25వ జేమ్స్ బాండ్ 007 సినిమా ‘మరణానికి సమయం లేదు (నో టైం టు డై)’.. ‘విడుదలకు ఇది సమయం కాద’ని నిర్మాతలు ఏకంగా 7 నెలలు వాయిదా వేశారు. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లపై ‘కరోనా’ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న భయమే దీనికి కారణం. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కావలసి ఉంది. ‘కరోనా’ దెబ్బకు చైనా, జపాన్, ఇటలీ, దక్షిణ కొరియా లలో సినిమా హాళ్లు పెద్ద సంఖ్యలో మూతపడ్డాయి. దీంతో ఈ సినిమా విడుదలను నిర్మాణ కంపెనీలు నవంబరుకు వాయిదా వేశాయి. నవంబరు 12న యు.కె.లో, 25న అమెరికాలో విడుదల చేయనున్నారు.
2020-03-05 Read Moreఇక ప్రవాస భారతీయులు ఎయిర్ ఇండియాలో 100 శాతం ఈక్విటీని కొనుగోలు చేయవచ్చు. ఈమేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానానికి ప్రతిపాదించిన సవరణను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. విదేశాల్లో ఉన్న భారతీయులు ఎయిర్ ఇండియాలో పెట్టే పెట్టుబడిని కూడా ప్రభుత్వం దేశీయ పెట్టుబడిగానే పరిగణించనుంది. ఇంతకు ముందు ఎయిర్ ఇండియాలో 49 శాతం ఈక్విటీ కొనుగోలుకే ఎన్ఆర్ఐలకు అవకాశం ఉంది. విమాన యాన సంస్థల్లో ఎఫ్.డి.ఐ.కి కూడా 49 శాతం పరిమితి ఉంది.
2020-03-05 Read More10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4గా విలీనం చేసే ప్రక్రియకు కేంద్ర మంత్రివర్గం బుధవారం (మార్చి 4న) ఆమోదం తెలిపింది. ఈ విలీనం ఏప్రిల్ 1వ తేదీనుంచే అమల్లోకి రానుంది. 1. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం, 2. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు విలీనం, 3. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు విలీనం. 4. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనం...తో మొత్తం 7 మెగా బ్యాంకులు రూపొందుతాయని కేంద్రం ఘనంగా చెబుతోంది.
2020-03-05 Read More‘కరోనా వైరస్’తో ఇటలీలో 109 మంది మరణించినట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. గత 24 గంటల్లోనే 28 మంది చనిపోయారని తెలిపింది. ఇటలీ ‘కరోనా’ మరణాల సంఖ్యలో ఇరాన్ (92)ను మించిపోయింది. ఈ విస్తృతికి భయపడి దేశంలోని మొత్తం పాఠశాలలు, యూనివర్శిటీల మూసివేతకు ఇటలీ ప్రభుత్వం ఆదేశించింది. పరిస్థితి కుదుట పడితే మార్చి రెండో పక్షంలో విద్యాలయాలను తెరిచే అవకాశం ఉంది. బుధవారానికి ఇటలీలో 2706 కరోనా కేసులు నమోదయ్యాయి.
2020-03-04బిలియనీర్ మైకేల్ బ్లూమ్‌బెర్గ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధిత్వంకోసం జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో బ్లూమ్‌బెర్గ్ కు ఆశించిన మద్ధతు రాలేదు. నిన్న 14 రాష్ట్రాల డెమోక్రాటిక్ ప్రతినిధులు ఓటు వేసిన ‘సూపర్ ట్యూజ్ డే’లో బ్లూమ్ బెర్గ్ కేవలం ‘అమెరికన్ సమోవా’లో మాత్రమే గెలిచారు. జో బిడెన్ 9 రాష్ట్రాల్లో ముందున్నారు. దేశమంతటా చూసినప్పుడు డెమోక్రాటిక్ సోషలిస్టు బెర్నీ శాండర్స్ కు మద్ధతు పెరుగుతుండటంతో ఆయన ప్రత్యర్ధులంతా జో బిడెన్ వైపు చేరుతున్నారు. తాజాగా బ్లూమ్‌బెర్గ్ కూడా ‘జో’కు జై కొట్టారు.
