ఏపీలో వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) వసూళ్ళు ఫిబ్రవరి మాసంలో 23 శాతం పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రూ. 2,088 కోట్లు వసూలు కాగా ఈసారి రూ. 2,563 కోట్లు వసూలయ్యాయి. దేశవ్యాప్తంగా పెరుగుదల 12 శాతం (దిగుమతులను మినహాయిస్తే) ఉండగా కేరళలో 24 శాతం, అస్సాంలో 25 శాతం, ఏపీలో 23 శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో పన్నులు తెలంగాణలో 6 శాతం (రూ. 3,460 కోట్ల నుంచి రూ. 3,667 కోట్లకు), మహారాష్ట్రలో 12 శాతం, గుజరాత్ లో 11 శాతం, తమిళనాట 8 శాతం పెరిగాయి.
2020-03-02ఫిబ్రవరి నెలలో వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) వసూళ్లు లక్ష కోట్లు దాటాయి (రూ. 1,05,366 కోట్లు). 2019 ఫిబ్రవరి వసూళ్ళ కంటే ఇది 8.35 శాతం అదనం (దిగుమతులపై పన్నులతో కలిపి). అయితే, ఈ ఏడాది జనవరి వసూళ్ళ (రూ. 1,10,828 కోట్లు) కంటే తక్కువే. 2020 ఫిబ్రవరిలో కేంద్ర జి.ఎస్.టి. రూపంలో రూ. 20,569 కోట్లు, రాష్ట్ర జి.ఎస్.టి. రూపంలో రూ.27,348 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జి.ఎస్.టి. రూపంలో రూ. 48,503 కోట్లు, సెస్ రూపంలో రూ.8,947 కోట్లు వసూలయ్యాయి.
2020-03-02 Read Moreచిరంజీవి 152వ చిత్రం పేరును ఆయనే స్వయంగా ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా పేరు ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలోనే ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఆదివారం చిరంజీవి.. సీనియర్ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ నటించిన చిత్రం ‘ఓ పిట్ట కథ’ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన చిత్రం పేరును ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు చిరంజీవి. అనుకోకుండా ప్రకటించానంటూ దర్శకుడు కొరటాలకు సరదాగా సారీ చెప్పారు.
2020-03-02తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన యువ నాయకులు ఆదివారం కుటుంబ సమేతంగా హైదరాబాద్ నగరంలో సమావేశమయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటు చేసిన విందు సమావేశంలో ఎక్కువ మంది సీనియర్ నాయకుల రాజకీయ వారసులే కనిపించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రులు అఖిలప్రియ, కిడారి శ్రవణ్ కుమార్, ఇతర నేతలు పరిటాల శ్రీరామ్, కరణం వెంకటేశ్, టీజీ భరత్, బొజ్జల సుధీర్ రెడ్డి, లోకేష్ మిత్రుడు కిలారి రాజేశ్ విందుకు హాజరైనవారిలో ఉన్నారు. వారికి చంద్రబాబు రాజకీయ బోధ చేశారు.
2020-03-02సామాజిక పింఛన్లపై పత్రికల్లో ఆదివారం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పు పట్టారు. 2019 జనవరి నుంచి జూన్ వరకు తమ ప్రభుత్వం రూ. 2000 పెన్షన్ ఇస్తే... జగన్ అసత్యాలు చెబుతున్నారని సామాజిక మాథ్యమాల్లో విమర్శించారు. ‘‘మీ నాయన కేవలం రూ. 200 ఇస్తే మా నాయన 2014లో వెయ్యి రూపాయలు, 2019లో రెండు వేలు చేశారు’’ అని లోకేష్ పేర్కొన్నారు. రూ. 3 వేలు ఇస్తామని మోసం చేసిన జగన్ రూ. 250 మాత్రమే పెంచారని విమర్శించారు.
