ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలు చదువుకోవచ్చని, పని చేయవచ్చని తాలిబన్లు పేర్కొన్నారు. అయితే, మహిళల హక్కులు షరియా చట్టానికి లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. తాలిబన్ల ప్రధాన అధికార ప్రతినిధి జబుహుల్లా ముజాహిద్ మంగళవారం తొలి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళలు ఇంతకు ముందులా మీడియాలో పనిచేయవచ్చా? అన్న విలేకరుల ప్రశ్నకు, ఆ విషయం ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తీసుకోబోయే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని బదులిచ్చారు. ఇలాంటి మరికొన్ని అంశాలపై కొద్దిగా వేచి చూడాలని చెప్పారు.
2021-08-17ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం దేశమేనని, ఇస్లామిక్ చట్టాలే అమలవుతాయని దేశాన్ని అదుపులోకి తీసుకున్న తాలిబన్లు స్పష్టం చేశారు. అయితే, తాము (తాలిబన్) 20 ఏళ్ళ క్రితంలా లేమని, కొన్ని విషయాల్లో మార్పును చూస్తారని అభయమిచ్చారు. మంగళవారం తాలిబన్ల తొలి పత్రికా సమావేశంలో ఆ సంస్థ అధికార ప్రతినిధి జబుహుల్లా ముజాహిద్ మాట్లాడారు. 20 ఏళ్ళ ఆక్రమణ నుంచి ‘విముక్తి’ పొందినందుకు ఆఫ్ఘన్ ప్రజలను ఆయన అభినందించారు. ‘స్వేచ్ఛ, స్వాతంత్రం’ ప్రతి జాతికీ న్యాయబద్ధమైన హక్కు అని ముజాహిద్ ఉద్ఘాటించారు.
2021-08-17తాలిబన్ల భయానికి విమానంపైన వేలాడుతూ అయినా దేశం దాటుదామనుకున్న ఇద్దరు ఆప్ఘన్లు దారుణ మరణానికి గురయ్యారు. అమెరికా సైనిక రవాణా విమానం టైర్లను పట్టుకొని వేలాడిన ఇద్దరు... ఆ విమానం గాల్లోకి లేచాక పట్టుతప్పి పడిపోయారు. ఈ హృదయ విదారక దృశ్యం వీడియోలో రికార్డయింది. అంతకు ముందు కాబూల్ విమానాశ్రయంలో వేలాది మంది విమానం చుట్టూ చేరి ఎలాగైనా చోటు సంపాదించాలని చేసిన ప్రయత్నం తాలిబన్ల భయాన్ని కళ్ళకు కట్టింది. ఆఫ్ఘన్ అధ్యక్షుడు దేశం వదిలి పారిపోగా... తాలిబన్లు కాబూల్ ను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.
2021-08-16స్వతంత్ర భారతం 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ ఎర్రకోటపై నుంచి 8వ సారి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాత హామీనే కొత్తగా ప్రస్తావించారు. కాకపోతే దానికొక కొత్తపేరు పెట్టారు. రూ. 100 లక్షల కోట్ల నిధితో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని గత రెండేళ్ళుగా మోదీ, ఆయన మంత్రివర్గ సభ్యులు చెబుతూనే ఉన్నారు. 2019, 2020 ఆగస్టు 15 ప్రసంగాల్లోనూ ఇది ప్రధానాంశంగా ఉంది. గత ఏడాది ‘నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్’ అన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని ‘పిఎం గతి శక్తి’ అనే భారీ పథకంగా చెప్పారు.
2021-08-15అనూహ్యమైన వేగంతో ఆప్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు, ఆదివారం రాజధాని కాబూల్ ను చుట్టుముట్టారు. తాజాగా ఆ దేశ అధ్యక్షుడి భవనాన్ని అదుపులోకి తెచ్చుకున్నట్టు ప్రకటించారు. అందుకు కొద్ది గంటల ముందే ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని దేశం వదిలిపోయారు. ఆయన తజికిస్తాన్ వెళ్లినట్టు ఓ ప్రభుత్వ ప్రతినిధి అనధికారికంగా చెప్పారు. కాగా, ఘని ఎక్కడున్నారో విచారిస్తున్నామని తాలిబన్ ప్రతినిధి చెప్పారు. ప్రభుత్వ రక్షక దళాల్లో అధిక భాగం కాబూల్ చుట్టూనే మోహరించినా, పెద్దగా ప్రతిఘటన లేకుండానే రాజధాని తాలిబన్ల వశమవుతోంది.
