తమిళనాట జంతుక్రీడ ‘జల్లికట్టు’కు ముగ్గురు బలయ్యారు. శుక్రవారం మదురై లోని అలంగనల్లూరు, తిరుచి లోని అవరంగడు పట్టణాల్లో జరిగిన క్రీడా వేడుకల్లో ఈ విషాధ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎద్దుల యజమానులు ఇద్దరు, ఆట చూస్తున్న ప్రేక్షకుడొకరు మరణించారు. అలంగనల్లూరు జల్లికట్టు వేడుకల్లో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
2020-01-18ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ కనీసం లక్ష కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెబుతున్నారు. విగ్రహం ఏర్పాటైన ‘కేవదీయ’లో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని, అక్కడి నుంచి వడోదర వరకు రైల్వే లైన్ నిర్మాణాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ రెండు స్టేషన్ల మధ్య ‘హై స్పీడ్’ షటిల్ రైళ్ళను నడిపిస్తామని గోయల్ చెప్పారు.
2020-01-18 Read Moreపాకిస్తాన్లో ముగ్గురు హిందూ, సిక్కు బాలికల అపహరణపై ఇండియా తీవ్రంగా స్పందించింది. భారత విదేశాంగ శాఖ శుక్రవారం పాకిస్తాన్ హై కమిషన్ అధికారిని పిలిపించి తీవ్రమైన నిరసనను వ్యక్తీకరించింది. శాంతి మేఘ్వాద్, శర్మి మేఘ్వాద్ అనే అమ్మాయిలు జనవరి 14న అపహరణకు గురయ్యారు. వీరిద్దరూ సింధ్ ప్రావిన్సులోని ఉమర్ గ్రామ వాసులు. జనవరి 15న మెహక్ అనే అమ్మాయి అపహరణకు గురైంది. పాకిస్తాన్లో హిందూ మహిళల అపహరణలు, బలవంతపు పెళ్లిళ్ళపై ఇండియా ఇటీవల పలుమార్లు నిరసన వ్యక్తం చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
2020-01-18 Read Moreముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను సవాలు చేస్తూ కొంతమంది రైతులు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. గుజరాత్ హైకోర్టు తమ పిటిషన్లను కొట్టివేయడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి విన్నపాలను పరిశీలించడానికి శుక్రవారం సుప్రీంకోర్టు సమ్మతించింది. తన సొంత రాష్ట్రాన్ని కలుపుతూ తలపెట్టిన ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2017 సెప్టెంబరులో ప్రారంభించారు.
2020-01-17 Read More2019-20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 11,640 కోట్ల మేరకు లాభాలను ఆర్జించింది. ఇది గత ఏడాది మూడో త్రైమాసికం కంటే 13.5 శాతం అధికం. ఆర్ఐఎల్ ఒక థ్రైమాసికంలో ఇంత లాభం సాధించడం ఇదే తొలిసారి. రెవెన్యూ గత ఏడాది కంటే 1.4 శాతం తగ్గినా లాభం అసాధారణంగా పెరగడం విశేషం. మూడో త్రైమాసికంలో రిలయన్స్ రెవెన్యూ రూ. 1,68,858 కోట్లుగా నమోదైంది.
2020-01-17తలసరి జీడీపీలో 10 వేల డాలర్ల మార్కును చైనా దాటేసింది. 2019లో చైనా తలసరి జీడీపీ $10,276గా నమోదైనట్టు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ నింగ్ జిఝె శుక్రవారం చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న చైనా 10 వేల డాలర్ల తలసరి ఉత్పత్తిని సాధించడం ప్రపంచ వ్యాప్త ప్రగతికి దోహదపడుతుందని పేర్కొన్నారు. చైనా ప్రగతి వేగం ఆపతరం కానిదని ఆయన వ్యాఖ్యానించారు. తలసరి జీడీపీ 10 వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉన్న దేశాల జనాభా ఇప్పుడు అమాంతం 300 కోట్లకు పెరిగింది.
2020-01-17 Read More‘పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను ఆమోదించడానికి సిద్ధపడనివాళ్లు పాకిస్తాన్ వెళ్లండి’.. ఇది ఏదో ఒక ఆర్ఎస్ఎస్ లేదా బిజెపి నేత ముస్లింలకు చెప్పిన మాట కాదు. కేరళలో ఓ టీచర్ స్కూలు విద్యార్ధినులకు చెప్పిన మాట. కొడుంగల్లూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో హిందీ టీచర్ కలేశన్ ఓ క్లాసులో కొత్త చట్టంపై ఉపన్యాసంలా చెప్పారు. అదే అధ్యాపకుడు విద్యార్ధినులతో లైంగికపరమైన వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలూ ఉన్నాయి. దీనిపై ప్రాథమిక విచారణ తర్వాత ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
2020-01-17ఢిల్లీ సామూహిక మానభంగం కేసులో దోషులకు ఫిబ్రవరి 1 ఉదయం 6:00 గంటలకు ఉరిశిక్ష విధంచాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. క్షమాబిక్ష కోసం ఓ దోషి పెట్టుకున్న పిటిషన్ ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించిన కొద్ది గంటల్లోనే కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే క్షమాబిక్ష పిటిషన్ తిరస్కరణకు, ఉరిశిక్ష అమలుకు మధ్య రెండు వారాల గడువు ఉండాలనే నిబంధన కారణంగా గత డెత్ వారంట్ లోని తేదీ (22)ని మార్చవలసి వచ్చింది.
2020-01-17కేరళను అనుసరించి పంజాబ్ అసెంబ్లీ కూడా.. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. శుక్రవారం సిఎఎ వ్యతిరేక తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి బ్రహ్మ్ మొహింద్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్) ప్రశ్నావళికి మార్పులు చేయలని కూడా పంజాబ్ కోరుతోంది. ఎన్.పి.ఆర్, 2021 జనాభా లెక్కలకు మార్గదర్శకాలపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ సమావేశం ఏర్పాటు చేసిన రోజునే పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేయడం గమనార్హం.
2020-01-17ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డి రెండు అంశాలపై చేసిన విన్నపాలను సీబీఐ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. అక్రమ ఆస్తుల కేసులో దాఖలైన డిశ్చార్జి పిటిషన్లు అన్నిటినీ కలిపి విచారించాలని జగన్ మరోసారి అభ్యర్ధించారు. ఇందుకు నిరాకరించిన కోర్టు... వేర్వేరుగానే ఆ పిటిషన్లను విచారించాలని నిర్ణయించింది. సీబీఐ కేసుల విచారణ పూర్తయిన తర్వాతే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) కేసులను విచారించాలన్న మరో విన్నపాన్ని కూడా కోర్టు తిరస్కరించింది.
2020-01-17