ఆర్టీసీ ఆస్తులను కేసీఆర్ కుటుంబం దోచుకుతింటోందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్ధతుగా బుధవారం సరూర్ నగర్లో నిర్వహించిన ‘సకల జనుల సమర భేరి’లో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ విలీనం మా ఎజెండాలో లేదన్న మంత్రులపై రేవంత్ మండిపడ్డారు. ఆర్టీసీలో 20 శాతాన్ని మేఘ కృష్ణారెడ్డికి రాసి ఇస్తామని మీ మేనిఫెస్టోలో ఉందా? అని ప్రశ్నించారు. ఏపీ తరహాలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తీరాలని రేవంత్ అల్టిమేటం జారీ చేశారు.
2019-10-30ఇసుక సంక్షోభంపై జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన నవంబర్ 3న విశాఖపట్నంలో తలపెట్టిన "లాంగ్ మార్చ్"కు హాజరు కావాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఆహ్వానించారు. ఇందుకు కన్నా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు జనసేన ప్రకటించింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యపై అన్ని పార్టీలనూ కూడగట్టినట్టే... ఇక్కడ తమ ఉపాధికోసం అందరినీ ఏకం చేయాలని భవన నిర్మాణ కార్మికులు పవన్ కల్యాణ్ కు విన్నవించారని జనసేన తెలిపింది. అందులో మొదటి అడుగుగా కన్నాకు ఫోన్ చేసినట్టు జనసేన ప్రకటనలో పేర్కొన్నారు.
2019-10-30మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంభన వీడలేదు. సీఎం పీఠాన్ని సగం కాలం ఇచ్చే (50:50 ఫార్ములా) సమస్యే లేదని బీజేపీ తెగేసి చెబితే, ఆ పార్టీ నేతలతో చర్చలు రద్దు చేసుకున్నారు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే. ఈ పరిస్థితిపై ప్రతిపక్ష ఎన్సీపీ నేత క్లైడ్ క్రాస్టో బుధవారం ఓ కార్టూన్ అస్త్రం సంధించారు. అందులో... బీజేపీ ఎన్నికల గుర్తు కమలంపైన శివసేన ఎన్నికల గుర్తు బాణం వేలాడుతోంది. తలపై ఖడ్గం వేలాడుతోందన్న మరాఠీ సామెతను క్యాప్షన్ గా పెట్టారు.
2019-10-30ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాది దాగిన ప్రదేశంపై అమెరికాకు సమాచారం ఇచ్చిన అంతర్గత వేగుకు రూ. 177.5 కోట్ల (2.5 కోట్ల డాలర్ల) సొమ్ము బహుమతిగా దక్కనుంది. బాగ్దాది దాగి ఉన్న ప్రదేశంతోపాటు అన్ని గదులతో కూడిన మ్యాప్ ను ఆ వేగు అమెరికా సైన్యానికి అందించినట్టు సమాచారం. ఈ నెల 26వ తేదీన బాగ్దాదిపై అమెరికా సైనికులు దాడి చేసినప్పుడు ఆ వేగు కూడా అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత రెండు రోజులకు అతనిని కుటుంబంతో సహా ఆ ప్రాంతంనుంచి తరలించారు.
2019-10-30 Read More‘‘ఉగ్రవాదం అంతం, శాశ్వత శాంతి’’ కోసం భారత ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వనున్నట్టు యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యులు ప్రకటించారు. మంగళవారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రైవేటు పర్యటనకు వచ్చిన 23 మంది ఎంపీల బృందం ముఖ్యులు బుధవారం శ్రీనగర్లో విలేకరులతో మాట్లాడారు. అయితే, ఈ సమావేశానికి స్థానిక కాశ్మీరీ మీడియాను అనుమతించలేదు. నిన్నటినుంచి పర్యటనలో కూడా స్థానికులెవరితోనూ, రాజకీయ నాయకులతోనూ ఈ బృందం చర్చించలేదు. ఇంకోసారి కలుస్తామని ఎంపీలు చెప్పారు.
2019-10-30తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన హుజూర్ నగర్ నియోజకవర్గానికి రూ. 100 కోట్ల మేరకు ప్రత్యేక నిధులను కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న ఆర్టీసీకి రూ. 47 కోట్లు ఇవ్వలేరా? అని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రజల అవసరాన్ని తీర్చే ఆర్టీసీకి మీరు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆర్టీసీలో 31 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ స్పందించాలని హైకోర్టు ఆదేశించింది.
2019-10-29ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతతో లక్షల మంది ఉపాధి కోల్పోయారు. గత 50 రోజుల్లో ఇసుక అరుదైన సరుకుగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని ప్రకటించిన తర్వాత... నిర్మాణ రంగం మొత్తం ఎక్కడికక్కడే నిలిచిపోయిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) ఏపీ విభాగం అధ్యక్షుడు ఎ. శివారెడ్డి చెప్పారు. ‘క్రెడాయ్’ ప్రకారం రాష్ట్రంలో 30 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు నమోదై ఉన్నారు. వారికి ఉపాధి, ఆదాయం ఏమీ లేవని శివారెడ్డి చెబుతున్నారు.
2019-10-29 Read Moreరుతుపవనాలు ఆలస్యంగా వచ్చినా తెలంగాణ రైతులు రికార్డు స్థాయిలో 46-47 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. ఇది ఖరీఫ్ పంటల విస్తీర్ణంలో దాదాపు సగం. పంట దిగుబడి బాగా వస్తుందని ఆశించారు. కానీ, గత ఐదారు వారాలుగా కురుస్తున్న వర్షాలు వారి ఆశలకు గండి కొట్టాయి. పత్తిలో తేమ ఎక్కువగా ఉంటే కొనుగోలు ధర తగ్గిపోతుంది. రోజూ వర్షం పడుతుండటంతో ఇప్పటికే తీసిన పత్తిలో కూడా తేమ శాతం అధికమైంది. దీంతో క్వింటాల్ ధర కేవలం రూ. 3000-3,500 (మద్ధతు ధర రూ. 5,550) పలుకుతోందని చెబుతున్నారు.
2019-10-30 Read Moreసెన్సెక్స్ మరోసారి 40,000 మార్కును దాటింది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభమయ్యాక సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 11,800 పైకి చేరింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ లోని 11 రంగాల కొలమానాల్లో 8 పురోగమనంలో ఉండగా తిరోగమనంలో ఉన్న రంగాల్లో ఆటో ఇండెక్స్ ముందుంది. సెన్సెక్స్ పరుగులో భారతీ ఇన్ఫ్రాటెల్, ఇండియన్ ఆయిల్ గరిష్ఠంగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు, ఎల్ అండ్ టి, ఐటిసి, భారతీ ఎయిర్ టెల్ కూడా లబ్దిదారుల జాబితాలో ఉన్నాయి.
2019-10-30 Read Moreఆంధ్రప్రదేశ్ రుణాలు, గ్యారంటీలపై గత నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాసిన లేఖ కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (హడ్కో) రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ మరింత కలవరపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆరు విభాగాలు తిరిగి చెల్లించాల్సిన రుణ కిస్తీల గడువు దాటిపోయిందని ఆ లేఖలో హడ్కో పేర్కొంది. ఎపి టిడ్కో రూ. 134 కోట్లు, నెల్లూరు మునిసిపాలిటీ రూ. 40 కోట్లు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కార్పొరేషన్ రూ. 5.7 కోట్లు బకాయి పెట్టాయని ‘హడ్కో’ పేర్కొంది.
2019-10-30 Read More