పంజాబ్ మంత్రివర్గం నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేశారు. గత నెల 10న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సమర్పించిన రాజీనామా లేఖను సిద్ధు ఆదివారం ట్విట్టర్లో వెల్లడించారు. తన రాజీనామాను ముఖ్యమంత్రికి పంపుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. సిఎం కెప్టెన్ అమరీందర్ తో మొదటినుంచీ సిద్ధుకు పడటంలేదు. జూన్ 6న మంత్రివర్గ విస్తరణలో స్థానిక సంస్థల శాఖను సిద్ధూ నుంచి తప్పించారు. దీంతో 10వ తేదీన సిద్ధూ రాహుల్ గాంధీని కలసి రాజీనామా లేఖను సమర్పించారు.
2019-07-14 Read Moreలడఖ్ లోని డెంచోక్ సెక్టార్లో చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడలేదని సైన్యాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. జూలై 6వ తేదీన భారత సరిహద్దులోపల దలైలామా పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా ఆవిలివైపు నుంచి ఓ డజను మంది బ్యానర్లు ప్రదర్శించారని, ‘‘టిబెట్ ను చీల్చే కార్యకలాపాలను నిషేధించండి’’ అని ఆ బ్యానర్లపై రాసి ఉందని రావత్ వివరించారు. సింధు నదికి ఆవల ఇది జరిగిందని రావత్ శనివారం విలేకరులకు చెప్పారు.
2019-07-13 Read Moreటీవీ9 యాజమాన్య వివాద నేపథ్యంలో కేసులు ఎదుర్కొంటున్న మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకూడదని, పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని షరతులు విధించింది. 10 రోజుల్లో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. టీవీ9 కొత్త యాజమాన్యాన్ని ఇబ్బందులు పెడుతూ రవిప్రకాశ్ ఫోర్జరీకి, నిధుల మళ్ళింపునకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి.
2019-07-13 Read Moreటెన్నిస్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో రొమేనియా క్రీడాకారిణి సిమోనా హాలెప్ (27) టైటిల్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్ పోటీలో సెరెనా విలియమ్స్ ను 6-2, 6-2 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. సెరెనా విలియమ్స్(37) గతంలో ఏడుసార్లు ‘వింబుల్డన్ ఛాంపియన్’గా నిలవగా.. సిమోనాకు ఇది తొలి టైటిల్. ఒక రొమేనియా క్రీడాకారిణి వింబుల్డన్ టైటిల్ సాధించడం కూడా ఇదే ప్రథమం.
2019-07-13స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) ఎం.డి.గా పని చేస్తున్న అన్షులా కాంత్ ప్రపంచ బ్యాంకు ఎం.డి, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరుగా నియమితులయ్యారు. ఆమె నియామకాన్ని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ శుక్రవారం ప్రకటించారు. ప్రపంచ బ్యాంకుకు అన్షులా కాంత్ తొలి మహిళా ఎండీ. 35 సంవత్సరాల అనుభవం ఉన్న కాంత్, స్టేట్ బ్యాంకు సీ.ఎఫ్.ఒ.గా పని చేసినప్పుడు టెక్నాలజీని వినూత్న పద్ధతుల్లో వినియోగించారని డేవిడ్ పేర్కొన్నారు.
2019-07-12 Read More2019-20 బడ్జెట్లో సామాజిక పింఛన్లకు కేటాయింపులు పెరిగాయి. వృద్ధాప్య పింఛన్లకు రూ. 12801.04 కోట్లు, వికలాంగులకు రూ. 2133.62 కోట్లు, ఒంటరి మహిళలకు రూ. 300 కోట్లు, మత్స్యకారులకు రూ. 130 కోట్లు, ఎయిడ్స్ పేషెంట్లకు రూ. 100.19 కోట్లు, కల్లుగీత కార్మికులకు రూ. 78.85 కోట్లు, ట్రాన్స్ జెండర్లకు 7 కోట్లు, డయాలసిస్ రోగులకు 85 కోట్లు కేటాయించారు. మొత్తం అన్ని రకాల పింఛన్లకు కలిపి రూ. 15,635.7 కోట్లు ప్రతిపాదించారు.
2019-07-12కేంద్రం నుంచి పన్నుల్లో వాటా, గ్రాంట్ల రూపంలో 95,904.70 కోట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర పన్నుల్లో వాటా (34,833.18 కోట్ల)లో మారేదేం ఉండదు. అయితే, గ్రాంట్ల రూపంలో 61,071.52 కోట్లు అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆశ మాత్రమే. 2018-19 సవరించిన అంచనాల ప్రకారం గ్రాంట్లు, పన్నుల్లో వాటా కలిపి కేంద్రంనుంచి వచ్చిన మొత్తం రూ. 52,167.43 కోట్లు. ఈ ఏడాది దానికంటే రూ. 43,737.27 కోట్లు (83.84 శాతం) అదనంగా వస్తాయన్నది సిఎం ఆశ! కాదు కల!!
2019-07-122018-19 సవరించిన అంచనాలకంటే 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పరిమాణం రూ. 65,840.77 కోట్ల మేరకు పెరిగింది. ఒక్క ఏడాదిలో 40.61 శాతం పెరుగుదలకు తగినట్టుగా ఆదాయం ఎక్కడినుంచి వస్తుంది?! కేంద్ర గ్రాంట్ల రూపంలో గత ఏడాది (రూ. 19,456.72 కోట్లు) కంటే రూ. 41,614.8 కోట్లు అధికంగా వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. అంటే గ్రాంట్ల రూపంలోనే ఈ ఏడాది రూ. 61,071.52 కోట్లు వస్తాయన్నది రాష్ట్ర ప్రభుత్వ అంచనా. ఇది 214 శాతం పెరుగుదల. ఇది ఆశ కాదు.. కలే!!
2019-07-12సిఎం జగన్ ప్రధాన ఎన్నికల హామీలలో ‘‘దశలవారీ మద్య నిషేధం’’ ఒకటి. అయితే, 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం రూ. 8,517.99 కోట్లు వస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు. 2018-19 సవరించిన అంచనాలకంటే ఇది రూ. 2,298 కోట్లు (36.94 శాతం) అదనం. మద్యం అమ్మకాలను నియంత్రిస్తే ఇదెలా సాధ్యం?! 2017-18లో ఎక్సైజ్ ఆదాయం రూ. 5,460 కోట్లు కాగా 2018-19లో బడ్జెట్ అంచనా (రూ. 7,357 కోట్లు) కంటే తగ్గింది (రూ. 6,220.20 కోట్లు).
2019-07-122018-19లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం (ప్రస్తుత ధరల ప్రకారం) రూ. 1,64,025కి పెరిగిందని సామాజికార్థిక సర్వే వెల్లడించింది. శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ పత్రంతోపాటే ఆర్థిక సర్వేనూ అసెంబ్లీకి సమర్పించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ. 1,43,935 ఉండగా గత ఏడాది 13.96 శాతం పెరిగింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా తలసరి ఆదాయం రూ. 1,14,958 నుంచి రూ. 1,26,699కి పెరిగిందని ఏపీ ఆర్థిక సర్వే పత్రం పేర్కొంది.
2019-07-12