జమ్మూ కాశ్మీర్ ఇస్లామిక్ స్టేట్ (ఐ.ఎస్.జె.కె)కు పాకిస్తాన్ లింకు ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) తెలిపింది. ఈ ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచే మార్గనిర్దేశనం జరుగుతోందని ఇటీవల జమ్మూ కోర్టులో సమర్పించిన చార్జిషీటులో నిర్ధారించింది. గత నవంబరులో ఢిల్లీ పోలీసులు శ్రీనగర్ పట్టణంలో అరెస్టు చేసిన నలుగురిలో ముగ్గురు (తాహిర్, హారిస్, ఆసిఫ్ నదాఫ్) ఐఎస్ క్రియాశీల ఉగ్రవాదులని ఎన్ఐఎ పేర్కొంది.
2019-06-162024 నాటికి ఇండియా జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు పెరగాలంటే.. ప్రతి రాష్ట్ర జీడీపీ ఇప్పుడున్న స్థాయి నుంచి రెట్టింపు కావలసి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. శనివారం ఢిల్లీలో ‘నీతిఆయోగ్’ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాని ఈ అంశంపై ముఖ్యమంత్రులతో మాట్లాడారు. రాష్ట్రాల జీడీపీలు 2 నుంచి 2.5 రెట్లు పెరిగేలా లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధనకోసం జిల్లా స్థాయినుంచే కృషి చేయాలని ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు.
2019-06-15‘ప్రత్యేక కేటగిరి హోదా’ అంశాన్ని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ‘నీతిఆయోగ్’ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తారు. ‘ప్రత్యేక కేటగిరి హోదా’ ఇవ్వడానికి నిర్దేశించుకున్న ప్రమాణాల్లో ‘ప్రకృతి వైపరీత్యాలు’ కూడా చేర్చాలని ఆయన విన్నవించారు. ఒడిషా రాష్ట్రం తుపాన్ల ధాటికి గురవుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ... ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే రాష్ట్రాలను ‘ప్రత్యేక కేంద్రీకరణ రాష్ట్రాలు’గా గుర్తించి ‘ప్రత్యేక కేటగిరి హోదా’తో వచ్చే ప్రయోజనాలను కల్పించాలని కోరారు.
2019-06-15 Read Moreవిభజననాటి హామీ ప్రకారం రాష్ట్రానికి ‘ప్రత్యేక కేటగిరి హోదా’ ఇవ్వాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘నీతిఆయోగ్’ ఐదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో జగన్ మాట్లాడారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వ ఆదాయం తలసరిన రూ. 14,411గా ఉంటే ఏపీకి కేవలం రూ. 8,397 వచ్చిందని, 2015-20 కాలంలో ఏపీ రెవెన్యూ లోటు రూ. 22,113 కోట్లుగా ఆర్థిక సంఘం అంచనా వేస్తే 66,362 కోట్లకు పెరిగిందని జగన్ వివరించారు.
2019-06-15గత కొద్ది నెలల్లో ఉప్పు నిప్పుగా ఉన్న భారత, పాకిస్తాన్ సంబంధాల్లో శుక్రవారం ఒక సానుకూల పరిణామం జరిగింది. షాంగై సహకార సంస్థ (ఎస్.సి.ఒ) సదస్సుకోసం కిర్గిజిస్తాన్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మధ్య శుక్రవారం మాటలు కలిశాయి. గురువారం రాత్రి కిర్గిజిస్తాన్ అధ్యక్షుడు ఇచ్చిన విందులో పలకరించుకోని ఈ ఇద్దరు నేతలూ శుక్రవారం ‘లీడర్స్ లాంజ్’లో కలుసుకున్నప్పుడు మాత్రం చేతులు కలిపారు. మోదీ కిర్గిజిస్తాన్ బయలుదేరే ముందు... ఖాన్ తో ద్వైపాక్షిక సమావేశం ఉండదని ఇండియా ప్రకటించింది.
2019-06-14తుపాను ‘వాయు’ తిరిగి గుజరాత్ బాట పట్టింది. అరేబియా సముద్రంలో పుట్టిన ఈ తుపాను తొలుత గుజరాత్ వైపే పయనించింది. ఈ నెల 13న గుజరాత్ రాష్ట్రంలో తీరం దాటవచ్చని అంచనా వేశారు. అయితే 12, 13 తేదీల మధ్య రాత్రి తుపాను దిశ మార్చుకుంది. అది తిరిగి 16 తేదీన గుజరాత్ లోని కచ్ వైపుగా దిశ మార్చుకోవచ్చని, 17-18 తేదీల్లో తీరం దాటవచ్చని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ శుక్రవారం తెలిపింది. ‘చాలా తీవ్రమైన తుపాను’ స్థాయి నుంచి బలహీనపడి తుపానుగానో లేక తీవ్ర వాయుగుండంగానో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు.
2019-06-14మే నెలలో భారత విదేశీ వాణిజ్య లోటు 15.36 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.07 లక్షల కోట్ల)కు పెరిగింది. ఈ మాసంలో ఎగమతుల విలువ 30 బిలియన్ డాలర్లుగా ఉంటే దిగుమతులు 45.35 బిలియన్ డాలర్లకు చేరాయి. వృద్ధి రేటు ఎగుమతుల్లో 3.93 శాతంగా ఉంటే దిగుమతుల్లో 4.31 శాతం నమోదైంది. చమురు దిగుమతుల విలువ 8.23 శాతం పెరిగి 12.44 బిలియన్ డాలర్లకు చేరింది. ఇతర దిగుమతుల విలువలో వృద్ధి తక్కువ (2.9 శాతం)గానే ఉంది. అయితే, బంగారం దిగుమతుల విలువ ఏకంగా 37.43 శాతం పెరిగి 4.78 బిలియన్ డాలర్లకు పెరిగింది.
2019-06-14 Read Moreఎ.పి.ఎస్.ఆర్.టి.సి.ని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీకి సంబంధించి వివిధ కోణాలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర రవాణా శాఖ ఒక నిపుణుల కమిటీని నియమించింది. మాజీ ఐపీఎస్ అధికారి సి. ఆంజనేయరెడ్డి ఛైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, ఈడీ, పూణెలోని కేంద్ర రోడ్డు రవాణా సంస్థ మాజీ డైరెక్టర్ సుదర్శనం, ఆర్థిక శాఖ కార్యదర్శి ఒకరు సభ్యులుగా ఉంటారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే ప్రతిపాదన కూడా ఈ కమిటీ పరిశీలనాంశాల్లో ఒకటి.
2019-06-14ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక గత మూడు వారాల్లో తమ పార్టీ కార్యకర్తలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవారు 100 దాడులకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపించింది. 73 భౌతిక దాడులు జరగ్గా ఐదుగురు టీడీపీ కార్యకర్తలు మరణించారని, 25 ఆస్తుల ధ్వంసం ఘటనలు జరిగాయని టీడీపీ పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్దులతో శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో... వైసీపీ దాడులను ఖండిస్తూ ఓ తీర్మానాన్ని టీడీపీ ఆమోదించింది. మరణించినవారి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించింది.
2019-06-14రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదా ఇచ్చే విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసు మార్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. రేపు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న నేపథ్యంలో విభజన హామీల అమలుకు సంబంధించి అమిత్ షాను కలసినట్టు జగన్ చెప్పారు. షాతో చర్చించిన అంశాలనే రేపు నీతి ఆయోగ్ సమావేశంలోనూ వినిపిస్తానని, రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదా ఇవ్వాలని కోరతానని పేర్కొన్నారు.
2019-06-14