లడఖ్ లోని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 40 మందికి పైగా చైనా సైనికులు చనిపోయారన్న ప్రచారాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. అది ‘ఫేక్ న్యూస్’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ మంగళవారం స్పష్టం చేశారు. ఆ ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించగా.. చైనీయులు ఎంతమంది చనిపోయిందీ ఆ దేశం వెల్లడించలేదు. అయితే, ‘కనీసం 40 మంది’ చైనీయులు మరణించారని ఇండియా మంత్రి వి.కె. సింగ్ సహా అనేక మంది చెప్పారు. బీజింగ్ మాత్రం మృతుల సంఖ్యను ప్రకటించి ఇరువైపులా భావోద్వేగాలను రెచ్చగొట్టడం మంచిది కాదనే వెల్లడించడంలేదని పేర్కొంది.
2020-06-23గర్భంతో ఉన్న జామియా మిలియా యూనివర్శిటీ విద్యార్ధిని సఫూరా జర్గర్ కు ఎట్టకేలకు బెయిలు మంజూరైంది. ‘మానవతా ప్రాతిపదిక’న బెయిలు మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్న ఢిల్లీ హైకోర్టు, అనుమతి లేకుండా ఢిల్లీ దాటి వెళ్ళవద్దని ఆమెను ఆదేశించింది. 15 రోజులకు ఒక్కసారైనా కేసు దర్యాప్తు అధికారికి ఫోన్ చేయాలని నిర్దేశించింది. ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఫిబ్రవరిలో ఆందోళన చేపట్టినప్పుడు జరిగిన హింసకు సంబంధించి.. సఫూరాపై పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం యుఎపిఎ కింద కేసు నమోదు చేశారు. ఎంఫిల్ విద్యార్ధిని అయిన సఫూరా 23 వారాల గర్భవతి.
2020-06-23‘కరోనా’, దాని కట్టడికోసమంటూ విధించిన ‘లాక్ డౌన్’ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. తెలుగు రాష్ట్రాల్లో తలసరి ఆదాయ నష్టం తెలంగాణలోనే ఎక్కువగా కనిపిస్తోంది. 2019-20తో పోలిస్తే 2020-21లో తలసరి ఆదాయం తెలంగాణలో 11.1 శాతం, ఆంధ్రలో 8.1 శాతం చొప్పున తగ్గిపోతుందని ఎస్.బి.ఐ. రీసెర్చ్ అంచనా వేసింది. ఆ సంస్థ ప్రకారం... ఎక్కువగా నష్టపోయే రాష్ట్రాల్లో తెలంగాణది 5వ స్థానం. తలసరి ఆదాయం తెలంగాణలో గత ఏడాది రూ. 2.54 లక్షలు ఉండగా ఈ ఏడాది రూ. 2.25 లక్షలకు తగ్గవచ్చు. ఏపీలో గత ఏడాది రూ. 1.72 లక్షలు ఉన్న తలసరి ఆదాయం ఈ ఏడాది రూ. 1.58 లక్షలకు తగ్గనుంది.
2020-06-23‘కరోనా’ వైరస్ ప్రభావంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతీయుల తలసరి ఆదాయం సుమారు రూ. 9 వేలు తగ్గిపోతుందని ఎస్.బి.ఐ. రీసెర్చ్ తాజా నివేదికలో అంచనా వేసింది. తలసరి ఆదాయంలో తగ్గుదల జీడీపీ తగ్గుదల (-3.8 శాతం) కంటే ఎక్కువగా ఉంటుందని కూడా పేర్కొంది. 2019-20లో తలసరి ఆదాయం రూ. 1.52 లక్షలు ఉండగా 2020-21లో రూ. 1.43 లక్షలకు తగ్గుతుందని అంచనా. ఢిల్లీలో 15.4 శాతం, చండీగఢ్ లో 13.9 శాతం, గుజరాత్ రాష్ట్రంలో 11.6 శాతం చొప్పున తలసరి ఆదాయం తగ్గిపోతుందని, ధనిక రాష్ట్రాల్లోనే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంది.
2020-06-232010, 2013 మధ్య 600సార్లు చైనా సైనికులు చొరబడ్డారంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై బిజెపి అధ్యక్షుడు జె.పి. నడ్డా చేసిన విమర్శకు కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కౌంటర్ ఇచ్చారు. ‘‘అవును, చొరబాట్లు చోటు చేసుకున్నాయి. అయితే, అప్పుడు భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదు. హింసాత్మక ఘర్షణల్లో సైనికులు ప్రాణాలు కోల్పోలేదు’’ అని చిదంబరం మంగళవారం ట్విట్టర్లో స్పష్టం చేశారు. ‘‘2015 నుంచి 2,264 సార్లు జరిగిన చైనా చొరబాట్లపై జెపి నడ్డా ప్రస్తుత ప్రధానిని అడుగుతారా? నేను పందెం వేస్తా.. ఆ ప్రశ్న అడగడానికి సాహసించరు’’ అని చిదంబరం వ్యంగ్యాస్త్రం విసిరారు.
