‘కరోనా’పై ముందు జాగ్రత్తలు తీసుకోకుండా వేలమంది బలి కావడానికి కారణమైన ట్రంప్, తన బాధ్యతనుంచి తప్పించుకోవడానికే చైనా, డబ్ల్యుహెచ్ఒ లపైకి నిందను నెడుతున్నారని అమెరికన్లు మండిపడుతున్నారు. ‘‘డబ్ల్యుహెచ్ఒ ప్రయత్నం అసంపూర్ణమే. అయితే, ట్రంప్ యంత్రాంగం కంటే చాలా బెటర్. డబ్ల్యుహెచ్ఒ సత్వరమే వైరస్ పరీక్షను ప్రారంభించింది. అమెరికా ఇప్పటికీ చాలినన్ని పరీక్షలు చేయడంలేదు. వ్యక్తిగత రక్షణ సామాగ్రి లేదు’’ అని జర్నలిస్టు నికోలాస్ క్రిస్టోఫ్ విమర్శించారు. ‘కరోనా’పై చైనా కష్టపడుతోందని, పారదర్శకంగా వ్యవహరిస్తోందని అనేకసార్లు ప్రశంసించిన ట్రంప్.. ఇప్పుడు ఆరోపణలు చేయడమేంటని చాలామంది ప్రశ్నిస్తున్
2020-04-15ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ)కు నిధులను నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ‘విఫల’మైందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘కరోనా’ ప్రభావంపై సమాచారాన్ని చైనా కప్పిపుచ్చిందని, దానికి డబ్ల్యుహెచ్ఒ సహకరించిందని గత కొద్ది రోజులుగా ట్రంప్ ఆరోపిస్తున్నారు. ‘‘అక్కడేం జరుగుతోందో ప్రతి ఒక్కరికీ తెలుసు’’ అని ట్రంప్ మంగళవారం (అమెరికా కాలమానం) విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. డబ్ల్యుహెచ్ఒ నిర్వహించిన పాత్రపై అమెరికా సమీక్షించనున్నట్టు చెబుతున్నారు.
2020-04-15గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానిని కలసిన కొద్ది గంటల్లోనే.. అహ్మదాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలాకు ‘కరోనా’ నిర్ధారణ కావడం రాష్ట్రంలో కలకలం రేపింది. కరోనా వైరస్ వ్యాపించిన ప్రాంతంలో పరిస్థితిపై చర్చించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖేడావాలా, గయాసుద్దీన్ షేక్, శైలేష్ పార్మర్ మంగళవారం సిఎంను కలిశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, హోంమంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజా కూడా ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ సమావేశం జరిగితే.. ఖేడావాలాకు ‘కరోనా’ నిర్ధారణ అయినట్టు రాత్రి 8 గంటలకు ప్రకటించి ఆసుపత్రిలో చేర్చారు.
2020-04-14దేశవ్యాప్తంగా ‘లాక్ డౌన్’ను మరో 19 రోజులు పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన కొద్దిసేపటికే ముంబై వీధుల్లో వలస కార్మికులు కదం తొక్కారు. సుమారు 3000 మంది కార్మికులు బాంద్రా ప్రాంతంలో నిరనస తెలిపారు. తమను సొంత ప్రాంతాలకు పంపాలని డిమాండ్ చేశారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మార్చి 24 అర్ధరాత్రి నుంచి దేశం మొత్తాన్ని దిగ్బంధిస్తున్నట్టు కేవలం 4 గంటల ముందు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ హఠాత్ప్రకటన లక్షల మంది వలస కార్మికులను వీధులపాల్జేసింది. ఈ రోజు సడలింపు ప్రకటన చేస్తే సొంత ప్రాంతాలకు వెళ్లవచ్చనుకుంటే నిరాశే ఎదురైంది.
2020-04-14తెలంగాణ రాష్ట్రంలో ‘కరోనా’ వైరస్ వ్యాప్తి మందగించలేదు. మంగళవారం 52 కొత్త కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు. దీంతో కలిపి మొత్తం కరోనా సోకినవారి సంఖ్య 644కు పెరిగింది. ఇప్పటిదాకా 18 మంది మరణించగా 110 మంది కోలుకున్నారు. మొత్తం 33 జిల్లాలకు గాను 28 జిల్లాల్లో ‘కరోనా’ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 516 మంది చికిత్స తీసుకుంటుండగా అందులో దాదాపు సగం (249 మంది) హైదరాబాద్ వాసులే. భాగ్యనగరం తర్వాత నిజామాబాద్ లో అధికంగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం కొత్త కేసులు 52 నమోదైతే డిశ్చార్జి అయింది ఏడుగురు మాత్రమే!
