గ్యాస్ లీకేజీ ఘటన తర్వాత ‘ఎల్.జి. పాలిమర్స్’పై మొరటుగా చర్య తీసుకొని ఉంటే పారిశ్రామికవేత్తలు భయపడేవారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ‘మన పాలన- మీ సూచన’లో భాగంగా సిఎం గురువారం పారిశ్రామికవేత్తలతో చర్చించారు. ఓవైపు పరిశ్రమలకు నమ్మకం ఇస్తూ.. మరోవైపు తన బాధ్యతనూ నెరవేర్చవలసి ఉందని పేర్కొన్నారు. ఆరెంజ్, రెడ్ కేటగిరిలలోని పరిశ్రమలు ప్రజలు ఎక్కువగా నివశించే ప్రాంతాల్లో రాకూడదని, అందుకోసం పొల్యూషన్ కంట్రోల్ చట్టాన్ని మారుస్తున్నామని జగన్ చెప్పారు.
2020-05-28ఇండియాలో ‘లాక్ డౌన్’ లక్ష్యమూ, ఉద్ధేశమూ నెరవేరలేదని.. విఫలమైనట్టు స్పష్టంగా కనిపిస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నాలుగు దశల ‘లాక్ డౌన్’ ప్రధాని ఆశించిన ఫలితాలను ఇవ్వలేదన్న రాహుల్.. కరోనా వైరస్ పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక ఏమిటని ప్రశ్నించారు. పేదలకు, రాష్ట్రాలకు నేరుగా నిధులు ఇవ్వాలని రాహుల్ మరోసారి డిమాండ్ చేశారు. కరోనా వైరస్ అసాధారణంగా పెరుగుతున్న దశలో ‘లాక్ డౌన్’ ఎత్తివేస్తున్న ఏకైక దేశం ఇండియానేనని రాహుల్ వ్యాఖ్యానించారు.
2020-05-26ఇండియాలో ‘కరోనా’ కొత్త కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆదివారం ఒకే రోజు 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం వైరస్ సోకినవారి సంఖ్య 1,38,536కు పెరిగింది. వారిలో 4,024 మంది మరణించారు. ‘కరోనా’ బాధితుల సంఖ్యలో ఇండియా ఇప్పుడు ఇరాన్ దేశాన్ని మించిపోయింది. ఇండియా 10వ స్థానానికి చేరుకోగా చైనా 14వ స్థానానికి తగ్గింది. కెనడా చైనాను దాటేసింది. రష్యాను దాటిన బ్రెజిల్ ఇప్పుడు 2వ స్థానంలో నిలిచింది. 16,42,021 ‘కరోనా’ కేసులతో అమెరికా అధ్వాన స్థితిలో ఉండగా 3,63,211 కేసులతో బ్రెజిల్.. 3,44,481 కేసులతో రష్యా.. 2,60,916 కేసులతో యు.కె... 2,35,772 కేసులతో స్పెయిన్.. 2,29,858 కేసులతో ఇటలీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
2020-05-25ఓ సంక్షోభ సమయం మనుషుల్లో మంచినీ, మనో వైకల్యాలనూ బయటపెడుతుందని అంటారు. దేశ రాజధాని ఢిల్లీలో కొంతమంది ఓ తోపుడు బండిపై మామిడి పండ్లను లూటీ చేసిన తీరు వికృత పోకడలకు దర్పణం పట్టింది. ఢిల్లీలోని జగత్ పురి ప్రాంతంలో ‘లాక్ డౌన్’ సమయంలో ఛోటే అనే చిరు వ్యాపారి ఈ దోపిడీకి గురయ్యారు. దగ్గర్లోని పాఠశాలవద్ద ఘర్షణ జరిగిందని, తన బండిని అక్కడినుంచి తీసేయాలని కొంతమంది చెప్పారని ఛోటే తెలిపాడు. ఈ నేపథ్యంలో అతను బండివద్ద లేకపోవడం గమనించిన జనం మామిడిపండ్లపై పడ్డారు. రూ. 30,000 విలువైన మామిడిపండ్లు మొత్తం పోయాయని ఛోటే చెప్పాడు. ‘లాక్ డౌన్’తో తన వ్యాపారం దెబ్బతినగా ఈ దోపిడీతో వెన్నెముక విరిగిందని అతను ఆవేదన వ్యక్
2020-05-22పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పిఐఎ)కి చెందిన ఓ విమానం శుక్రవారం మధ్యాహ్నం కరాచీ ఎయిర్ పోర్టు సమీపంలో కూలిపోయింది. అందులో 90 మంది ప్రయాణీకులు, 8 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. వారి పరిస్థితి ఏమిటన్నది వెంటనే తెలియరాలేదు. పికె 8303 లాహోర్ నుంచి వచ్చింది. కరాచీ ఎయిర్ పోర్టులో దిగే సమయంలో జిన్నా గార్డెన్ ప్రాంతంలో ప్రమాద వశాత్తు కూలిపోయింది. ఆ ప్రాంతంలో కొన్ని భవనాలు కూడా దెబ్బ తిన్నాయి. ఆర్మీ క్విక్ రియాక్షన్ ఫోర్స్, సింధ్ పాకిస్తాన్ రేంజర్స్ వెంటనే ఆ స్థలానికి చేరుకొని సహాయ కార్యకలాపాలు చేపట్టారు.