2020-06-23పూరి జగన్నాథ్ రథయాత్ర జరుగుతుండగానే ఆ దేవాలయ సేవకుడు ఒకరిని ‘కరోనా’ కారణంగా ఆసుపత్రికి తరలించారు. పరిమితంగా జగన్నాథ్ రథయాత్ర చేయడానికి సుప్రీంకోర్టు సమ్మతించడంతో మంగళవారం ఆ మత కార్యక్రమాన్ని చేపట్టారు. సుప్రీంకోర్టు సూచనమేరకే సోమవారం 1143 మంది సేవకులకు ‘కరోనా’ పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఒక్కరు మినహా మిగిలిన అందరికీ నెగెటివ్ ఫలితం వచ్చింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి అతనితో సహచరించినవారిని గుర్తిస్తున్నారు. ‘కరోనా’ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినవారినే రథాన్ని లాగడానికి అనుమతించాలని నిర్ణయించారు.
2020-06-23కిరిబాతి.. ఓ చిన్న ద్వీప దేశం. కానీ వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్ర‘దేశం’. పసిఫిక్ మహా సముద్రంలో పట్టు సంపాదించాలంటే ఇలాంటి దేశాల దన్ను కావాల్సిందే! తాజాగా కిరిబాతిలో జరిగిన ఎన్నికల్లో చైనా అనుకూల నేత, ప్రస్తుత అధ్యక్షుడు తనేటి మామౌ మళ్లీ ఎన్నికయ్యారు. ఈ పరిణామంతో ‘తైవాన్’ ఆశలు గల్లంతయ్యాయి. మామౌ ప్రత్యర్ధి గెలిస్తే కిరిబాతితో దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకోవచ్చని తైవాన్ ఆశించింది. చాలా కొద్ది దేశాలు.. అదీ చిన్న దేశాలు తైవాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తించి దౌత్య సంబంధాలు నెరుపుతున్నాయి. కిరిబాతి గత ఏడాది సెప్టెంబరులో తైవాన్ తో సంబంధాలు తెంచుకొని చైనాతో కలసింది.
2020-06-23జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో ఓ సి.ఆర్.పి.ఎఫ్. జవాను, ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. రాజధాని శ్రీనగర్ కు 43 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఉదయం 5.30 గంటలకు భద్రతా దళాలు సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఎదురు కాల్పులు జరిపినప్పుడు ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదులకోసం సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో 30 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 100 మంది ఎన్కౌంటర్లలో మరణించారు.
2020-06-236. ఎల్-1: కంపెనీల్లో ఉన్నత స్థాయి, ప్రత్యేక తరహా ఉద్యోగులకు ఇస్తారు. వీటి కాలపరిమితి ఏడేళ్ళు. 2019లో అమెరికా 76,988 మందికి ఈ వీసాలు జారీ చేసింది. అందులో 18,354 మంది ఇండియన్లు. 7. ఎల్-2: ఎల్-1 వీసాదారులపై ఆధారపడినవారికి ఎల్-2 వీసాలు జారీ చేస్తారు. 2019లో 80,720 ఎల్2 వీసాలు జారీ చేయగా వారిలో 23,169 మంది ఇండియన్లు. గమనిక: హెచ్-1బి, హెచ్-4, ఎల్-1 వీసాలతో వచ్చేవారిని నిషేధించడం వల్ల అత్యధికంగా నష్టపోయేది భారతీయులే. ఏ కేటగిరీలోనూ చైనీయులు పెద్దగా లేరు.
2020-06-233. హెచ్-4: ఈ వీసాలు హెచ్-1బి, హెచ్-2బి వీసాదారుల కుటుంబ సభ్యులకు ఇచ్చేవి. కాలపరిమితి ఆ వీసాల తరహాలో ఉంటుంది. 2019లో 1,25,999 మందికి హెచ్-4 వీసాలు జారీ చేస్తే అందులో 1,06,162 మంది ఇండియన్లు. 4. జె-1: ఈ వీసాలు సాంస్కృతిక, విద్యా రంగాల్లో పరస్పర మార్పిడి కార్యక్రమాల్లో భాగమైనవారికి జారీ చేస్తారు. కాలపరిమితి ఏడేళ్ళు. 2019లో 3,53,279 మందికి జె1 వీసాలు జారీ అయ్యాయి. అందులో ఇండియన్లు తక్కువే. 5. జె-2: ఇవి జె-1 వీసాదారుల కుటుంబ సభ్యులకు ఇస్తారు. అయితే, ఈ వీసాలపై వచ్చేవారు తక్కువే.
2020-06-23