అమెరికా, ఇరాన్ మధ్య మాటల మంటలు బుధవారం రాత్రి సమయానికి తగ్గాయి. తమ మిలిటరీ కమాండర్ సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ వేకువజామున ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై దాడి చేసింది. అందులో 80 మంది మరణించారని ఇరాన్ ప్రకటిస్తే... తమ సైనికులు చనిపోలేదని ట్రంప్ చెప్పారు. ఇరాన్ వెనుకంజ వేసిందనీ వ్యాఖ్యానించారు. తమ స్థావరాలను టచ్ చేస్తే ఇరాన్ పై భీకర దాడి ఉంటుందని నిన్న మాట్లాడిన ట్రంప్, బుధవారం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు.
2020-01-08పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీన ప్రారంభం కానున్నట్టు సమాచారం. బడ్జెట్ సమావేశాల్లో తొలి భాగం ఫిబ్రవరి 11వరకు నిర్వహించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ సమావేశాల్లో రెండో భాగం మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 3 వరకు ఉంటాయని తెలుస్తోంది.
2020-01-09అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత కొద్దిగా తగ్గిన సూచనలు స్టాక్ మార్కెట్లలో ప్రతిబింబించాయి. గురువారం ఉదయం బి.ఎస్.ఇ. సెన్సెక్స్ 1.1 శాతం పెరుగుదలతో ప్రారంభమైంది. ఎస్&పి బి.ఎస్.ఇ. సెన్సెక్స్ 448 పాయింట్లు పెరిగి 41,250కి చేరింది. నిఫ్టీ 50 కూడా 133 పాయింట్లు పెరిగి 12,150 స్థాయికి చేరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ల్యాండ్, భారతీ ఎయిర్ టెల్ 2 శాతం చొప్పున పెరిగాయి.
2020-01-09 Read Moreభారత ఆర్థిక వృద్ధి మందగిస్తున్న వేళ బంగ్లాదేశ్ జీడీపీ 7 శాతం పైగా పెరగనుండటం విశేషమే. ఆ దేశ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 2019-20లో 7.2 శాతం, తర్వాత ఆర్థిక సంవత్సరం 7.3 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు తాజా అంచనాల్లో పేర్కొంది. గత జూన్ నాటి అంచనా కంటే కొంచెం తగ్గినా ఇండియాతో పోలిక మాత్రం లేదు. దక్షిణాసియాలో బంగ్లాదేశ్ మెరుగ్గా ఉంటే.. పాకిస్తాన్ అధ్వానంగా ఉంది. పాక్ ఆర్థిక వృద్ధి ఈ రెండేళ్లలో కేవలం 2.4, 3.0 శాతమే ఉంటుందని అంచనా.
2020-01-09భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు సవరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం వృద్ధి కేవలం 5 శాతం ఉంటుందని తాజా ‘‘వరల్డ్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్’’లో పేర్కొంది. ఈ మందగమనాన్ని ఇప్పటికే చాలా మంది ఊహించారు. అయితే, 2020-21లో జీడీపీ 5.8 శాతమే పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు చెప్పడం గమనించదగ్గ అంశం. వచ్చే ఏడాదన్నా మెరుగుపడుతుందని ఆశిస్తున్న ఇండియన్లకు ఈ అంచనా ఆందోళన కలిగిస్తోంది.
2020-01-09దీపికా పదుకొనే ‘‘ఛపాక్’’ సినిమాను బహిష్కరించామని చెప్పడానికి బిజెపి భక్తులు ఫేక్ ప్రచారానికి దిగారు. రద్దయిన ఒక్క సినిమా టికెట్ ను వందల మంది పోస్టు చేశారు. గుజరాత్ లోని వడోదరలో అకోట సినీమార్క్ ధియేటర్లో జనవరి 10న స్క్రీన్ 3లో గోల్డ్ ఎ8, ఎ9, ఎ10 సీట్లను బుక్ చేసుకున్నవాళ్ళు తర్వాత రద్దు చేసుకున్నారు. రూ. 420 రిఫండ్ అయింది. ఆ రసీదును బిజెపి ఐటి సెల్ సభ్యులు, ఇతర భక్తులు విపరీతంగా షేర్ చేశారు. ఈ భాగోతాన్ని ట్విట్టర్లో ఇతర నెటిజన్లు ఇట్టే పట్టేశారు.
2020-01-08 Read Moreఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్ పౌర విమానం (బోయింగ్ 737-800) కూలిన ఘటనలో 176 మంది మరణించారు. వారిలో 82 మంది ఇరాన్ దేశస్థులే. 63 మంది కెనడియన్లు, 11 మంది ఉక్రెయిన్ దేశస్థులు మరణించినవారిలో ఉన్నారు. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపాలే కారణమని ఇరాన్ ప్రకటించగా, తొలుత అంగీకరించిన ఉక్రెయిన్ ఎంబసీ తర్వాత వైఖరి మార్చుకుంది. దర్యాప్తు జరుగుతుండగా కారణాలు చెప్పలేమని ఎంబసీ పేర్కొంది.
2020-01-08దీపికా పదుకొనే యాసిడ్ దాడి బాధితురాలిగా నటించిన ‘ఛపాక్’ శక్తివంతమైన సినిమా అని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తేల్చారు. బుధవారం అర్ధరాత్రి దాటాక తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఈ సినిమాపై సమీక్షను పోస్టు చేశారు. ‘‘ఒక్క పదంలో సమీక్ష.. పవర్ ఫుల్’’ అని ప్రశంసించారు. గుండెను పిండేస్తుందని, సాధికారతకు చిహ్నమని పేర్కొన్నారు. సున్నితమైన రచన, నైపుణ్యవంతమైన దర్శకత్వం, గొప్ప నటనల కలబోతగా అభివర్ణించారు.
2020-01-09అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ పెరగడంతో... వాణిజ్య మార్గాలకు భద్రతకోసం ఇండియా బుధవారం గల్ఫ్ ప్రాంతానికి యుద్ధ నౌకలను పంపింది. ఇండియా భాగస్వామిగా ఉన్న ‘చాబహర్’ పోర్టు అభివృద్ధిపై ఈ ఘర్షణ ప్రభావం పడబోదని ఇరాన్ రాయబారి అలి చెగేని హామీ ఇచ్చారు. అమెరికాతో తమకున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇండియా తీసుకునే ఏ శాంతి చర్యలనైనా స్వాగతిస్తామని ఆయన చెప్పారు. కాగా ఉదయం... ఇరాక్ లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఇండియా అలర్ట్ జారీ చేసింది.
2020-01-08 Read Moreనాగ్ పూర్...బి.జె.పి. మాతృ సంస్థ ఆర్.ఎస్.ఎస్.కి కేంద్రం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర బిజెపి తాజా మాజీ ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ అక్కడివారే. అలాంటి కీలక ప్రాంతంలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో 58 సీట్లకు గాను 30 కాంగ్రెస్ గెలుచుకుంది. విదర్భ మొత్తంలో బి.జె.పి. పతనానికి నాగపూర్ జడ్.పి. ఎన్నిక నాంది అని ఎన్.సి.పి. చీఫ్ జయంత్ పాటిల్ వ్యాఖ్యానించారు. బిజెపికి బలమైన నాయకత్వం ఉన్నచోటే ఓడిపోయారని పాటిల్ పేర్కొన్నారు.
2020-01-08 Read More