ఇండియాలో 2025 నాటికి 10 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు అమెజాన్.కాం ఇంక్ శుక్రవారం ప్రకటించింది. అమెజాన్ రూ. 7100 కోట్ల పెట్టుబడితో... ఇండియాకు ఒరగబెట్టేదేం లేదని నిన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడుల ద్వారా కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని అమెజాన్ చెబుతోంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఇండియా పర్యటనలో ఉన్నారు.
2020-01-17 Read Moreఉక్రెయిన్ దేశ ప్రధానమంత్రి ఒలెక్సీ హోంచారుక్ (35) తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖ అందినట్టు దేశాధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. ఒలెక్సీ పదవి చేపట్టి ఐదు నెలలు కూడా కాలేదు. ఆగస్టు 29న ఆయన ప్రధానిగా నామినేట్ అయ్యారు. ఉక్రెయిన్ దేశానికి చిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తి ఒలెక్సీ.
2020-01-17రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సి.ఆర్.డి.ఎ) రద్దు ప్రతిపాదన తనకు తెలియదని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో హై పవర్ కమిటీ సభ్యుల సమావేశం అనంతరం బొత్స విలేకరులతో మాట్లాడారు. రాజధానిపై చెన్నై ఐఐటి నివేదిక ఇచ్చిందనే మాట కూడా అవాస్తవమని స్పష్టం చేశారు. అమరావతి రైతులపై తమకు సానుభూతి ఉందన్న బొత్స ‘చంద్రబాబు మాయలో పడొద్దు’ అంటూ వారికి సూచించారు.
2020-01-17ముంబై-అహ్మదాబాద్ సెమీ హై స్పీడ్ ‘తేజస్’ రైలు శుక్రవారం ప్రారంభమైంది. భారతీయ రైల్వేల సబ్సిడరీ ఐ.ఆర్.సి.టి.సి. ప్రారంభించిన రెండో రైలు ఇది. మొదటి తేజస్ రైలు లక్నో, ఢిల్లీ మధ్య గత ఏడాది ప్రారంభమైంది. ముంబై-అహ్మదాబాద్ రైలును శుక్రవారం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ప్రారంభించారు. ఈ రైలును 19వ తేదీ నుంచి వాణిజ్యపరంగా నడిపించనున్నారు. వారానికి ఆరు రోజులపాటు ఉదయం 6:40 గంటలకు అహ్మదాబాద్ లో బయలుదేరి 13:10కి ముంబై చేరుకుంటుంది.
2020-01-17 Read More2012 ఢిల్లీ సామూహిక మానభంగం కేసులో నిందితుడు ముఖేష్ క్షమాబిక్ష కోసం పెట్టుకున్న విన్నపాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో, ఉరిశిక్షను తప్పించుకోవడానికి నిందితులు చేసిన అన్ని ప్రయత్నాలూ ముగిశాయి. ఇక ఉరి తప్పదు. కోర్టు ఇచ్చిన డెత్ వారంట్ ప్రకారం ఈ నెల 22న నలుగురు నిందితులను తీహార్ జైలులో ఉరి తీయవలసి ఉంది. అయితే, క్షమాబిక్ష పిటిషన్ వల్ల ఉరి ఆలస్యం కానుంది.
2020-01-17తాను ఎవరెస్టు శిఖరంపై ఆర్.ఎస్.ఎస్. శాఖా సమావేశాన్ని నిర్వహించినట్టు ఆ సంస్థ కార్యకర్త విపిన్ చౌధరి ప్రకటించారు. అలాగే, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి మద్ధతుగా దక్షిణ అమెరికాలోని అకాన్కాగువా పర్వతంపైన ప్లకార్డును ప్రదర్శించినట్టు చెబుతూ కొన్నిఫొటోలను పోస్టు చేశారు. పర్వతారోహకుడైన విపిన్, తాను ఇప్పటికి ప్రపంచంలోని 7 ప్రముఖ పర్వతాల్లో నాలుగింటిని అధిరోహించానని, హిందూత్వ సందేశాన్ని చాటడానికి మిగిలిన పర్వతాలనూ అధిరోహిస్తానని చెబుతున్నారు.
2020-01-17 Read Moreఇండియాకు పంపవలసిన ఎస్-400 క్షిపణుల ఉత్పత్తిని ప్రారంభించినట్లు రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బబుష్కిన్ శుక్రవారం తెలిపారు. ఇండియా కోరినన్ని క్షిపణులను 2025 లోగా పంపుతామని ఆయన చెప్పారు. గగనతల రక్షణ వ్యవస్థలలో అత్యంత సమర్ధవంతమైనదిగా ఎస్-400కు పేరుంది. రష్యా నుంచి ఎస్-400 కొనుగోలు చేస్తే ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించినా టర్కీ వెనుకకు తగ్గలేదు. అమెరికాను ‘ఒప్పించి’ మరీ ఇండియా వీటిని కొనుగోలు చేస్తోంది.
2020-01-17భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, ఆమె డబుల్స్ భాగస్వామి నాదియా కిచెనోక్ (ఉక్రెయిన్) హోబర్ట్ ఇంటర్నేషనల్ మహిళల డబుల్స్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆస్ట్రేలియాలోని హోబర్ట్ మైదానంలో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో వారిద్దరూ 7-6 (3), 6-2 స్కోరుతో జిదాన్‌సెక్, బౌజ్కోవాలను ఓడించారు. రెండేళ్ల తర్వాత సానియా (33) డబ్ల్యు.టి.ఎ. సర్క్యూట్ లోకి ప్రవేశించింది. గాయాలతో విరామం తీసుకున్న సానియా 2018లో ఓ బిడ్డకు జన్మినిచ్చింది.
2020-01-17జయలలిత జీవిత గాథగా తెరకెక్కుతున్న ‘తలైవి’లో ఎంజి రామచంద్రన్ పాత్ర పోషిస్తున్న అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ శుక్రవారం విడుదలైంది. ఎంజిఆర్ జయంతి సందర్భంగా చిత్రబృందం రెండు ఫొటోలు విడుదల చేసింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయలలితగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ సింగ్ నిర్మాతలు.
2020-01-17శుక్రవారం మార్కెట్ల ప్రారంభంలో రూపాయి విలువ 7 పైసలు తగ్గింది. డాలరు బిలువ 71 రూపాయలకు చేరింది. నిన్న 11 పైసలు తగ్గడంతో డాలరు విలువ రూ. 70.93 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలరుకు డిమాండ్ పెరగడం, చమురు ధరలు స్థిరంగా ఉండటం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందం కూడా డాలరు బలపడటానికి కారణమైంది.
2020-01-17