విశాఖపట్నం పరిధిలోని వెంకటాపురంలో ఎల్.జి. పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకై 11 మంది మరణించారు. మరో 250 మంది తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. స్టైరిన్ ద్రావకం కంటైనర్ నుంచి బయటకు వచ్చి ఆవిరై చుట్టుప్రక్కల 3 కిలోమీటర్ల వరకు వ్యాపించినట్టు సమాచారం. గురువారం వేకువజామున 2.30 గంటలకు ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రజలు నిద్రలోనే విషవాయువును పీల్చారు. శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ స్పృహ కోల్పోతున్నవారిని చూసి మిగిలినవారు భయకంపితులయ్యారు. అనేక మంది రోడ్లపైనే పడిపోగా ఆసుపత్రులకు తరలించారు. మృతులలో ఓ ఆరేళ్ళ పాప కూడా ఉంది.
2020-05-07ఇండియాలో ‘కరోనా’ కేసుల సంఖ్య 50 వేలు దాటింది. నిన్నటికే 49,391 కేసులు నమోదు కాగా, ఆ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ఈ రోజు రెండు రాష్ట్రాల్లోనే 2004 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 1,223, తమిళనాట అనూహ్యంగా 771 కొత్త కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో ఒక్క అహ్మదాబాద్ నగరంలోనే బుధవారం కొత్తగా 291 కేసులు నమోదయ్యాయి. యూపీలో 118, బెంగాల్ లో 112 కొత్త కేసులను ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 52 వేలకు చేరువైంది. మిగిలిన రాష్ట్రాల వివరాలు వచ్చేసరికి మొత్తం బాధితుల సంఖ్య 53 వేలు దాటవచ్చు.
2020-05-06‘‘నావెల్ కరోనా వైరస్ వుహాన్ లేబొరేటరీ నుంచే వ్యాపించింది’’.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పదే పదే చెబుతున్న మాట ఇది. అయితే, అమెరికాలో అత్యంత ప్రముఖుడైన అంటువ్యాధుల నిపుణుడు, ‘స్వేతసౌధం’ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఆంథొనీ ఫాసి ఈ వాదనను మరోసారి కొట్టిపారేశారు. ఈ వైరస్ లేబొరేటరీలో రూపొందింది గానీ, పొరపాటున అక్కడినుంచి వ్యాపించింది గానీ కాదని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫాసి తెగేసి చెప్పారు. ఈ వైరస్ మానవసృష్టి కాదని, ప్రకృతిలోనే రూపొంది మనుషులకు వ్యాపించినట్టు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని ఫాసి చెప్పారు.
2020-05-06అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర... ఆంధ్రలో టీడీపీ ఉన్నా, వైసీపీ వచ్చినా... భారీ కాంట్రాక్టులలో ఓ కంపెనీ హవా సాగుతోంది. త్వరలో రూ. 65 వేల కోట్ల అంచనా వ్యయంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టబోతున్న సాగునీటి ప్రాజెక్టులలో సగం పనులు ఈ ఒక్క కంపెనీకే వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. తనకు ఆసక్తి ఉన్న పనులన్నీ తనకు.. మిగిలిన కాంపొనెంట్స్ మాత్రం వేరేవారికి వెళ్ళేలా ఆ కంపెనీ వ్యూహరచన చేసినట్టు చెబుతున్నారు. ఈ కంపెనీకి ఇష్టం లేని కారణంగానే.. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్.ఎ.ఎం) ఆలోచనను ప్రభుత్వం విరమించుకుందని చర్చ జరుగుతోంది.
2020-05-06 Read Moreముడి చమురు ధరలు పతనమైనా పెట్రోలు, డీజిల్ రేట్లను తగ్గించని కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడా లాభం మొత్తాన్ని తన ఖజానాకు మళ్లిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో మంగళవారం అర్ధరాత్రి ఎక్సైజ్ సుంకాలను పెంచింది. పెట్రోలుపై లీటరుకు రూ. 10, డీజిలుపై రూ. 13 చొప్పున పెంచిన ఎక్సైజ్ సుంకాలు బుధవారం నుంచే అమల్లోకి రానున్నాయి. తాజా పెంపుతో ఎక్సైజ్ సుంకం లీటరు పెట్రోలుపై ఏకంగా రూ. 32.98కి, డీజిలుపై రూ. 31.83కు పెరిగింది. అయితే, ఈ పెరిగిన భారం మొత్తం వెంటనే ప్రజలపై పడదు. ముడిచమురు ధరల తగ్గుదల లాభాన్ని ఇప్పటిదాకా కంపెనీలు అనుభవించగా.. ఇప్పుడు కేంద్రం గుంజుకుంటోంది.