2020-03-04 Read Moreకొద్ది రోజుల క్రితం అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో బుధవారం రాహుల్ గాంధీ బృందం పర్యటించింది. అల్లరి మూకలు ధ్వంసం చేసిన ఓ పాఠశాలను, సమీపంలోని బ్రిజ్ పురిలో దగ్ధం చేసిన ఓ మసీదును ఈ బృందం చూసింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘‘విద్వేషం, హింస అభివృద్ధికి శత్రువులు. భావి భారతానికి చిహ్నమైన పాఠశాలను ధ్వంసం చేశారు. హింస ఏ ఒక్కరికీ ప్రయోజనం కాదు. అది ప్రజలకు, భారత మాతకూ హానికరం’’ అని వ్యాఖ్యానించారు.
2020-03-04 Read Moreప్రభుత్వ భవనాలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు చీవాట్లు పెట్టినా ధోరణి మారలేదు. ఉగాది రోజున పేదలకు పంపిణీ చేయనున్న ఇళ్ళ పట్టాలకూ వైసీపీ వర్ణాలు అద్దింది ప్రభుత్వం. బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశంలో ఈ పత్రాన్ని అందరికీ చూపించారు. 26 లక్షల మందికి ఇళ్ల పట్టాలకోసం 43,141 ఎకరాల భూమిని సిద్ధం చేశామని, అందులో 26,976 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, యుద్ధ ప్రాతిపదికన మార్కింగ్ చేసి లబ్దిదారులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
2020-03-04జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్) కోసం ఏప్రిల్ 1 నుంచి చేపట్టనున్న సమాచార సేకరణలో 2010 ప్రశ్నావళినే వినియోగించాలని కేంద్రాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీర్మానం చేసింది. మార్పు చేసేవరకు ఎన్.పి.ఆర్. ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించినట్టు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మంత్రివర్గ సమావేశం అనంతరం చెప్పారు. 2020 ఎన్.పి.ఆర్. సవరణకోసం రూపొందించిన ప్రశ్నావళిపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, వారిలో అభద్రతా భావాన్ని తొలగించాల్సి ఉందని మంత్రి చెప్పారు.
2020-03-04ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పథకానికీ సొంత పేర్లు పెట్టుకోవడం పాలకులకు పరిపాటిగా మారింది. చంద్రబాబుతో పోలిస్తే యువకుడైన సిఎం జగన్ ఇప్పటికే ఆరు పథకాలకు తన పేరు పెట్టుకున్నారు. తాజాగా పేదల ఇళ్ళ నిర్మాణ పథకానికీ తన పేరు, తండ్రి పేరు కలిపి పెట్టాలని నిర్ణయించారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సహచరులంతా దీనికి ‘మమ’ అన్నారు. ఏటా 6 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఆయా కాలనీలకు ‘‘వైఎస్ఆర్ జగనన్న కాలనీలు’’గా నామకరణం చేయనున్నట్టు ప్రకటించింది.
2020-03-04 Read Moreసొంత నియోజకవర్గాల్లో స్థానిక సంస్థలను కోల్పోతే మంత్రి పదవులకు రాజీనామా చేయవలసి ఉంటుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహచర మంత్రులను హెచ్చరించారు. ఎమ్మెల్యేలైతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఉండకపోవచ్చని కూడా వ్యాఖ్యానించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. అధికారులు నిష్క్రమించిన తర్వాత రాజకీయ చర్చ జరిగింది. జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతను ఆ జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు తీసుకోవాలని జగన్ స్పష్టం చేశారు.
2020-03-04