ఏప్రిల్ 15 తర్వాత కూడా ‘లాక్ డౌన్’ పొడిగించాలని తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విన్నవించారు. ఈ విషయంలో సంకోచించవద్దని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ‘‘ఆర్థిక సమస్య నుంచి బయటపడొచ్చు. కానీ, ప్రాణాలు పోతే రికవర్ చేయలేం. మనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం లాక్ డౌన్. కరోనాను ఎదుర్కోవడానికి మనకు మరో ఆయుధమే లేదు. నా అవగాహన, అనుభవంలో ఇదే తేలింది’’ అని కేసీఆర్ ఉద్ఘాటించారు.
2020-04-06దీపాలు వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును విమర్శించినవారు కుసంస్కారులు, దుర్మార్గులు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి పిలుపులు వంద ఇచ్చామని, జేగంటలు మోగిస్తే తెలంగాణ వస్తదా.. అని ప్రశ్నించారని, వాటి ద్వారానే తెలంగాణ వచ్చిందని చెప్పారు. ప్రధానమంత్రి ఓ వ్యక్తి కాదని, ఓ వ్యవస్థ అని, ఆయన పిలుపుపై వ్యాఖ్యానాలు చేయడం వెకిలితనమని సోమవారం విలేకరుల సమావేశంలో కేసీఆర్ విమర్శించారు.
2020-04-06కరోనా వైరస్ కారణంగా దేశంలో 111 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది. ప్రభుత్వ లెక్క ప్రకారం ఇప్పటికి వైరస్ సోకినవారి సంఖ్య 4,281. అంతకు ముందు కొద్దిసేపటి క్రితం 4067 కేసులు నమోదైనట్టు వెల్లడించగా వాటిలో తబ్లిఘి జమాత్ కార్యక్రమాల్లో పాల్గొన్నవారివే 1445 (33.75 శాతం). ఆదివారం ఒక్క రోజే ఇండియాలో 693 ‘కరోనా’ కేసులు నమోదు కాగా 30 మంది మరణించారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం ఇండియాలో 4,314 మందికి ‘కరోనా’ సోకగా 118 మంది మరణించారు.
2020-04-06కర్నూలు జిల్లాలో శనివారం వరకు కేవలం 4 ‘కరోనా’ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఆదివారం ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకే రోజు 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తంలో ‘కరోనా’ కేసులు ఆదివారం 258కి పెరిగాయి. కర్నూలు తర్వాత నెల్లూరులో 34, గుంటూరులో 30, క్రిష్ణా జిల్లాలో 28, కడపలో 23, ప్రకాశంలో 23, చిత్తూరులో 17, విశాఖపట్నంలో 15, పశ్చిమ గోదావరిలో 15, తూర్పు గోదావరిలో 11, అనంతపురంలో 6 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. క్రిష్ణా జిల్లాలో 32 మందికి వైరస్ సోకినట్టు శనివారం పేర్కొన్న ప్రభుత్వం, ఆదివారం ఆ సంఖ్యను 28కి తగ్గించింది.
2020-04-05ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 12,70,069 మందికి సోకిన కరోనా వైరస్.. తొలిసారి ఓ పులికి సంక్రమించింది. అమెరికాలోని న్యూయార్క్ బ్రాంగ్జ్ జూ పార్కులో నాలుగేళ్ల ఆడ మలయన్ పులి ‘నాడియా’కి ‘కరోనా’ పాజిటివ్ తేలింది. లోవా లోని జాతీయ వెటర్నరీ సర్వీసెస్ లేబొరేటరీలో పరీక్షలు నిర్వహించి పులికి వైరస్ సోకినట్టు నిర్ధారించారు. నాదియా, దాని సోదరి అజుల్, మరో రెండు పులులు, మూడు ఆఫ్రికా సింహాలకు పొడి దగ్గు వస్తోంది. జూ కీపర్ ద్వారా పులులకు ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. జంతువులన్నీ బాగానే ఉన్నాయని సమాచారం. అమెరికా, అందులో న్యూయార్క్ నగరం ‘కరోనా’ మరణ మృదంగంతో అల్లాడుతున్నాయి.
2020-04-06 Read Moreఆదివారం రాత్రి కొద్దిసేపు దేశమంతటా ఇళ్ళలో విద్యుద్దీపాలు ఆపేసిన ఫలితంగా డిమాండ్ 32,000 మెగావాట్లు తగ్గినట్టు కేంద్ర ఇంథన శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ చెప్పారు. విద్యుత్ డిమాండ్ రాత్రి 8:49 గంటల నుంచి 9.09 వరకు..1,17,300 మెగావాట్ల నుంచి 85,300 మెగావాట్లకు తగ్గిపోయిందని ఆయన వెల్లడించారు. అంటే మొత్తం డిమాండులో 27.28 శాతం తగ్గింది. ఆ సమయంలో గ్రిడ్ ఫ్రీక్వెన్సీ 49.7 నుంచి 50.26 వరకు ఉందని మంత్రి వివరించారు.