2020-05-06కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలు అవలంబిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆర్థిక రంగంలో ప్రధానమైన అధికారాలు కేంద్రం వద్ద ఉన్నాయని, అవి బదిలీ చేయడం గానీ లేదంటే నిధులు ఇవ్వడంగానీ చేయాలని, కేంద్రం ఏదీ చేయడంలేదని విమర్శించారు. తెలంగాణ సొంత ఆదాయం నెలకు రూ. 10,800 కోట్లు రావలసి ఉండగా.. గత నెల రూ. 1,600 కోట్లు మాత్రమే వచ్చాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హెలికాప్టర్ మనీ వంటి సూచనను పట్టించుకోకపోగా.. రాష్ట్రాలను ఇరకాటంలోకి నెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రం తీరు ఇలాగే కొనసాగితే రాష్ట్రాల నిరసన తప్పదని హెచ్చరించారు.
2020-05-05తెలంగాణలో మద్యం దుకాణాలను తెరవవలసిన అవసరం ఉందంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో మూతబడ్డ గుడుంబా కేంద్రాలు తెరుచుకున్నాయని, పొరుగున ఉన్న నాలుగు రాష్ట్రాల్లోనూ మద్యం షాపులు తెరవడంతో తెలంగాణవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్తున్నారని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్నిచోట్లా ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. భౌతిక దూరం పాటించకపోతే గంటలోనే షాపు మూతబడుతుందని యజమానులను సిఎం హెచ్చరించారు.
2020-05-05తెలంగాణలో ‘లాక్ డౌన్’ను మే 29 వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. ఏ వైరస్ కట్టడికైనా 70 రోజుల సైకిల్ చాలా ముఖ్యమని నిపుణులు చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణలో లాక్ డౌన్ అమలవుతుందని కేసీఆర్ చెప్పారు. రాత్రి వేళ కర్ఫ్యూ రాష్ట్రమంతా ఉంటుందని, సాయంత్రం 6 గంటలకే పని ముగించుకొని 7 గంటల లోపల ఇళ్ళకు చేరాలని ప్రజలకు సూచించారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవలసి ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పోలీసులు కఠినంగా ఉంటారని, సహకరించాలని ప్రజలకు విన్నవించారు.
2020-05-05‘కరోనా వైరస్’కు టీకా ఆగస్టులో వచ్చే అవకాశం ఉందని శాంతా బయోటెక్ యజమాని వరప్రసాదరెడ్డి చెప్పినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వెల్లడించారు. మంగళవారం తెలంగాణ కేబినెట్ భేటీ తర్వాత రాత్రి 9.45కు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని జీనోమ్ వ్యాలీ కేంద్రంగా పని చేస్తున్న భారత్ బయోటెక్, బిఇ, శాంతా బయోటెక్ కంపెనీల ముఖ్యులు తనను కలిశారని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ఆగస్టు, సెప్టెంబర్ లక్ష్యంగా రెండు వ్యాక్సిన్ ప్రయత్నాలు జరుగుతున్నాయని, మొదట తెలంగాణ నుంచే వ్యాక్సిన్ వెలువడితే అది గర్వకారణం అవుతుందని పేర్కొన్నారు.
2020-05-05‘లాక్ డౌన్’లో మద్యం షాపులు తెరవడంతో నిన్న నెలకొన్న రచ్చకు బాధ్యత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేతదేనని ప్రభుత్వం ఆరోపించింది. తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జిలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ద్వారా కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి క్యూలో నిలబెట్టారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆరోపించారు. ‘‘మాస్కులు వేసుకోకండి. గ్లౌజులు వేసుకోకండి. సామాజిక దూరం పాటించకుండా ఒకరిమీద ఒకరు పడుతున్నట్టు లైన్లో ఉండండి.. అని చెప్పి పార్టీ సానుభూతిపరులను, కార్యకర్తలను వైన్ షాపులపైకి ఎగదోయడం హేయం, దుర్మార్గం’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
2020-05-05