భారత రాజ్యాంగం ముసాయిదాను రూపొందించింది ఒక బ్రాహ్మణుడని గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది చెప్పుకొచ్చారు. అహ్మదాబాద్ నగరంలో జరుగుతున్న ప్రపంచ బ్రాహ్మణ సదస్సులో శనివారం త్రివేది మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ కూడా బంగాల్ నరసింగ్ రావుకు క్రెడిట్ ఇచ్చారని, ఆయన బ్రాహ్మణుడని త్రివేది చెప్పారు. అంతే కాదు.. భారత రాజ్యాంగ ప్రతిని రూపొందించడానికి 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారని కూడా ఈ పెద్ద మనిషి చెప్పుకొచ్చారు.
2020-01-04పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి)లకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో శనివారం భారీ ర్యాలీ జరిగింది. ముస్లిం సంస్థలు, ఇతర పౌర సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీకి కొన్ని పదుల వేల మంది హాజరయ్యారు. హైకోర్టు సూచనతో ధర్నా చౌక్ వద్ద సభకు పోలీసులు అనుమతించినా, ఆ స్థలానికి వెయ్యి మందినే రానిస్తామని పోలీసులు చెప్పారు. అయినా నిరసనకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
2020-01-04గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలో హరిక్రిష్ణ సరస్సు వద్ద గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ 2017లో ప్రారంభించిన సరస్సు వద్ద పార్కులో ఈ విగ్రహం 2018లో ఏర్పాటైంది. సూరత్ డైమండ్ వ్యాపారి సావ్జీభాయ్ ఢోలాకియాకి చెందిన ఫౌండేషన్ ఈ సరస్సును తవ్వించింది. సరస్సు తవ్వకాన్ని వ్యతిరేకించేవారు గానీ, సంఘ వ్యతిరేక శక్తులు గానీ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.
2020-01-04 Read Moreవెటరన్ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ అన్ని ఫార్మాట్లనుంచీ వైదొలుగుతున్నట్టు శనివారం ప్రకటించాడు. ఈ ఎడమ చేతి వాటం పేస్ బౌలర్ 19 సంవత్సరాల వయసులో 2003లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. చివరిగా 2012లో దక్షిణాఫ్రికాతో టి20 మ్యాచ్ ఆడాడు. 2017 వరకు ‘ఐపిఎల్’లో ఆడాడు. అంతర్జాతీయంగా 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టి20లు ఆడి 301 వికెట్లు పడగొట్టాడు. కచ్చితంగా 100 వికెట్లతో టెస్టు క్రికెట్ నుంచి విరమించుకున్నాడు.
2020-01-04 Read More‘‘మీ గురించి మీ భార్య కంటే గూగుల్ సెర్చ్ ఇంజనుకు ఎక్కువ తెలుసు’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. శనివారం జస్టిస్ కృష్ణయ్యర్ స్మారకోపన్యాసంలో ఆయన ప్రైవసీపై మాట్లాడుతూ... తాను విశాఖ నక్షత్రంలో వృచ్చిక రాశిలో పుట్టానని గూగుల్ కు తెలుసని పేర్కొన్నారు. మనం ఇంటర్నెట్ వాడే విధానం వల్ల 1. ప్రభుత్వాలు 2. సర్వీసు ప్రొవైడర్లు 3. సమాచారం ఇచ్చేవారు 4. హ్యాకర్లు మొత్తం తెలుసుకుంటున్నారని చెప్పారు.
2020-01-04 Read Moreఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం)లలో ప్రవేశంకోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సిఎటి) 2019లో 10 మంది విద్యార్ధులు 100 శాతం స్కోరు సాధించారు. 2019 నవంబరు 24న పరీక్ష నిర్వహించిన అధికారులు శనివారం ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష రాసిన విద్యార్ధులు తమ స్కోరును iimcat.ac.in వెబ్సైట్ లో చూసుకోవచ్చు. అభ్యర్ధులకు ఎస్.ఎం.ఎస్. ద్వారా కూడా సమాచారం అందుతుంది.
2020-01-04అస్సాం డిటెన్షన్ సెంటర్లో బంధీగా ఉన్న ఓ వ్యక్తి శనివారం గువాహతి ఆసుపత్రిలో మరణించారు. నరేష్ కోచ్ అనే వ్యక్తిని ‘‘విదేశీయుడు’’గా ప్రకటించి నిర్భంధించారు. ఆయన ముస్లిం కాదు. అస్సాంలోని కోచ్-రాజ్‌బోంగ్షి తెగకు చెందినవాడు. ఇతర దేశీ తెగలతోపాటు ఈ వర్గం కూడా తమను షెడ్యూల్డు తెగల్లో చేర్చాలని డిమాండ్ చేస్తోంది. నరేష్ కోచ్ ‘విదేశీయుడు’గా పరిగణించి గోల్ పారా డిటెన్షన్ కేంద్రంలో నిర్బంధించారు. నరేష్ విషమ స్థితిలో ఉండగా 10 రోజుల క్రితం ఆసుపత్రికి తరలించారు.
2020-01-04 Read More‘‘పాకిస్తాన్లో హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, పార్శీలు, జైనులు, బౌద్ధులు కలిపి 23 శాతం ఉండేవారు. ఇప్పుడు 3 శాతానికి తగ్గారు. ఆ 20 శాతం ఎక్కడికి వెళ్లారు?’’... బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి. నడ్డా ప్రశ్న ఇది. ‘‘వాళ్ల మతం మార్చారా? బహిష్కరించారా? వాళ్ళే పారిపోయారా? ప్రపంచం తెలుసుకోవాలనుకుంటోంది’’ అని నడ్డా శనివారం వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పాకిస్తాన్ బాధిత మైనారిటీలకోసమేనని బిజెపి చెబుతోంది.
2020-01-04పాము విషాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. మాల్దా జిల్లాలో పట్టుకున్న ఈ ముగ్గురి నుంచి స్వాధీనం చేసుకున్న విషం విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. కోటిన్నర ఉంటుందని పోలీసులు శనివారం చెప్పారు. ఆ ముగ్గురూ ఇంగ్లీషు బజార్ లోని ఓ హోటల్ లో ఉండగా శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. ఓ గాజు కంటైనర్లో ఉన్న విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రఫీక్ అలి, ఆశిక్ మండల్, మసూద్ షేక్ గా గుర్తించారు.
2020-01-04ఏపీ రాజధానిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బి.సి.జి) ఇచ్చిన నివేదికను ఓ చెత్త కాగితంగా అభివర్ణించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సంక్రాంతి పండుగ వస్తున్నందున భోగి మంటల్లో ఆ చెత్తను వేసి కాల్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సచివాలయం, సిఎంఒ, రాజ్ భవన్, అత్యవసర అసెంబ్లీ, ప్రధాన ప్రభుత్వ విభాగాలు విశాఖలో ఏర్పాటు చేయాలంటూ నిన్న బి.సి.జి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడారు.
2020-01-04