చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఒక్కడి దగ్గరే రూ. 2000 కోట్లు దొరికాయంటూ వైసీపీ ఊదరగొడుతుంటే.. రూ. 2.63 లక్షల నగదు, 12 తులాల బంగారమేనని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. సాక్ష్యంగా ఆదాయ పన్ను శాఖ పంచనామా నివేదికను బహిర్గతం చేసింది. శ్రీనివాస్ సహా పలువురు వ్యక్తులు, కంపెనీలకు చెందిన 40 ప్రదేశాల్లో 10 రోజుల క్రితం ఐటి సోదాలు జరిగాయి. మొత్తం రూ. 2000 కోట్ల మేరకు అనధికార లావాదేవీలు జరిగాయని ఐటి పేర్కొంది. అయితే, అంత మొత్తం ఒక్క శ్రీనివాస్ వద్దే దొరికినట్లు ప్రచారం సాగింది.
2020-02-16కర్నాటకలో సంప్రదాయ దున్నపోతుల రేసు (కంబాల)లో అతివేగంగా పరుగెత్తిన ఓ యువకుడు ఇంటర్నెట్ సంచలనమయ్యాడు. కంబాల జాకీ శ్రీనివాస గౌడ (28) దున్నపోతుల జతతో నీళ్లున్న గోదాలో 142.50 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకన్లలో దాటినట్టు రేసు నిర్వాహకులు నమోదు చేశారు. అందులో 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలోనే దాటినట్లు చెబుతున్నారు. అదే నిజమైతే.. ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల్లో జమైకా పరుగుల రాజు ఉసేన్ బోల్ట్ రికార్డు (9.58 సెకన్ల) కంటే మెరుగైన రికార్డు అవుతుంది.
2020-02-14‘‘ఫేస్ బుక్’లో నేను నెం.1, మోడీ నెం.2.. జుకర్ బెర్గ్ చెప్పాడు’ అని ట్రంప్ ‘గొప్ప’గా ప్రకటించారు. వాస్తవంలో ఫేస్ బుక్, శాంసంగ్ బ్రాండ్లను మినహాయిస్తే.. వ్యక్తుల్లో క్రిస్టియానో రొనాల్డో (12.53 కోట్ల ఫాలోయర్లు), మార్క్ జుకర్ బెర్గ్ (11.66 కోట్లు), పాప్ సింగర్ షకీరా (10 కోట్ల లైక్స్) ముందున్నారు. టాప్ 100 ‘ఫేస్ బుక్’ పేజీలలో ట్రంప్ జాడ లేదు. మన ప్రధాని మోడీది 79వ స్థానం. రాజకీయ నాయకుల్లో బరాక్ ఒబామా (5.50 కోట్ల లైక్స్), మోడీ (4.46 కోట్ల లైక్స్) ముందున్నారు. ఈ కేటగిరిలో మోడీ నెంబర్2నే గానీ, ట్రంప్ నెంబర్ 1 కాదు.
2020-02-15‘ఫేస్ బుక్’లో తాను నెంబర్ 1.. భారత ప్రధాని నరేంద్ర మోడీ నెంబర్ 2 అని సామాజిక మాథ్యమ అధినేత మార్క్ జుకెర్ బెర్గ్ చెప్పినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అది ‘గొప్ప గౌరవం’గా అభివర్ణించుకున్నారు. తాను ‘ఫేస్ బుక్’లో నెంబర్ 1 అని మార్క్ చెప్పినట్టు ట్రంప్ ఇంతకు ముందు ఓసారి చెప్పుకున్నారు. ఈ నెల చివరి వారంలో ఇండియా పర్యటనకు వస్తున్న సందర్భంగా మోడీతో కలిపి ర్యాంకులు ప్రకటించారు. అయితే, ట్రంప్ చెప్పిన ర్యాంకులు ఏ విషయంలోనో చాలా మందికి అర్దం కాలేదు.
