భారత న్యాయస్థానాల చరిత్రలో అరుదైన సన్నివేశమిది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తనపై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్న జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే కమిటీ ఎదుట హాజరయ్యారు. గొగోయ్ తనను లైంగికంగా వేధించారని ఓ మహిళా మాజీ ఉద్యోగి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో... ఆంతరంగిక విచారణకోసం బాబ్డే కమిటీని నియమించారు. ప్రధాన న్యాయమూర్తి హాజరు కోరుతూ కమిటీ ‘‘లెటర్ ఆఫ్ రిక్వెస్ట్’’ను పంపగా ఆయన స్పందించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి సమన్లకు బదులు ‘లెటర్ ఆఫ్ రిక్వెస్ట్’ పంపడం ఆనవాయితీ.
2019-05-01 Read Moreభారత దేశంలో భయానక దాడులకు సూత్రధారి, జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పేరును ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయానికి పేర్కొన్న కారణాల్లో... ‘పుల్వామా ఉగ్రవాద దాడి’ లేకపోవడం గమనార్హం. ఫిబ్రవరి 14న జరిగిన ఈ దాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు మరణించారు. ఏది ఏమైనా భద్రతా మండలి నిర్ణయం భారత దేశానికి ఓ విజయమే. ఇంతకు ముందు అనేకసార్లు ఆపిన చైనా ఈసారి అభ్యంతర పెట్టకపోవడంతో భద్రతా మండలి నిర్ణయం సాఫీగా జరిగింది.
2019-05-01 Read More‘‘ఏలేద్దామనుకుంటున్నాను... ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నాను సార్’’... అగ్ర కథానాయకుడు మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘‘మహర్షి’’ ట్రైలర్ లో మొదటి డైలాగ్ ఇది. విద్యార్ధిగా ప్రారంభమై శ్రీమంతుడిగా మారిన మహేష్ బాబు ‘‘మనం గతంలో ఎక్కడున్నాం.. ఇప్పుడెక్కడున్నాం.. దాన్నిబట్టి మనకే అర్ధమైపోతుంది. మనం విజయవంతమయ్యామా లేదా అన్నది’’ అని ఓ ఇంటర్వ్యూలో చెబుతారు. విజయ ప్రస్థానంలో ఎదురైన విలన్ జగపతిబాబుతో ‘‘ఓడిపోవడమంటే నాకు భయం’’ అంటారు. ఈ సీన్ తర్వాత ఓ పోరాట సన్నివేశం. 9వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం జరిగింది. సీనియర్ కథానాయకుడు వెంకటేష్ ట్రైలర్ ను విడుదల చేశారు.
2019-05-0126/11 ముంబై ఉగ్రవాద దాడిలో బలైన పోలీసు అధికారి హేమంత్ కర్కరేపైన, బాబ్రీ మసీదు కూల్చివేతపైన భోపాల్ బీజేపీ అభ్యర్ధి ప్రగ్యా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. ఆమె 72 గంటలపాటు ప్రచారం చేయకుండా ఆంక్ష విధించింది. గురువారం ఉదయం 6:00 గంటలనుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. ఇంతకు ముందు యూపీ సిఎం యోగి, పంజాబ్ కాంగ్రెస్ నేత సిద్ధూలపై ఇదే తరహా ఆంక్షలు విధించారు. తన శాపం వల్లనే కర్కరే మరణించారని, బాబ్రీ మసీదు విధ్వంసంలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని ప్రగ్యా కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు.
2019-05-01 Read Moreయాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ లో మైనర్ బాలిక శ్రావణి హత్య కేసు తీగ లాగితే ఓ ఉన్మాద హత్యాకాండ బయటపడింది. మర్రి శ్రీనివాసరెడ్డి (28) అనే రేపిస్టు శ్రావణితోపాటు మరో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి హత్యగావించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2015లో కల్పన అనే బాలిక, ఈ ఏడాది శివరాత్రి సమయంలో మనీషా, తాజాగా శ్రావణి ఈ ఉన్మాదికి బలయ్యారు. మనీషా, శ్రావణి మృతదేహాలు శ్రీనివాసరెడ్డి బావిలోనే దొరికాయి. 2017లో కర్నూలు జిల్లాలో ఓ వేశ్యను కూడా శ్రీనివాసరెడ్డి చంపినట్టు మంగళవారం రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ చెప్పారు.
2019-04-30 Read Moreకర్నూలు జిల్లా నంద్యాల లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ ఎస్.పి.వై. రెడ్డి మంగళవారం మరణించారు. 1950 జూన్ 4న జన్మించిన రెడ్డి, వరంగల్ఎ న్.ఐ.టి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకొని తొలుత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)లో ఉద్యోగం చేశారు. 1977లో ఉద్యోగాన్ని వదిలి 1979లో పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టారు. నంది గ్రూపు సంస్థల అధినేతగా ప్రాచుర్యం పొంది 1991లో తొలిసారి ఎంపి పదవికి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలో ఓడిపోయారు. 2004 నుంచి వరుసగా మూడుసార్లు నంద్యాల నుంచి గెలుపొందారు.
2019-04-30అతి తీవ్ర తుపానుగా మారిన ‘ఫోనీ’ ప్రభావం ఉత్తరాంధ్రలోని 20 మండలాలపై ఉంటుందని అధికార యంత్రాంగం తెలిపింది. ఆ మండలాలు ఇవే.. శ్రీకాకుళం: గార, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, సంతబొమ్మాళి, పలాస, పొలాకి, నందిగం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం. విజయనగరం: భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ. విశాఖపట్నం: భీమునిపట్నం.
2019-04-30అతి తీవ్ర తుపానుగా మారిన ‘ఫోనీ’ ప్రస్తుతం మచిలీపట్నం తీరంనుంచి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ప్రకటించింది. బుధవారం దిశ మార్చుకొని ఈశాన్యంవైపు పయనించే అవకాశం ఉందని తెలిపింది. మే 2,3 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. విశాఖపట్నంలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
2019-04-3040 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మోదీ సిగ్గుమాలిన ఉపన్యాసానికిగాను ఆయనను 72 సంవత్సరాలపాటు నిషేధించాలని అఖిలేష్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు యోగి ఆదిత్యనాథ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలపై ఈసీ ‘72 గంటల నిషేధం’ విధించింది. ఈ నేపథ్యంలో... మోదీని 72 గంటలు కాదని, 72 సంవత్సరాల పాటు నిషేధించాలని అఖిలేష్ వ్యాఖ్యానించారు.
2019-04-30 Read Moreరాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఇదివరకు ఇచ్చిన తీర్పు సమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందించడానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఐదు రోజులు గడువు ఇచ్చింది. నెల రోజులు గడువు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపానికి...ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించలేదు. అంతేకాదు.. ఇంతకు ముందు సుప్రీంకోర్టుకు ఉద్ధేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినవారిపై చర్యలకు ప్రత్యేక దరఖాస్తు దాఖలు చేయాలని ఆదేశించింది.
2019-04-30 Read More