2020-04-05‘కరోనా’ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది. శనివారం ఒక్క రోజే కొత్తగా లక్షమందికి వైరస్ నిర్ధారణ అయింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11.30కి ‘కరోనా’ కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది (మొత్తం 12,03,485). నిన్ననే కేసుల సంఖ్య 11 లక్షలు దాటింది. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ.. సగటున లక్షకు పైగా నమోదవుతున్నాయి. వైరస్ సోకినవారిలో 64,784 మంది (5.38 శాతం) మరణించారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారిన పడిన ప్రజల్లో 25.93 శాతం (3,12,146) అమెరికన్లు కాగా.. మృతులలో 23.71 శాతం ఇటాలియన్లు. ఇటలీలో మరణాల రేటు 12.32 శాతం కాగా, స్పెయిన్ దేశంలో 9.47 శాతంగా ఉంది. మరణాల్లో అమెరికా మూడో స్థానంలో ఉంది.
2020-04-05ఇండియాలో ‘కరోనా’ కేసుల సంఖ్య తక్కువగానే కనిపిస్తున్నా.. భౌగోళికంగా వ్యాప్తి వేగవంతంగానే ఉంది. దేశంలోని 720 జిల్లాలకుగాను.. మూడో వంతుకు పైగా జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. మరింతగా వ్యాపించే ప్రమాదమూ ఎక్కువగానే కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో మెజారిటీ జిల్లాల్లో కేసులు నమోదు కాగా, మరికొన్ని రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లోనే ఎక్కువ కేసులు కేంద్రీకృతమయ్యాయి. దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదైన మహారాష్ట్రలో సగం పైగా జిల్లాలకు వైరస్ వ్యాపించింది. కేసుల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న తమిళనాట 65 శాతం జిల్లాలకు... 3,4 స్థానాల్లో ఉన్న ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకూ వ్యాపించింది.
2020-04-05అగ్రరాజ్యం అమెరికా ‘కరోనా’ కేసుల్లోనూ సింహభాగాన్ని నమోదు చేసింది. ఈ మహమ్మారి వైరస్ సోకిన అమెరికన్ల సంఖ్య శనివారం 3 లక్షలు దాటింది (3,00,915). ప్రపంచ వ్యాప్తంగా ‘కరోనా’ సోకిన ప్రతి నలుగురిలో ఒకరు అమెరికన్ (25.46 శాతం) కావడం గమనార్హం. ‘కరోనా’ కాటుకు అమెరికాలో ఇప్పటిదాకా 8,162 మంది బలయ్యారు. కొత్త కేసుల సంఖ్య రోజుకు 30 వేలకు పైగా నమోదవుతుంటే.. శనివారం ఒక్క రోజే 1200 మరణాలు సంభవించాయి. న్యూయార్క్ నగరంలోనే ఇప్పటిదాకా 63,306 కేసులు నమోదు కాగా 1905 మంది మరణించారు. న్యూయార్క్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మరో 1,202 మంది ‘కరోనా’ కాటుకు బలయ్యారు.
2020-04-05మధ్యప్రదేశ్ ప్రజారోగ్య- కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పల్లవి జైన్ గోవిల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. సీనియర్ ఐఎఎస్ అధికారి అయిన ఆమెతో పాటు ఆరోగ్య శాఖలోనే సమాచార విభాగంలో అదనపు డైరెక్టరుగా పని చేస్తున్న డాక్టర్ వీణా సిన్హాకు కూడా ‘కరోనా’ సోకింది. వీరిద్దరికీ వైరస్ సోకినట్టు శనివారం నిర్ధారణ అయింది. ఇంతకు ముందే ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మరో ఐఎఎస్ అధికారి జె. విజయకుమార్ కు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరికి తోడు వీరేంద్ర చౌధరి అనే మరో ఆరోగ్య శాఖ అధికారి కూడా వైరస్ బారిన పడ్డారు. వైరస్ సోకిన వ్యక్తులకు దగ్గరగా ఉన్న కారణంగా.. మధ్యప్రదేశ్ లో 15 మంది ఐఎఎస్ లు ‘స్వీయ నిర్బంధం’లోకి వెళ్ల
2020-04-04