దేశంలో వందలాది మంది ‘కరోనా’కు బలవుతున్న వేళ కొన్ని కంపెనీలు అసాధారణ లాభాలకు తెగబడ్డాయి. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టు కిట్లు ఒక్కోదాని విలువ రూ. 245 అయితే, కంపెనీలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)కి విక్రయిస్తున్నది రూ. 600కి! అంటే.. లాభం 145 శాతం!! ఈ రేటుపై ఐసిఎంఆర్ 5 లక్షల టెస్టు కిట్లకు ఆర్డర్ ఇచ్చింది. దిగుమతి చేసుకున్న మ్యాట్రిక్స్ ల్యాబ్ ఒక్కో కిట్ రూ. 400 చొప్పున రేర్ మెటాబోలిక్స్, ఆర్క్ ఫార్మాస్యూటికల్స్ లకు సప్లై చేస్తే.. ఆ కంపెనీలు రూ. 600కు ఐసిఎంఆర్ కు అమ్ముతున్నాయి. కంపెనీల మధ్య పేచీ ఢిల్లీ హైకోర్టుకు చేరడంవల్ల ఈ విషయం వెల్లడైంది. కోర్టు కిట్ల ధరను రూ. 400గా నిర్ణ
2020-04-27ప్రపంచం మొత్తంమీద ప్రభుత్వాలు చేసే అతిపెద్ద వ్యయం ఏమిటి? దీనికి తడుముకోకుండా చెప్పగలిగిన సమాధానం ‘మిలిటరీ వ్యయం’. ఈ రేసులో ఇండియా మున్ముందుకు పోతోంది. 2019లో మిలిటరీ వ్యయంలో ఇండియా మూడో స్థానానికి ఎగబాకింది. స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) తాజా నివేదిక ప్రకారం.. 2018లో 66.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇండియా మిలిటరీ వ్యయం 2019లో 71.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2017లో 5వ స్థానం, 2018లో 4వ స్థానం, 2019లో 3వ స్థానంతో ఏడాదికో ర్యాంకు ఎగబాకిన ఇండియా..ఇంతకు ముందే రష్యాను, తాజాగా సౌదీ అరేబియాను వెనుకకు నెట్టింది. 732 బిలియన్ డాలర్లతో అమెరికా, 261 బిలియన్ డాలర్లతో చైనా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
2020-04-27అధికార వైసీపీ (కర్నూలు) ఎంపి డాక్టర్ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి ‘కరోనా’ వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆదివారం ఆయన స్వయంగా ప్రకటించారు. ఎంపి తండ్రి, ఇద్దరు సోదరులు, వారి భార్యలు, వారిలో ఒకరి కుమారుడు వైరస్ బారిన పడ్డారు. ఎంపి కుటుంబ సభ్యులకు వైరస్ సోకినట్టు రెండు రోజులుగా గుసగుసలు వినిపించాయి. ఆదివారం బహిర్గతం కావడంతో ఎంపీ ప్రకటన చేశారు. వైరస్ సోకినవారిలో నలుగురు డాక్టర్లు కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత కర్నూలులోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. శనివారానికి 279 కేసులు నమోదు కాగా తొమ్మిది మంది మరణించారు.
2020-04-27ఏపీలో ‘కరోనా’ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 81 కొత్త కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. ఒకే రోజు 80కి పైగా కొత్త కేసులు నమోదు కావడం ఈ వారంలో ఇది రెండోసారి. ఒక్క కృష్ణా జిల్లాలోనే 24 గంటల్లో 52 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 177కు పెరిగాయి. కరోనా సోకినవారి సంఖ్య కర్నూలులో 279కి, గుంటూరులో 214కి పెరిగింది. తర్వాత వరుసగా.. చిత్తూరు (73), నెల్లూరు (72), ప్రకాశం (56), అనంతపురం (53), పశ్చిమ గోదావరి (51), తూర్పు గోదావరి (39), విశాఖపట్నం (22), శ్రీకాకుళం (3) ఉన్నాయి. రాష్ట్రం మొత్తంగా కేసులు 1097కి, మరణాలు 31కి పెరిగాయి.
