5జి పేరు చెబితే ప్రపంచం మొత్తానికి గుర్తొచ్చే మొదటి పేరు ‘హువావీ’. ఈ చైనా టెక్నాలజీ దిగ్గజం అనతి కాలంలోనే అసాధారణ ప్రగతిని సాధించింది. దానికి కారణం ఏమిటో తాజాగా వెల్లడైన ఆ కంపెనీ రిపోర్టు ఒకటి చెబుతోంది. 2019 నాటికి ‘హువావీ’ ఉద్యోగుల సంఖ్య 1,94,000 కాగా వారిలో ఏకంగా 49.48% (96,000 మంది) రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సభ్యులేనట! కంపెనీలో 157 దేశాలు, ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు పని చేస్తున్నారని... గత ఏడాది విదేశీ ఉద్యోగుల సంఖ్య 37 వేలు దాటిందని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
2020-07-08తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, విద్యుత్ శాఖ మంత్రి పి. తంగమణికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో మంత్రి, ఆయన కుమారుడు కూడా చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. తంగమణి మంగళవారం రెండు అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. షణ్ముగం కూడా ఆ సమావేశాల్లో ఉన్నారు. ఇద్దరు మంత్రులు సహా 10 మంది ఎమ్మెల్యేలు ‘కరోనా’ బారిన పడటం తమిళనాట ఈ మహమ్మారి తీవ్రతను వెల్లడిస్తోంది.
2020-07-08‘కరోనా’పై ప్రభుత్వమే ఏదో చేయాలని అనుకొనే కంటే.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో 23 వేల కేసులు వెలుగుచూస్తే మరణాలు 300 మాత్రమే నమోదయ్యాయని, అయినా కొంత మంది విమర్శలు చేస్తున్నారని విపక్షాలపై మండి పడ్డారు. అక్కడక్కడా లోపాలు లేవని తాను చెప్పడంలేదన్న కేటీఆర్, పరీక్షలు చేయడంలేదు.. డేటా దాచిపెడుతున్నారన్న ఆరోపణలను మాత్రం కొట్టిపారేశారు. అదే నిజమైతే మరణాల సంఖ్య ఎలా దాయగలమని ప్రశ్నించారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలపై ధ్వజమెత్తారు.
2020-07-08‘కరోనా’ కేసుల్లో ఇండియా రోజుకో రికార్డు బద్ధలు కొడుతోంది. నిన్న రష్యాను వెనుకకు నెట్టి 3వ స్థానానికి ఎగబాకిన ఇండియా, సోమవారం 7 లక్షల మార్కును దాటింది. తాజా సమాచారం ప్రకారం దేశంలో అధికారికంగా నిర్ధారణ అయిన వైరస్ కేసులు 7,18,872. రోజుకు పాతిక వేల కొత్త కేసులు నమోదవుతున్న దశలో దేశంలో ఆందోళన తీవ్రతరమైంది. కేంద్రం ‘అన్ లాక్ 2.0’ ప్రకటించినా రాష్ట్రాల్లో ప్రజా జీవనంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొత్త ప్రాంతాల్లో కూడా కంచెలు వెలిశాయి. ‘కరోనా’ కేసుల్లో అమెరికా 30 లక్షల మార్కును, బ్రెజిల్ 16 లక్షల మార్కును దాటాయి.
2020-07-06చైనాలో ‘కరోనా’ కట్టడి అయ్యాక.. గత నెలలో రాజధాని బీజింగ్ నగరంలో కొద్ది కేసులు నమోదు కావడం కలకలం రేపింది. అయితే, అక్కడి యంత్రాంగం వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నగరంలోని కోటీ 10 లక్షల మందికి పైగా ప్రజలకు న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. అయితే, జూన్ 11 నుంచి జూలై 5 వరకు నగరంలో కేవలం 335 కేసులు నిర్ధారణ అయ్యాయి. అందులో 324 మందికి ఆసుపత్రిలో చికిత్స చేశారు. ‘కోవిడ్ 19’ లక్షణాలు కనిపించని మరో 30 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచారు.
