గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. కానీ, ఈ గురువారం స్టాక్ మార్కెట్లలో అనేక మంది సంపదను తగ్గించింది. ప్రపంచవ్యాప్తంగా పతనమవుతున్న స్టాక్ మార్కెట్ల వరుసలోనే బిఎస్ఇ సెన్సెక్స్ అసాధారణంగా పడిపోతోంది. గురువారం తొలి గంటన్నరలోనే ఏకంగా రూ. 8,56,690 కోట్ల మేరకు ఇన్వెస్టర్ల సంపద తుడిచి పెట్టుకుపోయింది. ఉదయం 10.30 సమయానికి దలాల్ వీధిలో మొత్తం మార్కెట్ విలువ రూ. 1,28,56,869 కోట్లకు తగ్గిపోయింది. బుధవారం వాణిజ్యం ముగిసే సమయానికి మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 1,37,13,559 కోట్లుగా ఉంది.
2020-03-12 Read Moreతాను తమిళనాడు సిఎం కావాలనుకోవడం లేదని, పార్టీ అధ్యక్షుడిగానే ఉంటానని సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రకటించారు. గురువారం చెన్నైలో రజినీ మక్కల్ మంద్రం (ఆర్ఎంఎం) కార్యకర్తలు, విలేకరులను ఉద్ధేశించి రజినీకాంత్ మాట్లాడారు. విద్యావంతుడు, దూరదృష్టిగల ఓ యువకుడు ముఖ్యమంత్రి అవుతాడని రజినీ చెప్పారు. సిఎం పరిపాలిస్తే పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారని, తప్పు జరిగితే తొలుత ప్రశ్నించేది తామేనని చెప్పుకొచ్చారు. అయితే, పార్టీ ఎప్పుడు ప్రారంభించేదీ రజినీ ఈసారి కూడా వెల్లడించలేదు.
2020-03-12గురువారం ఉదయం 11.10 గంటల సమయంలో బిఎస్ఇ సెన్సెక్స్ 33,075 పాయింట్లకు దిగజారింది. క్రితం రోజు ముగింపు (35,697) కంటే ఇది 2,622 పాయింట్లు తక్కువ. ఇండెక్స్ ఏకంగా 7.2 శాతం దిగజారడం ఇదే ప్రథమం. ఓ అరగంట తర్వాత 33,214.71 పాయింట్ల వద్ద వాణిజ్యం కొనసాగుతోంది. గురువారమంతా స్టాక్ మార్కెట్లో అలజడే. ఎస్&పి బిఎస్ఇ 500 స్టాక్స్ లో దాదాపు సగం (217) 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరాయి. 115 స్టాక్స్ ఏడాది క్రితం విలువలో 50 శాతం పైగా కోల్పోయాయి.
2020-03-12చెప్పులు, దుస్తులు, సెల్ ఫోన్లు, ఎరువులపై జీఎస్టీ (వస్తు సేవల పన్ను)ని పెంచే అవకాశాలున్నాయి. ఈ నెల 14న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్ల మార్పుపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం.. మొబైల్ ఫోన్లపై 12 శాతం పన్ను ఉండగా, వాటిలో వినియోగించే కొన్ని పరికరాలపై 18 శాతం ఉంది. రూ. 1000 లోపు ధర ఉన్న చెప్పులపై 5 శాతం, ఎక్కువ ధర ఉన్నవాటిపై 18 శాతం పన్ను వేస్తున్నారు. వివిధ రకాల దుస్తులపై 5, 12, 18 శాతం చొప్పున ఉండగా.. ఎరువులపై 5 శాతం, వాటిలో వాడే సరుకులపై 12 శాతం పన్ను ఉంది.
