ఈశాన్య ఢిల్లీలో సిఎఎ అనుకూల, వ్యతిరేక ఆందోళనకారుల మధ్య ఘర్షణ నలుగురి మృతికి కారణమైంది. సిఎఎ వ్యతిరేక శిబిరాలను పోలీసులు తొలగించకపోతే తామే ఖాళీ చేయిస్తామని బిజెపి నేత కపిల్ మిశ్రా నిన్న ప్రకటించిన తర్వాత హింస ప్రారంభమైంది. సోమవారం సిఎఎ అనుకూలురు నిరసన శిబిరాలపై పడ్డారు. ఇరు వర్గాల రాళ్ళ దాడులు, దహనాలు, కాల్పులు, లాఠీచార్జీ, బాష్ఫవాయు ప్రయోగాలతో దేశ రాజధాని అట్టుడికిపోయింది. మరణించిన నలుగురిలో ఒకరు, గాయపడిన 50 మందిలో 10 మంది పోలీసులు.
2020-02-24అధికార వైసీపీకి, అమరావతి రైతులకు మధ్య వివాదాన్ని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మరింత రాజేశారు. ఆదివారం అమరావతి ఆలయం వద్ద రోడ్డు ప్రక్కన నిరసన తెలుపుతున్న రాజధాని రైతును ఎంపీ కారు ఢీకొట్టింది. కింద పడిన రైతు తాడికొండ హనుమంతరావును పట్టించుకోకుండా ముందుకు కదిలిన ఎంపీ కారును సహచర రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు ఎంపీ సురేష్ కారులోనే ఉన్నారు. తుళ్ళూరుకు చెందిన హనుమంతరావు కాలికి గాయమైంది.
2020-02-23పురుషుల క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును పదేళ్ల కిందట సరిగ్గా ఈ రోజు (ఫిబ్రవరి 24న) సచిన్ టెండూల్కర్ సాధించాడు. వన్డే ఫార్మాట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా 2010 ఫిబ్రవరి 24న సచిన్ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో 7 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. అప్పట్లో ఇండియా పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టుతో గ్వాలియర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సచిన్ ఈ ఫీట్ సాధించాడు. అయితే, మహిళా క్రికెట్లో సచిన్ కంటే 13 సంవత్సరాల ముందే ఆస్ట్రేలియా క్రీడాకారిణి బెలిండా క్లార్క్ చరిత్ర సృష్టించింది.
2020-02-24ఒంటిపై తన రూపాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్న ఓ అభిమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఊహించని బదులిచ్చారు. ‘‘ఇది నిజమేనా!! సారీ బ్రదర్... దీన్ని నేను సమర్ధించను.. ఆమోదించను. ఇది పూర్తిగా అనారోగ్యకరమైనది.. కలతపెట్టేది.’’ అని ట్వీటారు. టి.ఆర్.ఎస్. విద్యార్ధి విభాగానికి చెందిన ఈ వ్యక్తి ‘‘రామన్న మై బాస్’’ అంటూ వీపుపై పొడిపించుకున్న పెద్ద పచ్చబొట్టు ఫొటోను షేర్ చేస్తూ.. కేటీఆర్ ను ట్యాగ్ చేశారు. దానిపై కేటీఆర్ స్పందనను నెటిజన్లు అభినందిస్తున్నారు.
2020-02-24చిత్తూరు జిల్లాలో మూడున్నర నెలల క్రితం ఓ చిన్నారిపై అత్యాచారం జరిపి హత్య చేసిన మహ్మద్ రఫీకి జిల్లా సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. గత నవంబర్ 7న ఓ వివాహంకోసం కుటుంబంతో కలసి కురబలకోట వెళ్లిన ఆరేళ్ల చిన్నారిని రఫీ కళ్యాణ మండపం సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు అభియోగం. నేరం జరిగాక నాలుగు రోజుల్లో నిందితుడిని పట్టుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. కోర్టు సత్వర విచారణను చేపట్టి 47 మంది సాక్షులను విచారించింది.
2020-02-24అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రాలో తాజ్ మహల్ అందాలను ఆస్వాదిస్తున్న వేళ... దేశ రాజధాని ఢిల్లీలో హింస చెలరేగింది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వ్యతిరేకులు, అనుకూలుర మధ్య ఘర్షణ తీవ్రమైన దాడులకు దారి తీసింది. అల్లరి మూకల రాళ్ళ దాడిలో రతన్ లాల్ అనే కానిస్టేబుల్ (గోకుల్ పూర్) మరణించారు. కొన్ని షాపులు, ఓ పెట్రోల్ బంకు, రోడ్లపై వాహనాలకు అల్లరి మూకలు నిప్పంటించాయి. అల్లరి మూకలో కొంతమంది తుపాకులతో రోడ్లపై స్వైర విహారం చేశారు.
2020-02-24ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి పౌరులను కాపాడుకోవడానికి అమెరికా, ఇండియా ఐక్యమయ్యాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం అహ్మాదాబాద్ మోతెరా స్టేడియంలో ప్రసంగించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ అధినేత అల్ బాగ్దాదిని అమెరికా చంపిన విషయాన్ని ట్రంప్ గుర్తు చేశారు. తన హయాంలో అమెరికా సైన్యం పూర్తి స్థాయిలో శక్తిమంతంగా తయారైందని ట్రంప్ చెప్పుకొచ్చారు.
2020-02-24రేపు (ఫిబ్రవరి 25న) 3 బిలియన్ డాలర్ల విలువైన హెలికాప్టర్ల అమ్మకానికి ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. సోమవారం అహ్మదాబాద్ మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ సభలో ఆయన మాట్లాడారు. అమెరికా చరిత్రలో అత్యంత శక్తివంతమైన, ఆధునిక, భయానక ఆయుధాలను తయారు చేసిందని ట్రంప్ చెప్పారు. అమెరికా, ఇండియా మధ్య సైనిక సంబంధాలు బలపడాలని ట్రంప్ ఆకాంక్షించారు.
2020-02-24అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ దేశాధ్యక్షుడు ద్విముఖ వ్యూహంతో రెండు రోజుల భారత పర్యటనకు వస్తున్నారు. అమెరికాలో ఉన్న 45 లక్షల భారతీయులలో సానుకూలత సాధించడం, అదే సమయంలో ఇండియా నుంచి పొందే హామీలతో అమెరికన్ కంపెనీలు- ఉద్యోగాలకు భరోసా ఇవ్వడం ట్రంప్ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. 24, 25 తేదీల పర్యటనకోసం ఆదివారం రాత్రి ట్రంప్ ఎయిర్ ఫోర్స్1లో భార్య మెలనియా ట్రంప్, కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుష్నర్ లతో కలసి బయలుదేరారు.
2020-02-23ఎంపీ నందిగం సురేష్ కారును అడ్డుకున్న రాజధాని మహిళలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదివారం రాత్రి రాజధాని మహిళలు పెద్ద మొత్తంలో అమరావతి పోలీసు స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ‘జై అమరావతి’ అనాలని కోరిన మహిళను ‘లం...’ అంటూ ఎంపీ ధూషించారని, ఎంపీ అనుచరులు గోళ్లతో రక్కారని ఓ మహిళ గాయాలు చూపించారు. ఎంపీ సురేష్, ఆయన అనుచరులపై ‘దిశ’ చట్ట కింద కేసులు నమోదు చేయాలని, వెంటనే అరెస్టు చేయాలని సహచరులు డిమాండ్ చేశారు.
2020-02-23