెపి పట్టణ ఓటర్లకు దూరమవుతోందని విశ్లేషించారు.
2020-12-142020 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న చైనా, దాన్ని సాధించింది. దేశంలో పేదరికంతో బాధపడిన ప్రజలందరినీ ప్రస్తుత ప్రమాణాల (వార్షికాదాయం 4,000 యువాన్లు లేదా సుమారు రూ. 45,000) ప్రకారం దారిద్య్రరేఖ ఎగువకు తీసుకొచ్చినట్టు ఆ దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్ సోమవారం ప్రకటించారు. చైనాలో 2012 నుంచి ఏకంగా 9.9 కోట్ల మంది ఈ రేఖను అధిగమించారు. గ్విజౌ ప్రావిన్సులో పేదరికంతో బాధపడిన చివరి తొమ్మిది కౌంటీలు కూడా దారిద్య్రరహితంగా మారినట్టు ప్రకటించాక జిన్‌పింగ్ మాట్లాడారు.
2020-12-142022 ఖరీఫ్ సీజన్ నాటికి పోలవరం నీటిని పంట పొలాలకు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలవరం డ్యాం ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించబోమని స్పష్టం చేశారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన సిఎం, నిర్మాణ పురోగతిని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో 2021 ఫిబ్రవరి లేదా మార్చినాటికి సహాయ పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.
2020-12-14మద్రాస్ ఐఐటి కరోనా హాట్ స్పాట్ గా మారింది. ఆవరణలో 104 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్టు తమిళనాడు వైద్య ఆరోగ్య అధికారులు తెలిపారు. దీంతో ఐఐటి ఆవరణను తాత్కాలికంగా మూసివేశారు. వీరందరికీ వైరస్ ఎక్కడి నుంచి వ్యాపించిందనే అంశంపై ఆరోగ్య శాఖ అధికారులు, ఐఐటి యాజమాన్యం అన్వేషిస్తున్నాయి. ఈ నెల7వ తేదీన విద్యా సంస్థల పున:ప్రారంభానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతించిన తర్వాత చెన్నైలో అతిపెద్ద కరోనా క్లస్టర్ గా ఈ ఐఐటి అవతరించింది. ఐఐటిలో 447 నమూనాలను సేకరించగా అందులో 20 శాతం పైగా పాజిటివ్ రావడం ఆందోళనకరం.
2020-12-14