మానభంగాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఎన్.సి.ఆర్.బి. తాజాగా విడుదల చేసిన 2017 నేర గణాంకాల ప్రకారం ఆ రాష్ట్రంలో మానభంగాల బాధిత మహిళల సంఖ్య 5599. 2017లో మానభంగానికి గురై ఫిర్యాదు చేసిన మహిళల సంఖ్య ఉత్తరప్రదేశ్ లో 4669, రాజస్థాన్ లో 3319 మంది, ఒడిషాలో 2082 మంది, అస్సాంలో 2048 మంది, కేరళలో 2035 మంది, మహారాష్ట్రలో 1945 మంది, చత్తీస్ గఢ్ రాష్ట్రంలో 1926 మంది, ఢిల్లీలో 1231 మంది, హర్యానాలో 1104 మంది, పశ్చిమ బెంగాల్ లో 1084 మంది, ఆంధ్రప్రదేశ్ లో 1005.
2019-10-222017లో దేశవ్యాప్తంగా లైంగిక వేధింపుల బారిన పడినట్టు ఫిర్యాదు చేసిన మహిళల సంఖ్య 21,512. కేసుల సంఖ్య 20,948. రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ బాధితుల సంఖ్యలో 4వ స్థానంలోనూ, కేసుల సంఖ్యలో 5వ స్థానంలోనూ ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ విషయంలో (6,151 మందితో) అగ్ర స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్ (2985), మహారాష్ట్ర (2942), ఆంధ్రప్రదేశ్ (1146మంది), ఒడిషా (1134) ఉన్నాయి. షెల్టర్ హోమ్స్ లో లైంగిక వేధింపుల కేసులు ఉత్తర ప్రదేశ్ (239) తర్వాత ఏపీలోనే ఎక్కువ (70)గా నమోదయ్యాయి.
2019-10-22ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ నేరాల రేటు తెలంగాణ రాష్ట్రంలో బాగా ఎక్కువగా ఉంది. ఈ కేటగిరిలో రాజస్థాన్ 28.5 రేటుతో దేశంలోనే తొలి స్థానంలో ఉంటే తెలంగాణ 27.3 రేటుతో రెండో స్థానంలో నిలిచింది. జాతీయ సగటు నేరాల రేటు 9.7 శాతంగా ఉంటే సోదర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అంత కంటే ఎక్కువ (10.5) రేటుతో ముందుంది. ఎన్.సి.ఆర్.బి. 2017 నేర గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా 1,35,134 ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ కేసులు నమోదు కాగా తెలంగాణలో 12,532 కేసులు, రాజస్థాన్ లో 21,306 కేసులు నమోదయ్యాయి.
2019-10-22దేశంలో మత, కుల ఘర్షణలు తగ్గాయా? అవుననే అంటోంది ఎన్.సి.ఆర్.బి. విడుదల చేసిన ‘క్రైమ్స్ ఇన్ ఇండియా 2017’ నివేదిక. 2017లో 723 మత సంబంధమైన ఘర్షణల కేసులు నమోదయ్యాయి. 2015లో 789 కేసులు, 2016లో 869 కేసులు నమోదయ్యాయి. కులపరమైన ఘర్షణ కేసుల్లో మరింత తగ్గుదల కనిపిస్తోంది. 2015లో 2,428 కేసులు, 2016లో 2295 కేసులు నమోదు కాగా 2017లో 805 మాత్రమే నమోదైనట్టు ఎన్.సి.ఆర్.బి. నివేదిక పేర్కొంది. అయితే, అల్లర్ల కేసులు వరుసగా 65255, 61974, 58,880 కేసులు నమోదయ్యాయి.
2019-10-22తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో గత నెలలో మునిగిపోయిన బోటును మంగళవారం వెలికి తీశారు. మునిగిన తర్వాత ఇసుకలో కూరుకుపోయి 38 రోజులు నానడంతో బోటు ధ్వంసమైంది. ఆ బోటు శిధిలాల మధ్యనే కొన్ని శవాలు బయటపడ్డాయి. పాపికొండలు చూడటానికి వెళ్లిన 77 మంది పర్యాటకులతో కూడిన బోటు గత నెల 15న మునిగిపోయింది. 26 మంది ప్రాణాలతో బయటపడగా 39 మృతదేహాలు దొరికాయి. మరో 12 మంది బోటులో చిక్కుకుపోయారు.