2020-02-15తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్లో జరుగుతుంది. కొత్త రెవెన్యూ చట్టం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టడం వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. ఈ దిశగా కేబినెట్ భేటీకి ఏర్పాట్లు చేయాలని సిఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించారు.
2020-02-15‘ఆధార్’తో అనుసంధానించని ‘పాన్’ కార్డులు మార్చి 31 తర్వాత పనికిరావని ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది. జనవరి 27 వరకు దేశంలో 30.75 కోట్ల పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) కార్డులు ‘ఆధార్’తో అనుసంధానమయ్యాయి. ఇంకా 17.58 కోట్ల పాన్ కార్డులు మిగిలాయి. పాన్, ఆధార్ అనుసంధానంకోసం పలుమార్లు డెడ్ లైన్ పొడిగించిన అధికారులు, 2020 మార్చి 31 చివరిదని చెబుతున్నారు. 12 అంకెల బయోమెట్రిక్ ఐడీ కార్డు ‘ఆధార్’ రాజ్యాంగబద్ధమేనని 2018 సెప్టెంబరులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
2020-02-15శాసన మండలి రద్దుకోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానంపై తదుపరి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు. తనకు ప్రతిష్ఠాత్మకంగా మారిన మండలి అంశంపై మొన్న ప్రధాని నరేంద్ర మోడీకి విన్నవించిన జగన్, శుక్రవారం అమిత్ షాకు కూడా నివేదించారు. హత్యాచారం కేసుల్లో ‘మరణ శిక్ష’ ప్రతిపాదిస్తూ శాసనసభ ఆమోదించిన ‘దిశ’ బిల్లుకు చట్ట రూపం ఇవ్వాలని జగన్ కోరారు. విభజన హామీలపై మరోసారి వినతిపత్రం సమర్పించారు.
2020-02-14రాజధాని తరలింపునకు ఉద్ధేశించిన రెండు బిల్లులపై సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేయాలన్న శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ఆదేశాలను కార్యదర్శి మరోసారి ధిక్కరించారు. కమిటీల ఏర్పాటు ప్రతిపాదన శాసన నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ ఫైలును తిప్పి పంపారు. మొదటిసారి కార్యదర్శి ఫైలును తిప్పి పంపగానే అధికార పార్టీ నేతలు ఓ వాదన ముందుకు తెచ్చారు. 14 రోజుల గడువులోగా సెలక్ట్ కమిటీలు ఏర్పాటు కానందున.. బిల్లులు ఆమోదం పొందినట్టుగానే భావించాలని వారు చెబుతున్నారు.
2020-02-14151 సీట్లు వచ్చాయనే ధీమాతో ఇష్టానుసారం వ్యవహరిస్తే అవి పోవడానికి ఎక్కువ సమయం పట్టదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. రాజధాని తరలింపునకు నిరసనగా సిపిఎం శుక్రవారం విజయవాడ ‘ధర్నా చౌక్’లో తలపెట్టిన 24 గంటల దీక్షలో మధు పాల్గొన్నారు. జర్మనీ పార్లమెంటులో నియంత హిట్లర్ కు ఓ సమయంలో 600కు పైగా సీట్లు వచ్చాయని, చివరికి ఆత్మహత్య చేసుకున్నాడని ఈ సందర్భంగా మధు చెప్పారు.
2020-02-14ఏపీలో సవరించిన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. దాని ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,37,394. పురుషులు 1,97,21,514, మహిళలు 2,02,04,378. థర్డ్ జెండర్ ఓటర్లు 4,066. ఎన్.ఆర్.ఐ. ఓటర్లు 7,436. మొత్తంలో సర్వీసు ఓటర్లు 65,388. 2019 డిసెంబరు 23న ప్రకటించిన ముసాయిదా జాబితాపై జనవరి 22 వరకు విన్నపాలను స్వీకరించారు. కొత్తగా 1,63,030 (0.41%) మందిని చేర్చి 60,412 (0.15%) పేర్లు తొలగించారు. స్థూలంగా ముసాయిదా జాబితాకు 0.26 శాతం చేర్పులు జరిగాయి.
2020-02-14