2020-03-02‘కరోనా వైరస్’ ఇప్పుడు చైనా వెలుపల కొన్ని దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఆదివారం ఉదయం వరకు వచ్చిన సమాచారం ప్రకారం... గడచిన 24 గంటల్లో కొత్త కేసులు చైనాలో 579 నమోదైతే మిగిలిన దేశాల్లో అంతకు రెట్టింపు (1160) నమోదయ్యాయి. బాధిత దేశాల సంఖ్య 59కి చేరింది. చైనా వెలుపల మొత్తం కేసులు 7,169కి చేరగా 104 మంది మరణించారు. చైనాలో కరోనా బాధితులు 79,968కి పెరిగారు. వారిలో 2873 మంది మరణించారు. బాధిత దేశాల్లో కొత్తగా అజర్ బైజాన్, ఈక్వెడార్, ఐర్లాండ్, మొనాకో, ఖతార్ చేరాయి
2020-03-02 Read Moreమాజీ సిఎం రాజశేఖరరెడ్డిని అంబానీ చంపించారనే ఆరోపణలతో ప్రస్తుత సిఎం జగన్ మనుషులు రాష్ట్రంలో రిలయన్స్ ఆస్తులను ధ్వంసం చేశారని, ఇప్పుడు ఆ అంబానీకి సత్కారం చేయడం ఏమిటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. టీడీపీ, బిజెపి, కాంగ్రెస్ నేతలు పలువురు ఆదివారం ఈ అంశంపై మాట్లాడారు. జగన్ ఆరోపణలతో రిలయన్స్ ఆస్తులు ధ్వంసం చేసి అనేక మంది జైలు పాలయ్యారని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించగా.. ఆనాటి ఆరోపణలు అబద్ధమైతే చెప్పాలని బిజెపి నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు డిమాండ్ చేశారు.
2020-03-02‘‘సాంకేతికత అభివృద్ధి చెంది నిముషాలలో పింఛను బ్యాంక్ అకౌంట్ కు జమ చేసే విధానం ఉన్న ఈ రోజుల్లో గడప వద్ద పెన్షన్ పంపిణీ అవసరమా? ప్రభుత్వ సొమ్ము మేము సొంతంగా ఇస్తున్నాం అన్న భావన కల్పించటానికి తప్పితే దీని వలన అదనంగా కలిగే ప్రయోజనం శూన్యం’’ అని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదివారం ట్విట్టర్లో విమర్శించారు. వాలంటీర్ల ద్వారా పంపిణీని ఆయన తప్పు పట్టారు. లేవలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులకు పోస్టాఫీసులో జమ చేసి పోస్టు మెన్ ద్వారా అందించాలని మరో ట్వీట్లో సూచించారు.
2020-03-02మార్చి 1నే అందరికీ పెన్షన్ అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్లు ఆదివారం వేకువ జాము నుంచే పంపిణీ ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 83 శాతం మంది లబ్దిదారులకు వ్యక్తిగతంగా పెన్షన్ మొత్తాన్ని అందించారు. మొత్తం 58,00,131 పెన్షన్లు విడుదల కాగా సాయంత్రానికి 48,16,062 మందికి అందించినట్టు అధికారులు ప్రకటించారు. ‘ఇంటివద్దకే పెన్షన్’ అందించడంలో ఫిబ్రవరిలో ఎదురైన సమస్యలను ఈసారి అధిగమించినట్టు అధికారులు తెలిపారు.
2020-03-01సిరియా, టర్కీ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఆదివారం సిరియా వైమానికి దళానికి చెందిన రెండు ఎస్.యు-24 బాంబర్లను టర్కీ కూల్చివేసింది. సిరియా భూభాగంలోని ఇడ్లిబ్ ప్రావిన్సులో ఈ ఘటన జరిగింది. పైలట్లు సురక్షితంగా పారాచ్యూట్ల ద్వారా బయటపడ్డారు. తాను మద్ధతు ఇస్తున్న మిలీషియా కోసం టర్కీ సేనలు సిరియాలోకి ప్రవేశించి ప్రభుత్వ దళాలపై దాడులు చేశాయి. దీనికి ప్రతిగా కొద్ది రోజుల క్రితం సిరియా సేనలు ఇడ్లిబ్ ప్రావిన్సులో జరిపిన వైమానిక దాడిలో 34 మంది టర్కీ సైనికులు చనిపోయారు.
2020-03-01