2020-05-222020-21 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గత ఏడాది కంటే తగ్గుతుందని ఇప్పటికే అనేక సంస్థలు అంచనా వేశాయి. ఇప్పుడు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) కూడా అదే మాట చెప్పింది. శుక్రవారం రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించారు. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు తిరోగమన దశలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇండియాలో డిమాండ్ కుప్పకూలిందని, ‘కరోనా’ కారణంగా ప్రైవేటు వినిమయం, పెట్టుబడి డిమాండ్ పడిపోయాయని, ప్రభుత్వ రెవెన్యూ భారీగా తగ్గిందని దాస్ పేర్కొన్నారు. అయితే, ఇటీవల తీసుకున్న ద్రవ్య, ఆర్థిక, పరిపాలనా చర్యలతో పరిస్థితి మెరుగుపడుతుందని దాస్ ఆశాభావం వ్యక్తం చేశ
2020-05-22సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను విధుల్లోకి తీసుకోవాలని, సస్పెన్సన్ కాలానికీ జీతభత్యాలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా పని చేసిన ఏబీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఆయనకు సుమారు 8 నెలలపాటు పోస్టింగ్ ఇవ్వలేదు. తర్వాత సస్పెండ్ చేశారు. ఇజ్రాయిల్ కంపెనీ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని, సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని ఏబీపై అభియోగాలు మోపారు.
2020-05-22వాయిదా పడిన పదో తరగతి పరీక్షలను జూన్ 8 నుంచి నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం షెడ్యూలు ప్రకటించింది. జూన్ 8న ఆంగ్లం మొదటి పేపర్, జూన్ 11న ఆంగ్లం రెండో పేపర్, జూన్ 14న గణితం మొదటి పేపర్, 17న రెండో పేపర్, జూన్ 20న సైన్స్ మొదటి పేపర్ (భౌతికశాస్త్రం), 23న రెండో పేపర్ (జీవశాస్త్రం), జూన్ 26న సోషల్ స్టడీస్ మొదటి పేపర్, 29న రెండో పేపర్ పరీక్షలు ఉంటాయి. జూన్ 2న ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ మొదటి పేపర్ (సంస్కృతం, అరబిక్), జూలై 5న ఒకేషనల్ కోర్సు (థియరీ) పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు, పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉండేలా షెడ్యూలు రూపొందించారు. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
2020-05-22‘కరోనా’ నుంచి రక్షణకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్95 మాస్కులు కూడా ఇవ్వలేదని విమర్శించి సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ పైన పోలీసుల దాష్ఠీకం సీబీఐ పరిధిలోకి వెళ్లింది. సంబంధిత పోలీసులపై కేసు నమోదు చేయాలని, దర్యాప్తు చేపట్టి 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఏపీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ నెల 16న విశాఖపట్నంలో నిరసన తెలిపిన సుధాకర్ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. తమను, ముఖ్యమంత్రిని ధూషించారంటూ డాక్టర్ ను కొట్టి కేసు పెట్టి మానసిక వైద్యశాలకు పంపించారు. దీనిపైన తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత లేఖ రాయగా.. హైకోర్టు విచారణ చేపట్టింది. విశాఖ జిల్లా జడ్జి ద్వారా సుధాకర్ వాంగ్మూలం తెప్పించుకుంద
2020-05-22మే 16నాటికి ఇండియాలో కొత్త ‘కరోనా’ కేసులు ఉండవని ‘లాక్ డౌన్’ విధించాక ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. కొత్త కేసులు ‘సున్నా’ కావటం మాట అంటుంచి.. ఇప్పుడు రోజూ ఐదు వేలకు పైగా నమోదవుతున్నాయి. పైగా రోజురోజుకూ పెరుగుతుండటం ఆదోళన కలిగిస్తోంది. మంగళవారం ఏకంగా 5,611 మంది ‘కరోనా’ బాధితుల జాబితాలో అధికారికంగా చేరారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,750కి పెరిగింది. నిన్నటికి 3,303 మంది మరణించారు. తగ్గుతాయనుకున్న కేసులు పెరగడంతో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రెస్ మీట్లు పెట్టడం కూడా మానేసింది.
2020-05-20