ప్రభుత్వ రంగ బ్యాంకుల రెండు రోజుల సమ్మె శుక్రవారం ప్రారంభమైంది. బ్యాంకుల విలీనం సహా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వేతన సవరణ వంటి అంశాలపై 9 సంఘాల సమాఖ్య రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. సరిగ్గా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజే (శుక్రవారం ) ఉద్యోగులు సమ్మెకు దిగారు. జనవరి 8న ఓ రోజు సమ్మె జరిగింది. ఉద్యోగ సంఘాలు, యాజమాన్యాల మధ్య చర్చలు విఫలం కావడంతో ఇప్పుడు 2 రోజులు, మార్చిలో 3 రోజులు సమ్మె చేయాలని నిర్ణయించారు.
2020-01-31జనజేన పార్టీకి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. గురువారం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. ‘‘పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయంతో మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది’’ అని ఆ లేఖలో పవన్ ను ఆక్షేపించారు.
2020-01-30భారత ఆర్మీలో అతి పెద్దదైన దక్షిణాది కమాండ్ బాధ్యతలను లెఫ్టినెంట్ జనరల్ సి.పి. మహంతి గురువారం స్వీకరించారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, గోవా ఈ కమాండ్ పరిధిలో ఉన్నాయి. పూణెలోని కమాండ్ కేంద్ర కార్యాలయంలో గురువారం బాధ్యతల స్వీకారం లాంఛనంగా జరిగింది. ఒడిషాకు చెందిన మహంతికి పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో పని చేసిన అనుభవం ఉంది. ఇప్పటిదాకా దక్షిణాది కమాండ్ బాధ్యతలు నిర్వర్తించిన ఎస్.కె. సైని భారత ఆర్మీ వైస్ చీఫ్ గా ప్రమోటయ్యారు.
2020-01-30జాతిపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సే తరహాలోనే ప్రధాని నరేంద్ర మోడీలో అణువణువునా విద్వేషం నిండి ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గురువారం గాంధీ 72వ వర్ధంతి సందర్భంగా రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నియోజకవర్గంలో ‘సేవ్ కాన్స్టిట్యూషన్’ ర్యాలీ నిర్వహించారు. ‘‘గాడ్సే, మోడీ మధ్య తేడా లేదు. ఒక్క విషయంలో తప్ప... గాడ్సేని నమ్ముతానని చెప్పే ధైర్యం మోడీకి లేదు’’ అని రాహుల్ పేర్కొన్నారు.
2020-01-30 Read Moreఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ వద్ద కాల్పులు జరిపిన ఉన్మాదిని ఈ ఫొటోలో స్పష్టంగా చూడొచ్చు. అతని పేరు గోపాల్ (31) అని గుర్తించారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్ధులపై ఈ వ్యక్తి కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిపాడు. షాదాబ్ అనే విద్యార్ధి చేతికి బుల్లెట్ తగిలింది. కాల్పులు జరిపిన వ్యక్తి ‘‘జై శ్రీరామ్, స్వేచ్ఛ ఎవరికి కావాలి?’’ అంటూ కేకలు వేశాడు. గాయపడిన విద్యార్ధిని జామియా నగర్ హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చేర్చారు.
2020-01-30చైనాలోని వుహాన్ నగరంలో గుర్తించిన కరోనావైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికి చైనా లోనే 7736 మందికి వైరస్ సోకగా 170 మంది మృత్యువాత పడ్డారు. ఇండియా సహా మరో 18 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా చైనా నుంచి ప్రయాణాలు ఎక్కువగా సాగే తూర్పు ఆసియా దేశాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. విస్తరణ వేగం ఎక్కువగా ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) గురువారం అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది.
2020-01-30సిఎఎ వ్యతిరేకులను ఉద్ధేశించి ‘కాల్చి చంపండి’ అనే నినాదాలు ఇప్పించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎన్నికల ప్రచారానికి బ్రేకులు వేసిన ఈసీ, నిషేధాన్ని కేవలం మూడు రోజులకు పరిమితం చేసింది. విద్వేషపూరిత ప్రసంగాలు, నినాదాలు చేసిన మరో ఎంపి పర్వేష్ వర్మపై నాలుగు రోజుల నిషేధం విధించింది. సాక్షాత్తు కేంద్ర మంత్రే విద్వేషపూరిత నినాదాలు ఇచ్చిన నేపథ్యంలో... గురువారం ఢిల్లీ జామియా మిలియా వర్శిటీ వద్ద ఓ దుండగుడు కాల్పులు జరపడం గమనార్హం.
2020-01-30దేశ రాజధాని ఢిల్లీలో దారుణం. జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ వద్ద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నవారిపై ఓ ఉన్మాది కాల్పులు జరిపాడు. ‘మీకు స్వేచ్ఛ ఇదే.. తీసుకోండి’ అని అరుస్తూ.. కాల్పులు జరిపిన ఆ వ్యక్తిని పోలీసులు దూరంగా తీసుకుపోయారు. అతని చేతులకు రక్తం మరకలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడ్డారు. మరింత సమాచారం అందాల్సి ఉంది.
2020-01-30పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నవారిపై ఓ ఉన్మాది తుపాకి ఎక్కుపెట్టిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ వద్ద నిరసన తెలుపుతున్నవారికి తుపాకి చూపుతూ.. ‘మీకు స్వేచ్ఛ ఇక్కడ’ అంటూ కేకలు వేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓ కేంద్ర మంత్రి సహా బిజెపి నేతలు నిరసనకారులను ‘కాల్చి చంపండి’ అనే నినాదాలను ఇప్పించారు.
2020-01-30ఇండియాలో తొలి ‘కరోనావైరస్’ కేసు కేరళలో నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్శిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్ధికి వైరస్ సోకింది. ఆ విద్యార్ధిని పరీక్షించినప్పుడు కరోనా వైరస్ ‘పాజిటివ్’గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆసుపత్రిలో విడిగా ఉంచి చికిత్స అందిస్తున్నారని, పేషెంట్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉందని పేర్కొంది. అయితే, దేశ రాజధానిలో అనుమానిత మూడు కేసుల్లో కరోనావైరస్ ‘నెగెటివ్’గా తేలింది.
2020-01-30