టీవీ9 యాజమాన్య వివాద నేపథ్యంలో నమోదైన ‘‘నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకం’’ కేసులో మాజీ సీఈవో రవిప్రకాష్ సైబరాబాద్ పోలీసుల రెండో నోటీసుకు కూడా స్పందించలేదు. ఒక్క రోజులో విచారణకు హాజరు కావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారంనాడు రవిప్రకాష్ ఇంటి గోడకు నోటీసు అంటించారు. రవిప్రకాష్ కు నోటీసు జారీ చేయడం ఇది రెండోసారి. ఇంతకు ముందు 160 సీఆర్పీసీ కింద రవిప్రకాష్, టీవీ9 సి.ఎఫ్.ఒ. మూర్తి, సినీనటుడు శివాజీలకు నోటీసులు జారీ చేయగా.. మూర్తి మాత్రమే విచారణకు హాజరయ్యారు.
2019-05-13 Read Moreపాకిస్తాన్ లోని ఓడరేపు పట్టణం గ్వాదర్ లో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు మరణించగా... తాము ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు ఆ దేశ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. పెరల్ కాంటినెంటల్ హోటల్ పైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఎ) ఉగ్రవాదులు శనివారం జరిపిన దాడిలో ఒక సెక్యూరిటీ గార్డు సహా నలుగురు హోటల్ సిబ్బంది, ఒక నావికాదళ సైనికుడు మరణించారు. ఇద్దరు ఆర్మీ కేప్టెన్లు, ఇద్దరు నేవీ సైనికులు, మరో ఇద్దరు హోటల్ సిబ్బంది గాయపడ్డారు.
2019-05-12 Read Moreఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ దేశానికి సహాయ ప్యాకేజీ ఇవ్వడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆదివారం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా మూడేళ్ల కాలంలో 6 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 42,000 కోట్లు) పాకిస్తాన్ పొందనుంది. ఒప్పందం కుదిరిన విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని ఆర్థిక సలహాదారు అబ్దుల్ హఫీజ్ షేక్ వెల్లడించారు. అధికార స్థాయిలో కుదిరిన ఈ ఒప్పందానికి వాషింగ్టన్ లోని ఐఎంఎఫ్ బోర్డు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ప్రపంచబ్యాంకు, ఎడిబిలనుంచి మరో 2-3 బిలియన్ డాలర్ల సాయం అందుతుందని హఫీజ్ చెప్పారు.
2019-05-12 Read Moreమధ్య అమెరికాలోని పనామాలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదైంది. పనామా తీర ప్రాంతంలోని డేవిడ్ నగరానికి 48 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నట్టు సమాచారం. భూ ఉపరితలానికి 37.3 కిలోమీటర్ల లోతున భూమి కంపించినట్టు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ (యు.ఎస్.జి.ఎస్) తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 7:25 గంటలకు భూకంపం సంభవించింది.
2019-05-13 Read Moreముంబై ఇండియన్స్ టీమ్ ఐపిఎల్ 10వ సీజన్ విజేతగా నిలిచింది. ఆదివారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపైన కేవలం ఒక్క పరుగు తేడాతో ముంబై టీమ్ గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేయగా ఛేజింగ్ లో ముంబై జట్టు 8 వికెట్లకు 149 పరుగులు సాధించింది. ముంబై ఇండియన్స్ కు ఇది నాలుగో టైటిల్. దీంతో... ఐపిఎల్ ప్రారంభమయ్యాక అత్యధిక విజయాలను నమోదు చేసిన జట్టుగా రికార్డు సాధించింది. చెన్నై జట్టు గతంలో మూడుసార్లు ఐపిల్ విజేతగా నిలిచింది.
2019-05-12ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫైనల్ లో ముంబై ఇండియన్స్ జట్టు 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఐపిఎల్ టైటిల్ దక్కించుకోవాలంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో దాదాపు 7.5 రన్ రేటును సాధించాల్సి ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతోంది. ఇంతకు ముందు జరిగిన 9 ఐపిఎల్ సీజన్లలో ఈ రెండు జట్లు మూడేసి సార్లు గెలిచాయి. నాలుగోసారి గెలిచే జట్టు ఏదన్న విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
2019-05-12 Read Moreవిదేశీ సంస్థాగత పెట్టబడి (ఎఫ్.పి.ఐ) ఇండియా మార్కెట్ నుంచి నిష్క్రమిస్తోంది. మే 2వ తేదీనుంచి 10వ తేదీవరకు గడచిన కొద్ది రోజుల్లో రూ. 3,207 కోట్ల ఎఫ్.పి.ఐ. మొత్తం నికరంగా దేశం వదిలి వెళ్లింది. ఈ రోజుల్లో కేవలం రూ. 1,344.72 కోట్ల మొత్తం దేశంలోకి రాగా రూ. 4,552.20 కోట్ల మొత్తం బయటకు వెళ్లింది. అంతకు ముందు ఏప్రిల్ మాసంలో రూ. 16,093 కోట్లు, మార్చిలో ఏకంగా రూ. 45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 11,182 కోట్లు దేశంలోకి వచ్చింది. మే నెలలో తిరోగమనానికి అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం, ఎన్నికల ఫలితాలపై అస్థిరత్వం ఈ పరిస్థితికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు.
2019-05-12 Read Moreలోక్ సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ 59 స్థానాలకు ఆదివారం జరిగింది. ఆయా స్థానాల్లో 10.17 కోట్ల అర్హులైన ఓటర్లకు గాను.. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 63.3 శాతం మంది ఓట్లు వేశారు. ఉత్తరప్రదేశ్ (14 సీట్లు), హర్యానా (10), బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ (8 చొప్పున), ఢిల్లీ (7), జార్ఖండ్ (4 సీట్లు) రాష్ట్రాల్లో ఆదివారం పోలింగ్ జరిగింది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యుపిఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఢిల్లీలో ఓట్లు వేశారు.
2019-05-12 Read Moreపాకిస్తాన్ లోని గ్వాదర్ వద్ద పెరల్ కాంటినెంటల్ హోటల్ లో దాడి చేసింది తామేనని వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఎ) ప్రకటించింది. ఆ హోటల్ లో బస చేస్తున్న చైనా పెట్టుబడిదారులు, ఇతర విదేశీ పెట్టుబడిదారులే తమ లక్ష్యమని ఆ సంస్థ స్పష్టం చేసింది. తీవ్రవాదుల కాల్పుల్లో ఒకరు చనిపోయినట్టు పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా బలూచిస్తాన్లో పెద్ద మొత్తంలో మౌలిక సదుపాయల ప్రాజెక్టులను చేపట్టారు. చైనా ‘‘బెల్ట్ అండ్ రోడ్’’ ప్రాజెక్టులకు కీలకమైనందునే గ్వాదర్ పోర్టు పట్టణంపై బిఎల్ఎ కన్నేసింది.
2019-05-11 Read Moreఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిషా, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్క లోక్ సభ సీటు కూడా రాదని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ అంచనా వేశారు. గత ఐదు విడతల ఎన్నికల్లో బీజేపీ బాగా నష్టపోతున్నందునే ఆ పార్టీ నేతలు బెంగాల్ పైన దృష్టి సారించారని పేర్కొన్నారు. శనివారం తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధి నుస్రత్ జహాన్ తరపున ప్రచార సభలో పాల్గొన్న మమత... ‘‘బీజేపీకి సంఖ్యాబలం ఎక్కడినుంచి వస్తుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీట్లు 73 నుంచి 13 లేదా 17కు తగ్గుతాయి. 7 రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా రాదు’’ అని మమత ఉద్ఘాటించారు.
2019-05-11 Read More