భారత దేశ మహిళలలో లేబర్ పార్టిసిపేషన్ రేటు 2018లో 26 శాతానికి పడిపోయింది. 2005లో ఈ రేటు 36.7 శాతంగా ఉండేది. డెలాయిటీ సంస్థ విడుదల చేసిన ఓ రిపోర్టు ఈ చేదు నిజాన్ని బయటపెట్టింది. నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడం, సామాజిక, ఆర్థిక అవరోధాలు... మహిళలకు అవకాశాలను పరిమితం చేస్తున్నాయని డెలాయిటీ విశ్లేషించింది. పని చేస్తున్న మహిళలే తక్కువైతే.. అందులో 95 శాతం (19.5 కోట్ల మంది) అసంఘటిత రంగంలోనో లేక వేతనం లేని పనిలోనో ఉన్నారని డెలాయిటీ నివేదిక పేర్కొంది.
2019-03-08 Read Moreకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘దొందూ దొందే’నని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. తారక రామారావు (కేటీఆర్) వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 సీట్లు గెలిస్తే ప్రధాని ఎంపికలో కీలక పాత్ర పోషించి తెలంగాణకు కావలసినవి తెస్తామని చెప్పారు. ‘బడితె ఉన్నోడిదే బర్రె. మోదీ ప్రధానమంత్రిగా ఉండి బుల్లెట్ రైలు ఢిల్లీ నుంచి గుజరాత్ మీదుగా ముంబైకి వేస్తాడు. లాలూ రైల్వే మంత్రిగా ఉంటే ఆయన ఇంటిదాకా రైలు వేసుకుంటాడు. టిఆర్ బాలు కేంద్ర మంత్రిగా ఉంటే తమిళనాడుకు జాతీయ రహదారులు వస్తాయి’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
2019-03-06రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్ష కోరుతున్నవారి పిటిషన్, హిందూ పత్రిక రాసిన కథనాలకు చోరీకి గురైన పత్రాలే ఆధారమని కేంద్రం ఆరోపించింది. రాఫేల్ ఒప్పందంపై ఇంతకు ముందు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఉమ్మడి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
2019-03-06 Read Moreతెలంగాణ ప్రభుత్వం తమకు రూ. 5000 కోట్ల మేరకు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని, అవి ఇవ్వడంలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రతిపక్ష నేత జగన్‌ను అడ్డుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌పై పెత్తనం చేయడానికి దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ‘‘బకాయిలు చెల్లించదు. ఉమ్మడి ఆస్తులను విభజించదు. పైగా మన కష్టమేదో మనం పడుతుంటే కావాలని కుట్రలు చేస్తోంది’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
2019-03-06వైఎస్ జగన్ ఆహ్వానిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ తరపున ప్రచారం చేస్తానని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవసీ చెప్పారు. ఎంఐఎం కార్యాలయం ‘దారుస్సలాం’లో ఆ పార్టీ 61వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒవైసీ మాట్లాడారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్, వైసీపీ 35 సీట్లు సాధించే అవకాశాలున్నాయని ఒవైసీ అంచనా వేశారు. అణ్వాయుధాల విషయం మాట్లాడుతున్న ఇమ్రాన్ ఖాన్, ఇండియా వద్ద కూడా అవి ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
2019-03-02 Read Moreనరేంద్ర మోదీ ‘మహానాయకుడు’ సినిమా చూస్తే చంద్రబాబు అంటే ఏంటో తెలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రంలో మోదీ ఈడీ, సీబీఐలను.. హైదరాబాదులో కేసీఆర్ పోలీసులను ఆంధ్రులపైకి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ‘ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్రానికి వస్తానంటున్నాడు. రమ్మంటున్నా! మోదీ, అసదుద్దీన్, జగన్, కేసీఆర్ కలసి ఈ రాష్ట్రంలో మైనారిటీలకు అన్యాయం చేస్తున్నారు. నా ప్రజలకు ఇబ్బంది వస్తే వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నా’ అని చంద్రబాబు చెప్పారు.