2020-03-12 Read Moreయు.కె. మినహా మిగిలిన యూరప్ దేశాల నుంచి అమెరికాకు అన్ని రకాల ప్రయాణాలను 30 రోజుల పాటు నిషేధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని జాతిని ఉద్ధేశించి బుధవారం రాత్రి (అమెరికా కాలమానం) చేసిన ప్రసంగంలో చెప్పారు. నిషేధ నిబంధనలు వాణిజ్యం, సరుకు దిగుమతులకూ వర్తిస్తాయని ట్రంప్ చెప్పారు. చైనా నుంచి ప్రయాణాలను నివారించకపోవడంవల్లనే ఐరోపా దేశాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
2020-03-12 Read More‘కరోనా వైరస్’ను నియంత్రించే చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం పర్యాటక, వైద్య వీసాలన్నిటినీ సస్పెండ్ చేసింది. ఏప్రిల్ 15 వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుంది. వీసా లేకపోయినా అనుమతించే నాన్ ఒసిఐ (ఓవర్సీస్ సిటిజెన్ షిప్ ఆఫ్ ఇండియా) కార్డుదారులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. విదేశీ ప్రయాణాలను మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం పౌరులందరికీ సూచించింది. ప్రవాస భారతీయులు కూడా ఇండియాకు రావడం మానాలని స్పష్టం చేసింది. విదేశాల నుంచి తిరిగి వచ్చినవారిని 14 రోజులు ‘క్వారంటైన్’లో ఉంచుతామని స్పష్టం చేసింది.
2020-03-11భారత స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. గురువారం వాణిజ్యం ప్రారంభం కాగానే ఈక్విటీ మార్కెట్లలో భారీగా పడిపోయాయి. 114 దేశాలకు వ్యాపించిన ‘కరోనా వైరస్’ను భూగోళ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ప్రకటించడం మార్కెట్లపై ప్రభావం చూపింది. సెన్సెక్స్, నిఫ్టీ 5 శాతం చొప్పున దిగజారాయి. బిఎస్ఇ సెన్సెక్స్ ప్రారంభంలో సుమారు 1800 పాయింట్లు పతనమై ప్రస్తుతం 1680 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. నిఫ్టీ 10 వేల పాయింట్ల దిగువకు (9,925 స్థాయికి) పడిపోయింది.
2020-03-12 Read Moreమాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు, అడ్వకేట్ కిషోర్ లపై దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తురకా కిషోర్, మల్లెల గోపి, బత్తుల నాగరాజు లపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు ఐజి ప్రభాకరరావు తెలిపారు. దాడిలో బొండా వాహనంతో పాటు పోలీసు వాహనం కూడా ధ్వంసమైనట్టు చెప్పారు. ఎంపిటిసి, జడ్.పి.టి.సి. ఎన్నికల్లో టీడీపీ నేతలను నామినేషన్లు వేయనివ్వకుండా వైసీపీ శ్రేణులు అనేక చోట్ల అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం దాడి జరిగింది.
2020-03-11స్థానిక ఎన్నికల సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు మాచర్ల వెళ్లిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు లపై స్థానిక వైసీపీ నేతలు దాడి చేశారు. వారిద్దరూ ప్రయాణిస్తున్న కారుపై పెద్ద కట్టెలతో పొడుస్తూ అద్దాలు బద్దలు కొట్టారు. ఈ దాడిలో అడ్వకేట్ కిషోర్ తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ అభ్యర్ధి నామినేషన్ ను అడ్డుకోవడంతో ఆ సమస్య పరిష్కారం కోసం తాము అక్కడికి వెళ్లామని బాధిత నేతలు, న్యాయవాది కిషోర్ దాడి అనంతరం చెప్పారు. పోలీసు వాహనంలోకి మారితే ఆ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని బుద్ధా వెంకన్న చెప్పారు.
2020-03-11మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హత్య (2019 మార్చి 15న) జరిగి ఏడాది గడచినా దర్యాప్తులో పురోగతి లేకపోవడంపై పలు సందేహాలతో వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత సీబీఐ విచారణ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఎన్నికలకు ముందు బాబాయి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని కోరిన జగన్మోహన్ రెడ్డి, సిఎం అయ్యాక పిటిషన్ ఉపసంహరించుకున్నారు. వివేకా కుటుంబం, ప్రభుత్వం వైపు వాదనలు విన్న హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
2020-03-11