ఇండియా X న్యూజీలాండ్.. ఐసిసి ప్రపంచకప్ 2019 తొలి సెమీఫైనల్ ఈ రెండు జట్ల మధ్య మంగళవారం జరగనుంది. రెండో సెమీఫైనల్ ఐదుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు, 2019 ప్రపంచకప్ ఆతిథ్య దేశం ఇంగ్లండ్ కు మధ్య గురువారం జరుగుతుంది. శనివారంతో లీగ్ మ్యాచులు పూర్తయ్యాయి. చివరి లీగ్ మ్యాచులో ఇండియా గెలిస్తే.. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మాత్రం దక్షిణాఫ్రికాపై ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో ఇండియా మొదటి స్థానం కొనసాగింది.
2019-07-07ఖరీఫ్ పంటలపై వర్షాభావం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సీజన్ ప్రారంభమయ్యాక ఇప్పటివరకు పడవలసిన సాధారణ వర్షపాతంకంటే 33 శాతం తక్కువ నమోదైంది. ఫలితంగా ఖరీఫ్ పంటల సాగు 27 శాతం తగ్గింది. గత వారం వరకు దేశవ్యాప్తంగా 234.33 లక్షల హెక్టార్లలో పంటల సాగు ప్రారంభమైంది. గత ఏడాది అదే సమయానికి 319.68 లక్షల హెక్టార్లలో మొక్కలు వేశారు. ముఖ్యంగా అపరాల సాగు గత ఏడాది (27.91 లక్షల హెక్టార్లు) కంటే ఈ ఏడాది (7.94 లక్షల హెక్టార్లు) బాగా తగ్గింది.
2019-07-07 Read Moreఒకే ప్రపంచ కప్ టోర్నీలో 5 సెంచురీలు సాధించిన మొదటి ఆటగాడిగా.. భారత హార్డ్ హిట్టర్ రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. శనివారం శ్రీలంకపై ఆడిన ఆఖరి లీగ్ మ్యాచులో 103 పరుగులు సాధించి ప్రపంచ కప్ 2019లో ఐదో సెంచురీని నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర (4 సెంచురీలు) పేరిట ఉండేది. రోహిత్ గత మూడు మ్యాచులలో వరుసగా సెంచురీలు నమోదు చేయడం మరో విశేషం. వీటితో శర్మ వన్డే సెంచురీల సంఖ్య 27కి చేరింది.
2019-07-06ఇండియా చివరి లీగ్ మ్యాచ్ ఆడిన తర్వాత ప్రపంచ కప్ 2019 పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరింది. లీగ్ దశ వరకు 9 మ్యాచులు ఆడిన ఇండియా 7 గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా టై కాగా ఒకే మ్యాచ్ లో ఓడింది. దీంతో 15 పాయింట్లతో నెంబర్ 1గా నిలిచింది. అయితే, 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మరో లీగ్ మ్యాచ్ (దక్షిణాఫ్రికాపై) ఆడవలసి ఉంది. అందులో గెలిస్తే 16 పాయింట్లతో ఆ జట్టు తిరిగి నెంబర్ 1 అవుతుంది.
2019-07-06ప్రపంచ కప్ క్రికెట్లో ఇండియా ఆఖరి లీగ్ మ్యాచ్ లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకొని 264 పరుగులు మాత్రమే చేసింది. ఇండియా బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా... బ్యాటింగ్ లో కెఎల్ రాహుల్ (111), రోహిత్ శర్మ (103) సెంచరీలతో అదరగొట్టారు. వారిద్దరూ 30.1 ఓవర్లపాటు కలసి ఆడి 189 పరుగుల ఫస్ట్ వికెట్ భాగస్వామ్యాన్ని సాధించారు. దీంతో.. 39 బంతులు మిగిలి ఉండగానే విజయం వరించింది.
2019-07-06ఈసారి కేంద్ర బడ్జెట్ తోనూ ఏపీకి నిరాశే ఎదురైంది. రాష్ట్ర విభజన హామీల్లో ప్రధానమైన అంశాలకు కేటాయింపులు లేవు. కేంద్రీయ విశ్వ విద్యాలయానికి రూ. 13 కోట్లు... ఏపీ, తెలంగాణలలో గిరిజన విశ్వ విద్యాలయాలకు కలిపి రూ. 8 కోట్లు కేటాయించారు. గత ఏడాది రెండు గిరిజన విశ్వ విద్యాలయాలకు రూ. 20 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో ఆ మొత్తం కేవలం కోటి రూపాయలకు పరిమితమైంది. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు రెండూ కేంద్ర బడ్జెట్ పై పెదవి విరిచాయి.
2019-07-05అమెరికాలోని సంపన్న రాష్ట్రం కేలిఫోర్నియాను రెండు రోజుల్లో రెండో భారీ భూకంపం కుదిపేసింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.19కి సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. గురువారం 6.4 తీవ్రతతో భూమి కంపించగా.. దానికంటే పెద్ద ప్రకంపన రానుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. లాస్ ఏంజెలీస్ నగరానికి 272 కిలోమీటర్ల దూరంలో డెత్ వ్యాలీ జాతీయ పార్కును ఆనుకొని ఉన్న రిడ్జ్ క్రెస్ట్ పట్టణం తాజా భూకంపంతో ప్రభావితమైంది.
2019-07-06 Read More2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా కింద రూ. 19,718.57 కోట్లు రానున్నాయి. మొత్తం బదలాయింపుల్లో తెలంగాణ వాటా 2.437 శాతం. శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం.. ఈ ఏడాది తెలంగాణకు కార్పొరేషన్ పన్ను రూపంలో 6,718.49 కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి రూ. 5,135.90 కోట్లు, కేంద్ర జీఎస్టీ నుంచి రూ. 5,369.67 కోట్లు, కస్టమ్స్ సుంకాలనుంచి రూ. 1,419.41 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ సుంకాలనుంచి రూ. 1,075.28 కోట్లు అందనున్నాయి.
2019-07-05కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 2019-20 సంవత్సరంలో రూ. 34,833.18 కోట్లు బదిలీ అవుతాయని బడ్జెట్లో పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు బదలాయించే మొత్తం (రూ. 8,09,233 కోట్ల)లో ఇది 4.305 శాతం. కార్పొరేషన్ పన్నులో రూ. 11,868.32 కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్నులో రూ. 9,072.65 కోట్లు, జీఎస్టీలో రూ. 9,485.62 కోట్లు, కస్టమ్స్ సుంకాల్లో 2,507.40 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ సుంకాల్లో రూ. 1,899.51 కోట్లు ఏపీ వాటా కింద రానున్నాయి.
2019-07-05కేంద్ర ప్రభుత్వ అప్పులు ఒక్క ఏడాది కాలంలో రూ. 8.11 లక్షల కోట్ల మేరకు పెరగనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంచనా వేశారు. 2019 మార్చినాటికి అప్పుల మొత్తం రూ. 90,56,725 కోట్లు కాగా, 2020 మార్చినాటికి 98,67,921 కోట్లకు పెరగనుంది. అంతర్గత అప్పులు, ఇతర బాధ్యతల మొత్తం రూ. 87,97,766 కోట్ల నుంచి రూ. 95,99,652 కోట్లకు.. విదేశీ అప్పు స్పల్పంగా రూ. 2,58,959 కోట్ల నుంచి రూ. 2,68,269 కోట్లకు పెరుగుతాయని అంచనా.
2019-07-05