2020-04-14ఇండియాలో తొలి ‘కరోనా’ కేసు నమోదై రెండున్నర నెలలు గడచినా నిన్నటిదాకా ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఒక్కరికి కూడా వైరస్ నిర్ధారణ కాలేదు. అనూహ్యంగా ఓ డాక్టరుకు ‘కరోనా’ సోకినట్టు సోమవారం నిర్ధారణ అయింది. ఆయన ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేయలేదు. అయినా వైరస్ సోకడాన్ని బట్టి ఎవరో ‘సైలెంట్ క్యారియర్’ అంటించి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పుడా అజ్ఞాత ‘కరోనా’ కారకుడికోసం మేఘాలయ ప్రభుత్వం జల్లెడ పడుతోంది. ఒక్క కేసు బయటపడటంతోనే రాజధాని షిల్లాంగ్ నగరంలో రెండు రోజులు కర్ఫ్యూ విధించింది.
2020-04-14అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా ఖరారైన జో బైడెన్ కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్ధతు ప్రకటించారు. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. తన స్నేహితుడికి మద్ధతు తెలిపినందుకు గర్వంగా ఉందని ఒబామా మంగళవారం ఒక వీడియో సందేశంలో చెప్పారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధిత్వంకోసం పోటీ పడిన బెర్నీ శాండర్స్ తప్పుకోవడంతో జో బైడెన్ పేరు ఖరారైంది. శాండర్స్ తప్పుకోవడంలోనూ ఒబామా కీలక పాత్ర పోషించినట్టు వార్తలు వచ్చాయి.
2020-04-14ఈ ఆదివారం (ఏప్రిల్ 12)తో ముగిసిన వారానికి దేశంలో నిరుద్యోగం రేటు 24 శాతానికి పెరిగింది. ‘కరోనా’ కట్టడికోసం విధించిన ‘లాక్ డౌన్’ అసంఘటిత రంగాలపై దారుణమైన ప్రభావాన్ని చూపింది. ‘లాక్ డౌన్’ విధించాక మొదటి (మార్చి చివరి) వారమే నిరుద్యోగం ఉప్పెనలా 23.8 శాతానికి ఎగసింది. అంతకు ముందు దేశంలో నిరుద్యోగం రేటు 7 నుంచి 8 శాతంగా ఉండేది. ఒక్కసారిగా మూడు రెట్లు పెరిగిన నిరుద్యోగ రేటు ఆర్థిక నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం దేశంలో.. ఉపాధి రేటు (27 శాతం), నిరుద్యోగం రేటు దాదాపు సమానంగా ఉండటం ఓ జాతీయ విషాదం.
2020-04-14 Read Moreఏప్రిల్ 15 నుంచి మే 3వ తేదీ వరకు రైల్వే ప్రయాణంకోసం ప్రజలు బుక్ చేసుకున్న టికెట్లు మొత్తం రద్దు కానున్నాయి. మంగళవారంతో పూర్తయిన దేశవ్యాప్త ‘లాక్ డౌన్’ను మరో 19 రోజులపాటు పొడిగించడంతో.. పాసెంజర్ రైలు సర్వీసులను రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15, మే 3 మధ్య ప్రయాణానికి 39 లక్షల టికెట్లు బుక్ అయ్యాయని అధికారులు తెలిపారు. ఇప్పుడా టికెట్లను రద్దు చేయడంతోపాటు ఆ తర్వాత కాలానికి అడ్వాన్స్ బుకింగ్ ను కూడా నిలిపివేశారు. రద్దయిన టికెట్లకు సంబంధించి మొత్తాన్ని ప్రయాణీకులకు తిరిగి చెల్లిస్తారు.
2020-04-14అనంతపురం జిల్లాలో ఓ తాసీల్దారుకు ‘కరోనా’ సోకింది. హిందూపురంలో నివశిస్తున్న ఆ తాసీల్దారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో విధులకు హాజరు కాకపోవడంతో పరీక్షించినట్టు కలెక్టర్ గంధం చంద్రుడు మంగళవారం తెలిపారు. ఇప్పుడా తాసీల్దారు హాజరైన సమావేశాల్లో పాల్గొన్న అందరికీ ‘కరోనా’ టెన్షన్ పట్టుకుంది. ఇటీవల మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి నిర్వహించిన సమావేశానికి తాసీల్దార్ హాజరయ్యారు. తాసీల్దారుకు కరోనా పాజిటివ్ రావడంతో ఎమ్మెల్యే సహా పలువురు ‘సెల్ఫ్ క్వారంటైన్’లోకి వెళ్ళారు.
2020-04-14