2020-07-06ఉద్రిక్తతలను తగ్గించే చర్యల్లో భాగంగా లడఖ్ లోని గాల్వన్ లోయలో చైనా, ఇండియా సైన్యాలు చెరికొద్ది దూరం వెనుకకు మళ్లినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెలలో బీకర ఘర్షణకు కేంద్ర బిందువైన గాల్వన్ లోయ మలుపు నుంచి చైనా సైన్యం ఓ కిలోమీటర్ వెనుకకు వెళ్ళినట్లు అధికారవర్గాలు పిటిఐకి తెలిపాయి. అయితే, ఇదే పరిస్థితి కొనసాగుతుందా లేదా అన్నది వేచి చూడాలని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి. జూన్ లోనూ చైనా సైన్యం వెనక్కు వెళ్లినట్లు పలుమార్లు భారత ప్రభుత్వ వర్గాల పేరిట వార్తలు వచ్చాయి. జూన్ 15 ఉదయం ఇలాంటి వార్త రాగా ఆ రాత్రి జరిగిన బీకర ఘర్షణలో 20 మందికి పైగా భారత జవాన్లు మరణించారు.
2020-07-06ఏపీలో ‘కరోనా’ పరీక్షల సంఖ్య శనివారం 10,17,140కి పెరిగింది. ప్రతి 10 లక్షల జనాభాకు 19,048 టెస్టులతో రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. శనివారం 20,567 నమూనాలను పరీక్షించగా 998 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయింది. కొత్త కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాల్లో గుంటూరు (157), తూర్పుగోదావరి (118), కర్నూలు (97)తో పాటు శ్రీకాకుళం (96), విశాఖపట్నం (88) ఉండటం గమనార్హం. కాగా, నిన్నటికి దేశం మొత్తంమీద 97,89,066 పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) వెల్లడించింది.
2020-07-05లడఖ్ లోని గాల్వన్ లోయలో ఇండియా, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సినిమా తీయబోతున్నారు. గాల్వన్ లోయలో ఇండియా పెట్రోలింగ్ పాయింట్ ను చైనా స్వాధీనం చేసుకున్న తర్వాత గత నెల 15న జరిగిన ఘర్షణలో 20 మందికి పైగా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ రోజు ఏం జరిగిందో అజయ్ దేవగన్ వెండి తెరపై చూపించబోతున్నారు! సినిమా తారాగాణం, టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. అజయ్ తన సొంత నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలోనే ఈ సినిమా తీస్తారని సమాచారం.
2020-07-04భారత భూభాగాన్ని ఎవరూ (చైనా) ఆక్రమించలేదన్న ప్రధాని మోడీ ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు కొనసాగుతున్నాయి. ‘‘చైనా మా భూమిని గుంజుకున్నదని లడఖ్ వాసులు చెబుతున్నారు. మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదని ప్రధాని చెప్పారు. కచ్చితంగా ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారు’’ అని రాహుల్ శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. చైనా లడఖ్ భూభాగాలను ఆక్రమించిందని ఆ ప్రాంత నేతలు, ప్రముఖులు చెప్పిన క్లిప్పులను కలిపి ఓ వీడియోను రాహుల్ షేర్ చేశారు. ప్రధాని మోడీ లడఖ్ పర్యటనకు వెళ్ళిన రోజే రాహుల్ ఈ వీడియోను షేర్ చేయడం గమనార్హం.
2020-07-03‘‘భారత మాత శత్రువులు మీ కోపాన్ని, ప్రతాపాన్ని చూశారు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైన్యాన్ని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రధాని లడాఖ్ లోని ‘లేహ్’లో ఆకస్మికంగా పర్యటించారు. ఇటీవల గాల్వన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణలో గాయపడిన భారత జవాన్లను ప్రధాని పరామర్శించారు. ఆ ఘర్షణలో మరణించిన సైనికులకు నివాళి అర్పించిన అనంతరం సైనికాధికారులను ఉద్ధేశించి ప్రసంగించారు. ‘‘మీరు, మీతోటి సైనికులు చూపించిన ధైర్యంతో భారతదేశ బలంపై ప్రపంచానికి ఓ సందేశం వెళ్ళింది. మీ మనోధైర్యం హిమాలయ సమానం’’ అని మోడీ సైన్యంపై ప్రశంసల వర్షం కురిపించారు.
2020-07-03