గత ఎన్నికల్లో ఓడిపోయినవారిలో ఇద్దరికి ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గంలో చోటిచ్చారు. ఒకప్పుడు తనకోసం మంత్రి పదవిని కూడా వదులుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, తనపై కేసుల్లో సహనిందితుడిగా జైలుకు వచ్చిన మోపిదేవి వెంకటరమణ లను మంత్రివర్గంలో చేర్చుకున్నారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన మోపిదేవి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారు. సమీప భవిష్యత్తులో వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మంత్రులుగా కొనసాగించనున్నారు.
2019-06-07తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యుల్లో 12 మందిని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ శాసనసభ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. కాంగ్రెస్ తరపున గెలిచిన 18 మందిలో మూడింట రెండొంతుల మంది తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ కు విన్నవించారు. వారిని తమ సభ్యలుగా గుర్తిస్తున్నట్టు టీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు అసెంబ్లీ సచివాలయానికి తెలిపారు. దీంతో, రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు 4వ పేరాను అనుసరించి స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసెంబ్లీ నోటిఫికేషన్ పేర్కొంది.
2019-06-06సీనియర్ ఐఎఎస్ అధికారి పీవీ రమేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చంద్రబాబు హయాంలో ఆర్థిక శాఖలో పని చేసిన పీవీ రమేష్, తర్వాత డిప్యుటేషన్ పై రాష్ట్రం వదిలి వెళ్లారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి వచ్చిన ఆయనకు సిఎంఒలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. కాగా గతంలో ముఖ్యమంత్రికి ఒ.ఎస్.డి.గా నియమితులైన ఐఎఎస్ అధికారి జె. మురళి పోస్టింగ్ ను సిఎంకు అదనపు కార్యదర్శిగా మార్చారు.
2019-06-07రెండున్నరేళ్ళ తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేస్తానని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రేపు ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు రెండున్నరేళ్ళ తర్వాత రాజీనామా చేయడానికి సిద్ధపడాలని ముందే స్పష్టం చేశారు. అప్పుడు కొత్తవారికి అవకాశం ఇస్తానని జగన్ చెప్పారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కేబినెట్ కొలువుదీరక ముందే జగన్ ప్రకటించిన ఈ నిర్ణయంపై చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు.
2019-06-07రేపు ఏర్పాటు కానున్న మంత్రివర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారంనాడిక్కడ కీలక ప్రకటన చేశారు. 25 మందితో ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తానని, అందులో ఐదుగురికి డిప్యూటీ సిఎం హోదా కల్పిస్తానని పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు సామాజికవర్గాలనుంచి ఒక్కొక్కరిని డిప్యూటీలుగా గుర్తించనున్నట్టు చెప్పారు. మంత్రివర్గంలో ఆయా వర్గాలకు 50 శాతం స్థానాలు ఉంటాయని కూడా ప్రకటించారు.
2019-06-07ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఈ నెల 8వ తేదీన ఉదయం 11.49 గంటలకు అమరావతి సచివాలయ ప్రాంగణంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం గురువారం సమీక్షించారు. బందోబస్తు వివరాలను పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ వివరించారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేవారికోసం ఆహ్వాన పత్రికల వెనుకే రూట్ మ్యాప్ ముద్రించాలని సిఎస్ సూచించారు.
2019-06-06ఈ ఎన్నికల్లో ఓటమి తనకు ఓ అనుభవమని, ఓటమిని ఓటమిలా కాకుండా ఒక అనుభవంగా తీసుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఇతర ముఖ్య నేతలతో పవన్ సమావేశమయ్యారు. లక్షలాది మంది ఓట్లు వేశారంటే అది విజయమేనని పవన్ ఉద్ఘాటించారు. పార్టీని ఎదగనివ్వకూడదని కొన్ని బలమైన శక్తులు పని చేయడంతోనే వ్యతిరేక ఫలితాలు వచ్చాయన్నారు.
2019-06-06అవినీతి రహితంగా పారదర్శకంగా పరిపాలన సాగిస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే, రహస్య జీవోల పరంపర మాత్రం కొనసాగుతోంది. గురువారం ఒక్క రోజే ఒక్క ఆర్థిక శాఖలోనే నాలుగు రహస్య జీవోలు విడుదలయ్యాయి. గురువారం ఆర్థిక శాఖ జారీ చేసింది ఈ నాలుగు జీవోలే కావడం గమనార్హం. జీవో ఆర్.టి. నెంబర్ 1094 నుంచి 1097వరకు జీవోలను ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.
2019-06-06సాఫ్ట్ వేర్ దిగ్గజం ‘విప్రో’ వ్యవస్థాపక ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ జూలై 30వ తేదీన రిటైర్ కానున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ప్రేమ్ జీ ప్రస్తుతం కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పోస్టుల్లో ఉన్నారు. అయితే, ఆయన కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మరో ఐదేళ్ళు కొనసాగనున్నారు. ఆయన తనయుడు రిషద్ ఎ ప్రేమ్ జీ ఇక విప్రోకు సారథ్యం వహిస్తారు. రిషద్ జూలై 31 నుంచి ఐదేళ్ళపాటు హోల్ టైమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారు.
2019-06-06 Read Moreజీడీపీ వృద్ధి రేటు అంచనాను రిజర్వు బ్యాంకు 7.2 నుంచి 7 శాతానికి తగ్గించింది. 2019-20లో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం ఉంటుందని ఏప్రిల్ ద్రవ్యపరపతి విధాన పత్రంలో పేర్కొన్నారు. గురువారం వెల్లడించిన విధాన పత్రంలో ఈ అంచనా మారింది. 2018-19 చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు కేవలం 5.8 శాతంగా నమోదు కావడం.. పెట్టుబడులు, ఎగుమతుల తగ్గుదలను ప్రతిఫలించిందని రిజర్వు బ్యాంకు పేర్కొంది. ఇటీవలి నెలల్లో..ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినిమయం తగ్గిందని తెలిపింది.
2019-06-06