2021-08-15ఆగస్టు 14ను ఇక నుంచి ‘విభజన ఘోరాల జ్ఞాపక దినం’గా పాటించనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. 1947లో దేశ విభజన సందర్భంగా భారతీయులు అనుభవించిన బాధను గుర్తించడానికే ఈ కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. విభజన గాయాలను ఎప్పటికీ మరచిపోలేమని, మన లక్షలాది సోదర సోదరీమణులు నిరాశ్రయులయ్యారని, బుద్ధిహీన ద్వేషం-హింస కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారని మోదీ ట్వీట్ చేశారు. భారతదేశం రెండుగా విడిపోయిన రోజు ‘‘సామాజిక విభజనల విషాన్ని తొలగించాల్సిన’’ అవసరాన్ని గుర్తు చేస్తోందని పేర్కొన్నారు.
2021-08-14టోక్యో పారాలింపిక్ క్రీడల కోసం 9 క్రీడాంశాల్లో ఎంపిక చేసిన 54 మందితో భారత బృందం బయలుదేరింది. ఇప్పటివరకు పారాలింపిక్స్ కు వెళ్లిన భారత బృందాల్లో ఇదే అతి పెద్దది. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం వర్చువల్ సమావేశం ద్వారా వారికి వీడ్కోలు పలికారు. ఇండియా కోసం ఆడేటప్పుడు 130 కోట్ల ప్రజల ప్రోత్సాహం ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలని ఠాకూర్ క్రీడాకారులకు చెప్పారు. టూరిజం, సాంస్కృతిక శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి, సహాయ మంత్రి మీనాక్షి లేఖి కూడా శుభాకాంక్షలు తెలిపారు.
2021-08-12టోక్యో ఒలింపిక్స్ ముగియడానికి ఒక్క రోజు ముందు ఎట్టకేలకు ఇండియా ఒక బంగారు పతకాన్ని ముద్దాడింది. జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా ఈ విభాగంలో ఇండియాకు ఏకైక బంగారు పతకాన్ని అందించాడు. 2008 తర్వాత మళ్లీ ఇండియా బంగారు పతకం సాధించడం ఇప్పుడే. ఇప్పటిదాకా వ్యక్తిగత విభాగాల్లో ఇది కేవలం రెండో బంగారు పతకం కాగా, అథ్లెటిక్స్ లో గత వందేళ్లలో ఇదే మొదటిది. దీంతో కలిపి ఈ ఒలింపిక్స్ లో 7 పతకాలు వచ్చాయి. భారత ఒలింపిక్స్ చరిత్రలో ఇదే అత్యధిక సంఖ్య కావడం గమనార్హం. 2012 లండన్ ఒలింపిక్స్ లో ఆరు పతకాలు వచ్చాయి.
2021-08-07ఒలింపిక్స్ పతకాల పట్టికలో ఇప్పటిదాకా తొలి స్థానంలో ఉన్న చైనా చివరి రోజున వెనుకబడింది. చివరి రోజు సాధించిన స్వర్ణాలతో అమెరికా తొలి స్థానంలోకి రాగా చైనా, జపాన్, బ్రిటన్, కొరియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ తర్వాత స్థానాల్లో నిలిచాయి. 39 బంగారు పతకాలు, 41 రజత, 33 కాంశ్య పతకాలు సాధించిన అమెరికా ప్రాధాన్య క్రమంలోనూ, మొత్తం పతకాల సంఖ్య (113)లోనూ అగ్ర స్థానంలో నిలిచింది. ఒక దశలో స్వర్ణాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని చూపిన చైనా చివరి రోజుల్లో వెనుకబడి 38 స్వర్ణాలు, 32 రజతాలు, 18 కాంశ్యాలతో రెండో స్థానాన్ని సాధించింది.
2021-08-08ఐటి చట్టంలోని సెక్షన్ ‘66ఎ’ని కొట్టివేశాక కూడా ఆరేళ్ళుగా కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, హైకోర్టుల రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసింది. పోలీసులు రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి, రాష్ట్రాలను కూడా పార్టీలుగా చేర్చాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి సూచించింది. ఇందులో ఒక అంశం పోలీసులు కాగా మరొకటి న్యాయవ్యవస్థ అని న్యాయవాది పేర్కొనగా ‘‘న్యాయవ్యవస్థ సంగతి విడిగా చూసుకుంటాం. ఇక్కడ పోలీసులూ ఉన్నారు. ఒక సరైన ఉత్తర్వు ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఇది కొనసాగకూడదు’’ అని ధర్మాసనం ఉద్ఘాటించింది.
2021-08-02