2019-03-02ఐఎఎఫ్ పైలట్ అభినందన్ అప్పగింతకు ముందు ఆయన వీడియో స్టేట్ మెంట్ రికార్డు చేయడమే ఆలస్యానికి కారణమని తెలిసింది. 27వ తేదీన ఒక టార్గెట్ ను కనిపెట్టడానికి తాను పాకిస్తాన్ గగనతలంలోకి వచ్చానని, అప్పుడే పిఎఎఫ్ తన విమానాన్ని కూల్చిందని అభినందన్ పాకిస్తాన్ అధికారులు రికార్డు చేసిన చివరి వీడియోలో చెప్పారు. ఇండియా వాదనకు ఇది భిన్నంగా ఉంది. మన మిలిటరీ స్థావరాలపై పాకిస్తాన్ యుద్ద విమానాల దాడిని నిరోధించే సమయంలో అభినందన్ విమానం (మిగ్ 21) కూలిపోయిందని, పారాచ్యూట్ తో దిగే ప్రయత్నంలో ఆయన పిఒకె వైపు వెళ్లారని ఇండియా చెబుతోంది.
2019-03-02 Read Moreప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ భద్రత కంటే రాజకీయ భద్రతే ముఖ్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అభినందన్ ఇండియాకు వస్తుంటే స్వాగతం పలకడం ప్రధానికి ముఖ్యం కాదని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ గాయాలపై కారం చల్లడానికి వచ్చారని దుయ్యబట్టారు. శనివారం ఉదయం పార్టీ శ్రేణులతో ఎన్నికలపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ‘రాజకీయ లబ్దికోసం దేనికైనా దిగజారే పార్టీ బీజేపీ. మోదీ విఫల ప్రధాని. గతంలో ఏ ప్రధానమంత్రికీ ఇన్ని నల్లజెండాలు ఎదురు కాలేదు’ అని చెప్పారు.
2019-03-02ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ (29) ఆచూకీ చెప్పినవారికి మిలియన్ డాలర్లు బహుమానం ఇస్తామని అమెరికా ప్రకటించిన రోజే ఐరాస భద్రతా మండలి ఈ వారసుడిపై నిషేధం విధించింది. దీంతో హంజా ప్రయాణంపై నిషేధం, ఆస్తులు సీజ్ చేయడం వంటి చర్యలు ఉంటాయి. బిన్ లాడెన్ తర్వాత ఐమన్ అల్ జవహారి నాయకత్వంలో నడుస్తున్న అల్ ఖైదాకు హంజా ‘భవిష్యత్తు నాయకుడ’ని భావించి ఈ చర్యలు తీసుకున్నారు. అమెరికా రివార్డు ప్రకటన తర్వాత సౌదీ అరేబియా హంజా బిన్ లాడెన్ పౌరసత్వాన్ని రద్దు చేసింది. హంజా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్టు భావిస్తున్నారు.
2019-03-02 Read Moreరష్యా రాజధాని మాస్కోలో ఓ చిన్న విమానం రన్ వే పైనుంచి వేగంగా ప్రక్కకు జారిపోయిన దృశ్యం సీసీ టీవీ కెమేరాలకు చిక్కింది. రన్ వేపై మంచు ఉండటంతో జారిపోయిన బిజినెస్ జెట్ ఒకటి ప్రక్కన ఎయిర్ ఫీల్డ్ లో దట్టంగా ఉన్న మంచులో కూరుకుపోయింది. విమానానికి పెద్దగా నష్టం జరగకపోవడం ఇక్కడ విశేషం. అజర్ బైజాన్ రాజధాని బకు నుంచి వచ్చిన ఈ విమానంలో ఇద్దరు సిబ్బంది సహా ఐదుగురు ఉన్నారు. అయితే, ఎవరూ గాయపడలేదు.
2019-03-01