2019-10-22విమర్శకులపై కేంద్ర ప్రభుత్వం విరుచుకుపడుతున్న వేళ ‘దేశద్రోహం’ కేసులు నమోదు చేయడం పెరిగింది. 2017లో 51 దేశద్రోహం కేసులు నమోదైనట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) 2017 నివేదిక చెబుతోంది. ఈ కేటగిరిలో 2015లో 30 కేసులు నమోదు కాగా, 2016లో 35 నమోదు చేశారు. రాజ్యానికి వ్యతిరేకంగా ఇతర నేరాలకు పాల్పడిన ఉదంతాల్లో 109 కేసులు నమోదయ్యాయి. 2015లో 117, 2016లో 143 నమోదు కాగా ఈ కేసులు 2017లో తగ్గాయి. దేశద్రోహం కేసుల్లో 2018, 2019లలో మరింత పెరుగుదల కనిపించొచ్చు.
2019-10-22దేశంలో నేరాల సంఖ్య, నమోదవుతున్న కేసుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. 2017లో నమోదైన కేసుల సంఖ్య ఏకంగా 50 లక్షలు దాటింది (50,07,044). అందులో ఐపిసి కేసులు 30,62,579 కాగా ప్రత్యేక, స్థానిక చట్టాల పరిధిలో నమోదనవి మరో 19,44,465. నేరాల సంఖ్యలో గ్రోత్ 3.6 శాతంగా ఉన్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) తాజా నివేదికలో పేర్కొంది. క్రైమ్స్ ఇన్ ఇండియా 2017 నివేదిక ప్రకారం 2016లో నమోదైన కేసులు 48,31515. తర్వాత ఏడాదికి సుమారు 2 లక్షలు పెరిగాయి.
2019-10-22దేశంలో పిల్లలపై నేరాలు ఏటేటా పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన జాతీయ నేర గణాంక బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) నివేదిక ప్రకారం 2017లో పిల్లలపై నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 1,29,032 కేసులు నమోదయ్యాయి. 2015లో 94,172 కేసులు, 2016లో 1,06,958 కేసుల నుంచి ఇది అసాధారణ పెరుగుదల. పిల్లలపై నేరాల రేటు 2016లో లక్ష మందికి 24 నుంచి 2017లో 28.9కి పెరగడం ఆందోళన కలిగించే పరిణామం. 2017 గడచిపోయి రెండు సంవత్సరాలు అవుతుండగా ఎన్.సి.ఆర్.బి. అసాధారణ ఆలస్యం తర్వాత నివేదికను విడుదల చేసింది.
2019-10-22సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నమోదు చేసిన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి సుప్రీంకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. చిదంబరం బెయిల్‌ను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం పక్కన పెట్టింది. మరే ఇతర కేసులోనూ కస్టడీలో ఉండాల్సిన అవసరం లేకపోతే చిదంబరాన్ని వెంటనే విడుదల చేయాల్సి వుంటుంది. అయితే, ఐఎన్‌ఎక్స్ మీడియాపైనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నమోదు చేసిన వేరొక కేసుకు సంబంధించి చిదంబరం ప్రస్తుతం ఆ ఏజన్సీ అదుపులో ఉన్నారు.
2019-10-22 Read Moreపారిస్ 2024 ఒలింపిక్స్, పారాలంపిక్స్ లోగోను నిర్వహణా కమిటీ ఆవిష్కరించింది. గోల్డ్ మెడల్ పైన ఒలింపిక్, పారాలంపిక్ జ్వాలలు ఉన్నట్టుగా పారిస్ ప్రత్యేకత ఉట్టిపడేలా ఈ లోగోను రూపొందించారు. దిగువ భాగంలో ఒలింపిక్ క్రీడల గుర్తు, పారిస్ 2024 క్యాప్షన్ ఉంది. మొదటిసారిగా ఒలింపిక్, పారాలంపిక్ క్రీడలకు ఒకే ఎంబ్లమ్ ఉపయోగిస్తున్నారు. 1924 పారిస్ ఒలింపిక్స్ ను గుర్తు చేసేలా ఈ లోగో రూపొందింది.
2019-10-22