2020-04-26కేంద్రప్రభుత్వ ‘కరోనా’ ప్యాకేజీ ఏ మూలకూ సరిపోదన్న విమర్శల మధ్య.. పంపిణీ మరీ అధ్వానంగా ఉంది. దేశంలో 19 కోట్ల కుటుంబాలకు కేజీ చొప్పున పప్పులు అందించాలన్న నిర్ణయం ఆచరణలో అరకొరగా అమలవుతోంది. ఏప్రిల్ మాసం కోటాలో ఇప్పటిదాకా 15 శాతమే పంపిణీ చేశారు. లక్షా 96 వేల టన్నులు పంపిణీ చేయవలసి ఉండగా 30 వేల టన్నులు మాత్రమే ప్రజలకు అందింది. పిఎం గరీబ్ కళ్యాణ్ పథకం కింద మూడు నెలల పాటు ప్రతి కుటుంబానికీ కేజీ చొప్పున పప్పులు పంపిణీ చేయనున్నట్టు మార్చి 26న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
2020-04-2624 గంటల వ్యవధిలో దేశంలో 1990 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం వైరస్ సోకినవారి సంఖ్య 26,496కు పెరిగింది. మృతుల సంఖ్య 49 పెరిగి 824కు చేరింది. ఇప్పటిదాకా 5804 మంది కోలుకున్నారు. ఇవి నిన్నటివరకు నమోదైన వివరాలు. అత్యధికంగా మహారాష్ట్రలో 7628 మందికి వైరస్ సోకగా 323 మంది మరణించారు. 3071 కేసులు, 133 మరణాలతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలో 2625, మధ్యప్రదేశ్ లో 2096, రాజస్థాన్లో 2083, తమిళనాట 1821, యూపీలో 1793 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్యలో మధ్యప్రదేశ్ (99) మూడో స్థానంలో ఉంది.
2020-04-26ప్రపంచవ్యాప్తంగా ‘కరోనా’ బారిన పడిన జనాభా సంఖ్య తాజాగా 28,93,729కి పెరిగింది. అందులో 2,02,668 మంది మరణించారు. అమెరికాలో 9,36,616 కేసులకు గాను 53,694 మంది మృతి చెందారు. భూగోళం మీద ‘కరోనా’ సోకినవారిలో 32.37%, మృతులలో 26.49% అమెరికన్లే. ఇటలీలో 26,384 మంది, స్పెయిన్లో 22,902 మంది, ఫ్రాన్స్ లో 22,648 మంది ‘కరోనా’తో మరణించారు. ఏడు దేశాల్లో లక్షకు పైగా జనాభాకు వైరస్ సోకింది. కరోనా వ్యాప్తి ప్రారంభమైన చైనా 83,901 కేసులకు నియంత్రించగా.. జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశమైన ఇండియాలో ఇప్పటికి ‘కరోనా’ తాకిడి తక్కువగానే ఉంది.
2020-04-26ఏపీలో ‘కరోనా’ 12వ జిల్లాలకు వ్యాపించింది. శనివారం ఉదయానికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 1016కి పెరిగింది. గడచిన 24 గంటల్లో 61 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా 3 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇక మిగిలింది విజయనగరం మాత్రమే. ఇప్పటిదాకా రాష్ట్రంలో 31 మంది ‘కరోనా’కు బలయ్యారు. ఇప్పటికే మరణాలు, యాక్టివ్ కేసుల సంఖ్యలో తెలంగాణను అధిగమించగా.. శనివారం మొత్తం కేసుల సంఖ్యలోనూ దాటిపోయింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 275 కేసులు, గుంటూరులో 209, కృష్ణా జిల్లాలో 127 కేసులు నమోదయ్యాయి.
2020-04-25కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై నిందారోపణలు, ‘విద్వేషపూరిత వ్యాఖ్యలు’ చేసిన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్ణబ్ గోస్వామికి అరెస్టునుంచి మూడు వారాలు రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. విద్వేషవ్యాఖ్యల కేసులో గోస్వామిపై ముంబై పోలీసుల దర్యాప్తునకు అనుమతిస్తూనే... అతనిపై ఎలాంటి బలవంతపు చర్యలూ తీసుకోవద్దని ఆదేశించింది. ఈ మూడు వారాల్లో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోచ్చని కూడా అతనికి సూచించింది. ఈ విషయంలో నాగపూర్ లో నమోదైన కేసును కూడా ముంబైకి బదిలీ చేయాలని, 5 రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ లపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
2020-04-24శాసన వ్యవస్థ వద్ద బిల్లులు పెండింగులో ఉండగా.. వాటిపై హైకోర్టులో వ్యాజ్యాలు నడుస్తుండగా.. రాజధానిని ఎలా తరలిస్తారని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజధానిని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం వాదనలు విన్నది. రాజధాని తరలింపునకు ప్రభుత్వం రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వలేదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ న్యాయమూర్తుల ప్రశ్నకు సమాధానమిచ్చారు. వివరాలతో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జెకె మహేశ్వరి, జస్టిస్ ఎవి శేషసాయి, జస్టిస్ సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
2020-04-24