ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేని వ్యక్తిని సీబీఐ హైదరాబాద్ విభాగం జేడీగా నియమించాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖకు అమిత్ షా బదులిచ్చారు. లేఖను పరిశీలనకోసం సిబ్బంది వ్యవహారాల శాఖకు పంపినట్టు అందులో పేర్కొన్నారు. హైదరాబాద్ లో ప్రస్తుత జేడీ కూడా తెలుగువాడేనని పేర్కొంటూ గత నెల 30న విజయసాయి రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు. లేఖ ప్రతులను కేంద్ర మంత్రులు అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్ లతో పాటు సీబీఐ డైరెక్టర్‌కు కూడా పంపారు.
2020-01-11అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ జనాభా రిజస్టర్ (ఎన్.పి.ఆర్), జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి) రద్దయ్యే వరకు పోరాటం కొనసాగించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. శనివారం విజయవాడ సింగ్ నగర్ లో సిఎఎకి వ్యతిరేకంగా జరిగిన సభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి. శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ, ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడారు.
2020-01-11జమ్మూ-కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీస్తూ.. కేంద్రం విధించిన ఆంక్షలతో ప్రజలు కష్టాల పాలయ్యారు. ఆగస్టు 5 నుంచి 120 రోజుల్లో కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు రూ. 17,878 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (కెసిసిఐ) అధ్యయనంలో తేలింది. ఇంకా బాధాకరమైన విషయం ఏమంటే... 4.96 లక్షల మంది కశ్మీరీలు ఉద్యోగాలు కోల్పోయారు.
2020-01-11370 ఆర్టికల్ రద్దును సమర్ధిస్తే సురక్షితంగా దేశంలోకి అనుమతిస్తామని మోడీ ప్రభుత్వం తనకు ‘ఆఫర్’ ఇచ్చినట్లు ఇస్లామిక్ మత బోధకుడు జాకీర్ నాయక్ చెప్పారు. మోడీ, అమిత్ షా సూచనలమేరకు గత సెప్టెంబరులో ఒక రాయబారి తనను సంప్రదించారని నాయక్ ఓ వీడియోలో చెప్పారు. నాయక్ 2016 నుంచి మలేషియాలో ప్రసాసంలో ఉన్నారు. 370పై ప్రభుత్వానికి మద్ధతిస్తే కేసులు మాఫీ చేసి, ఆస్తులు విడిపిస్తామన్నారని నాయక్ వీడియోను షేర్ చేసిన ఇస్లామిక్ స్కాలర్ యాసిర్ ఖాది రాశారు.
2020-01-11 Read Moreప్రభుత్వ ఉద్యోగి ఓ ర్యాలీకి హాజరైనంత మాత్రాన... సర్వీసు నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నట్లు కాదని త్రిపుర హైకోర్టు స్పష్టం చేసింది. త్రిపుర ఫిషరీస్ శాఖలో పని చేసిన లిపికా పాల్ అనే ఉద్యోగిని 2018 ఏప్రిల్ లో ఉద్యోగ విరమణ చేయడానికి ఐదు రోజుల ముందు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అందుకు చూపించిన కారణం ‘2017 డిసెంబర్ 31న ఆమె ఓ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడం’. ప్రభుత్వ చర్యను లిపికా పాల్ న్యాయస్థానంలో సవాలు చేశారు.
2020-01-12 Read Moreజమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో డి.ఎస్.సి. స్థాయి పోలీసు అధికారి ఒకరిని ఉగ్రవాదులతో కలసి ఉండగా పట్టుకున్నారు. దక్షిణ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లా మీర్ బజార్ ప్రాంతంలో ఈ అరెస్టులు జరిగాయి. డీఎస్పీ దేవీందర్ సింగ్ తన కారులో ఇద్దరు జైష్ ఇ మహ్మద్ (జెఇఎం) ఉగ్రవాదులతో కలసి ప్రయాణిస్తుండగా పోలీసులు ఫాలో అయ్యారు. ఉగ్రవాదులను అరెస్టు చేసి ఐదు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దేవీందర్ సింగ్ ఇల్లు సోదా చేస్తే రెండు ఎ.కె.47 రైఫిల్స్ దొరికాయి.
2020-01-11అరెస్టయిన మహిళలను కులం ఏమిటని పోలీసులు అడగడం దారుణమని బిజెపి నేత, ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. వృత్తి విలువను మరచి ఒక పార్టీకి తొత్తుగా మారితే పర్యవసానాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను హెచ్చరించారు. ఆరు నెలల్లో ఆడపడుచుల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం, 7 నెలలుగా ఎక్కడా ఒక్క గంప మట్టి కూడా వేయని ప్రభుత్వం ఇదేనని వ్యాఖ్యానించారు. ఈ నేరాలు, ఘోరాలు చూస్తూ ఊరుకుంటే...దేశంలో ఉండటమే అనవసరమన్నారు.
2020-01-11రాజధానిని ఎందుకు మారుస్తున్నారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. తిరుపతి నాలుగుకాళ్ళ మండపం దగ్గర అమరావతి జేఏసీ నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. అమరావతి మనిగిపోతుందని వైసీపీ నేతలు చెబుతున్నారని, కానీ నీళ్లు ఉన్న చోటే నాగరికత వెలిసిందని బాబు అన్నారు. రాయలసీమకు చాలా దూరంలో ఉన్న విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రం, ఒక రాజధాని అన్నదే అందరి నినాదం కావాలన్నారు.
2020-01-11ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ‘సైతాన్’గా అభివర్ణించారు. తాను ఎన్ని చేసినా.. ఇంకేదో చేస్తాడని భావించి ప్రజలు 151 సీట్లు ఇస్తే, ఉన్మాదంతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడని ధ్వజమెత్తారు. విశాఖకు అదానీ డేటా సెంటరును, లులు గ్రూపును తెస్తే తరిమేశాడని చంద్రబాబు చెప్పారు. ‘ఈ ‘సైతాన్’ను ఏసు ప్రభువు కూడా క్షమించడు’ అని దుయ్యబట్టారు. శనివారం తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీ, బహిరంగ సభలలో చంద్రబాబు పాల్గొన్నారు.
2020-01-11లగ్జరీ కారు లంబోర్గినిని దక్షిణాది సంపన్నులు బాగా ప్రేమిస్తున్నారు! దేశం మొత్తం మీద జరిగిన అమ్మకాల్లో దక్షిణాది వాటా 50 శాతం పైనే ఉందని కంపెనీ ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ శనివారం చెప్పారు. ఉత్తరాదిన ముంబై, ఢిల్లీలలో కంపెనీ షోరూంలు ఉన్నాయి. దక్షిణాదిన ఒక్క బెంగళూరులోనే ఉంది. దక్షిణాది మార్కెట్ మిగిలిన దేశంకంటే వేగంగా పెరుగుతోందని అగర్వాల్ చెప్పారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఐటి హబ్స్ పెట్టుబడులు ఇందుకు కారణంగా చెప్పారు.
2020-01-11 Read More