వాణిజ్య యుద్ధంలో చైనా పన్నుల పెంపువల్ల నష్టపోయే అమెరికా రైతులకు 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,05,000 కోట్లు) సాయం చేయనున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం చెప్పారు. ఈ సంవత్సరం తమకు కీలకమైనదని, అమెరికా రైతుల ఉత్పత్తులను చైనా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిందని ట్రంప్ తెలిపారు. ఈ ప్రగతికి నజరానాగా అమెరికా రైతులకు తగిన సాయం చేస్తే మరింతగా ఫలితాలను సాధిస్తారని ఆకాంక్షించారు. గత ఏడాది కూడా అమెరికా రైతులకు 12 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ట్రంప్ ప్రభుత్వం సిద్ధం చేసింది.
2019-05-14 Read Moreతమ ఉత్పత్తులపై పన్నును అమెరికా 10 శాతం నుంచి 25 శాతానికి పెంచిన నేపథ్యంలో, చైనా ధీటైన కౌంటర్ ఇచ్చింది. 60 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై జూన్ 1వ తేదీనుంచి పన్ను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై ఇప్పటికే పన్నులు పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మిగిలిన 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై కూడా పన్ను పెంచాలని ఆదేశించారు. అంతే కాదు.. తమ చర్యకు చైనా కౌంటర్ ఇస్తే దారుణమైన పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ బెదిరింపులను చైనా పట్టించుకోలేదు.
2019-05-13 Read Moreదేశీయ కార్ల మార్కెట్ కుదేలైంది. గత ఏడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 15.9 శాతం తగ్గిపోయాయి. గత ఎనిమిది సంవత్సరాల్లో ఇదే అత్యధిక క్షీణత అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) సమాచారం ప్రకారం 2018 జూలై నుంచి వరుసగా 10 నెలల పాటు కార్ల అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. అన్ని రకాల వాహనాల అమ్మకాలూ తగ్గిపోవడం గత పదేళ్లలో ఇప్పుడే చూస్తున్నామని సియామ్ చెబుతోంది. ఈ పరిస్థితినుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని భావిస్తున్నారు.
2019-05-13 Read Moreచందమామ (అంతర్భాగం) రానురాను చల్లబడుతోంది. దాంతో కుంచించుకుపోతోంది. ఈ కారణంగా భూకంపాలు సంభవిస్తున్నాయి. వాటిలో కొన్ని ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 5 వరకు నమోదయ్యాయి. అంటే భూమిపై సంభవించిన భారీ భూకంపాల కంటే తక్కువ స్థాయివనే చెప్పవచ్చు. అపోలో వ్యోమగాములు గతంలో చంద్రునిపై వదిలి వచ్చిన సీస్మో మీటర్ల సమాచారాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. గత కొన్ని కోట్ల సంవత్సరాల్లో చందమామ 150 అడుగుల మేరకు సన్నబడిందట. దాని ఫలితంగా ఉపరితలంపై పగుళ్లు వచ్చాయి.
2019-05-14 Read Moreఈసీ అనుమతితో మంగళవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కాబోతోంది. మంత్రివర్గంలో చర్చించాలనుకున్న అంశాలతో ఓ వినతిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపగా సోమవారం రాత్రికి అనుమతి లభించింది. వెంటనే ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం ఓ ప్రకటన చేశారు. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశమయ్యే మంత్రివర్గం... ‘‘ఫని’’ తుపాను ఉపశమన కార్యకలాపాలు, కరువు, వేసవిలో తాగునీటి పరిస్థితి, జాతీయ ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై సమీక్షిస్తుందని సీఎస్ తెలిపారు.
2019-05-13వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నుంచి పూర్తిగా అమరావతికి మారుతోంది. ఇప్పటిదాకా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచే తన కార్యకలాపాలను జగన్మోహన్ రెడ్డి సాగించారు. ఇటీవల తాడేపల్లిలో ఇల్లు, ఆఫీసుకోసం భవనాలు నిర్మించుకున్నారు. ఫిబ్రవరిలో భవన ప్రవేశం కూడా జరిగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ నుంచి రాష్ట్ర కార్యాలయ ఫర్నిచర్ ను తాడేపల్లికి తరలిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
2019-05-13భారత దేశంలో పాసెంజర్ వాహనాల అమ్మకాలు ఏప్రిల్ మాసంలో అసాధారణంగా 17 శాతం క్షీణించాయి. 2018 ఏప్రిల్ మాసంలో 2,98,504 వాహనాలు అమ్ముడుపోగా ఈ ఏడాది మాత్రం 2,47,541కు పరిమితమయ్యాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16.4 శాతం క్షీణించి 16.38 లక్షలకు పరిమితమయ్యాయి. గత ఏడాది ఏప్రిల్ మాసంలో 19,58,761 ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 5.98 శాతం తగ్గి 68,680కి పరిమితమయ్యాయి. అన్ని రకాల వాహనాలూ కలిపి 3.8 లక్షల యూనిట్లు తక్కువగా అమ్ముడయ్యాయి.
2019-05-13 Read More‘‘స్వతంత్ర భారత తొలి తీవ్రవాది ఓ హిందువు’’ అని మక్కల్ నీతి మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, సినీ నటుడు కమల్ హసన్ వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మా గాంధీని 1948లో హత్య చేసిన నాథురాం గాడ్సేను తొలి తీవ్రవాదిగా కమల్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తమిళనాడులోని అరవకురిచిలో ఎన్నికల సభలో కమల్ మాట్లాడారు. తాను మాట్లాడుతున్నది ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో కావడంవల్ల ఈ మాట చెప్పడంలేదని, గాంధీ విగ్రహం ముందు ఈ మాట చెబుతున్నానని కమల్ స్పష్టం చేశారు.
2019-05-13 Read Moreఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే లక్ష్యంతో వివిధ రాష్ట్రాల ముఖ్య నేతలను కలుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు... సోమవారం చెన్నైలో డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ తో భేటీ కానున్నారు. ఇందుకోసం కొంతమంది టీఆర్ఎస్ నేతలతో కలసి కేసీఆర్ ఆదివారం సాయంత్రమే ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. గత వారం కేరళ వెళ్లిన కేసీఆర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ ను కలసిన సంగతి తెలిసిందే. గతంలో జెడి(ఎస్), టీఎంసీ, బీజేడీ తదితర పార్టీల అధినేతలను కేసీఆర్ కలిశారు.
2019-05-13 Read Moreఆదివారం కేలిఫోర్నియాలో జరిగిన సాకర్ మహిళా ప్రపంచ్ కప్ వామప్ మ్యాచ్ లో దక్షిణ కొరియా జట్టుపై అమెరికా 3-0 తేడాతో విజయం సాధించింది. సమంతా మెవిస్ రెండు గోల్స్ సాధించగా, చివర్లో కేర్లి లాయిడ్ ఒక గోల్ సాధించారు. లాయిడ్ కు ఇది 108వ అంతర్జాతీయ గోల్. అమెరికా జట్టు 1991, 1999, 2015లో ప్రపంచ కప్ మహిళా సాకర్ కప్ ను గెలుచుకుంది. ప్రపంచ్ కప్ టోర్నమెంట్ జూన్ 8వ తేదీన ప్రారంభం కానుంది. మొదటిగా దక్షిణ కొరియాతో ఫ్రాన్స్ తలపడనుంది.
2019-05-13 Read More