విశాఖపట్నంలో రూ. 70 వేల కోట్లు పెట్టుబడి పెడతామని అదానీ కంపెనీ చెప్పలేదని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి నొక్కి చెప్పారు. ‘‘గత ప్రభుత్వం అడిగిందనందువల్ల అంత మొత్తం చెప్పామని, నిజానికి తమ డిపిఆర్ లో రూ. 3000 కోట్ల నుంచి రూ. 4000 కోట్ల వరకు మాత్రమే ప్రతిపాదించామని ఆదానీ కంపెనీ మాకు చెప్పింది’’ అని గౌతంరెడ్డి గురువారం విలేకరులతో చెప్పారు. తమకు 50 ఎకరాలు చాలని కూడా కంపెనీ చెప్పినట్టు మంత్రి పేర్కొన్నారు.
2020-02-20బావగుత్తు రఘురాం శెట్టి (77)..కర్నాటక నుంచి అబుదాబి వెళ్లి బిలియన్లకు అధిపతి అయ్యారు. అమరావతిలో ఆసుపత్రి-పరిశోధనా కేంద్రం నిర్మాణానికి ముందుకొచ్చారు. సొంత విమానంలో మందీమార్భలంతో విజయవాడలో దిగిన అతికొద్ది మందిలో ఒకరు శెట్టి. ‘బుర్జ్ ఖలీఫా’లో రెండు ఫ్లోర్లు, కంటికి నచ్చిన వింటేజ్ కార్లు కొనడం సహా అత్యంత విలాసవంతమైన జీవితం అనుభవించారు. ఇప్పుడా సంపన్నుడు పతనం అంచున నిల్చున్నారు. శెట్టి స్థాపించిన ఎన్.ఎం.సి.పై ‘మడ్డీ వాటర్స్’ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో గత రెండు నెలల్లో షేర్ల విలువ 67 శాతం పడిపోయింది.
2020-02-20 Read Moreనిన్న కృష్ణాయపాలెంలో సర్వేకోసం వచ్చిన తాసీల్దారును దిగ్బంధించిన రైతులపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేశారు. ఒకట్లు, పదులపై కాదు.. ఏకంగా 426 మందిపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మంగళగిరి పోలీసులు సరికొత్త రికార్డు సృష్టించారు. రాజధానికోసం ఇచ్చిన భూములను ఇళ్ళ స్థలాలుగా కేటాయించే ఉద్ధేశంతో నిన్న ప్రభుత్వం కొంతమంది రెవెన్యూ అధికారులను ఆ ప్రాంతానికి పంపింది. భూముల సర్వేకు వీల్లేదంటూ కృష్ణాయపాలెంలో రైతులు దుగ్గిరాల, పెదకాకాని తాసీల్దార్లు మల్లేశ్వరి, రమేష్ నాయుడులను అడ్డగించారు.
2020-02-20జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) తదుపరి ఛైర్మన్ గా తెలుగు వ్యక్తి చింతల గోవిందరాజులు పేరు ఖరారైంది. బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బిబిబి) ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేసింది. గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరుకు చెందిన గోవిందరాజులు ప్రస్తుతం ముంబైలో నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరుగా పని చేస్తున్నారు. గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూలులో పాఠశాల విద్యను, బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1985లో నాబార్డులో గ్రేడ్-బి అధికారిగా చేరారు.
2020-02-19 Read Moreనావెల్ కరోనా వైరస్ (కోవిడ్ 19)తో ఇద్దరు జపనీయులు గురువారం మరణించారు. వీరిద్దరూ ‘డైమండ్ ప్రిన్సెస్’ క్రూయిజ్ ఓడలో ప్రయాణించినవారు. ఈ నెల 11, 12 తేదీల్లో వారిద్దరినీ ఓడ నుంచి ఆసుపత్రికి తరలించారు. మృతులు 80 సంవత్సరాలకు పైగా వయసున్న ఓ మహిళ, మరో పురుషుడుగా జపాన్ అధికారులు తెలిపారు. ఇంతకు ముందు ఓ జపనీయుడు కరోనా వైరస్ వల్ల మరణించారు. కరోనా భయంతో ‘డైమండ్ ప్రిన్సెస్’ను జపాన్ లోని యోకహామా పోర్టులోనే నిలువరించారు. అందులోని 621 మందికి ‘కరోనా’ సోకింది.
2020-02-20 Read Moreరూపాయి మరింత బలహీనపడింది. బుధవారం మార్కెట్ల ప్రారంభంలో డాలరుకు రూ. 71.79 పలికింది. కిందటి సెషన్లో (మంగళవారం) రూపాయి విలువ 24 పైసలు తగ్గి డాలరుకు రూ. 71.56 వద్ద ముగియగా, బుధవారం మరో 23 పైసలు తగ్గింది. బుధవారం (ఫిబ్రవరి 19న) ఛత్రపతి శివాజీ జయంతి సందర్బంగా బ్యాంకులకు సెలవు కావడంతో కరెన్సీ మార్కెట్లు మూసేశారు. గత మూడు నెలల్లో రూ. 70.59, రూ. 72.09 మధ్య ఈ విలువ దోబూచులాడుతోంది.
2020-02-20 Read Moreకమలహాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్ సందర్భంగా భారీ ప్రమాదం సంభవించి ముగ్గురు క్రూ సభ్యులు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. చెన్నై శివార్లలోని పూందపల్లి వద్ద ఇ.వి.పి. ఫిల్మ్ సిటీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్ కోసం వినియోగించిన భారీ క్రేన్ కూలి టెక్నీషియన్లపై పడింది. అసిస్టెంట్ డైరెక్టర్ క్రిష్ణ, ప్రొడక్షన్ అసిస్టెంట్లు మధు, చంద్రన్ ఈ ప్రమాదంలో మరణించారు. ఓ అతిభారీ లైట్ ను 150 అడుగుల ఎత్తున వేలాడదీయగా, ఆ బరువుకు క్రేన్ కూలినట్లు చెబుతున్నారు.
2020-02-20 Read Moreఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు ముందు మోడీ ప్రభుత్వం మంచి బహుమతి ఇచ్చింది. భారత నౌకాదళం కోసం 24 అమెరికా ఎంహెచ్-60 రోమియో యాంటీ సబ్ మెరైన్ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వాటి విలువ 2.6 బిలియన్ డాలర్లు (రూ. 18,720 కోట్లు). అంటే ఒక్కొక్క హెలికాప్టర్ రూ. 780 కోట్లు. బుధవారం కేబినెట్ సమావేశం సందర్భంగా సిసిఎస్ సమావేశమైంది. అయితే, ట్రంప్ పర్యటన (24-25)లో ఒప్పందంపై సంతకాలు చేస్తారా..లేదా అన్నది తెలియాల్సి ఉంది.
2020-02-19 Read Moreచైనా కంపెనీ ‘రియల్ మి’ ఇండియాలో 5జి ఫోన్ల అమ్మకానికి ఈ నెల 24న శ్రీకారం చుట్టనుంది. 865 స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో కూడిన 5జి ఫోన్ ధర రూ. 50,000 ఉంటుందని ‘రియల్ మి’ ప్రతినిధి ఒకరు బుధవారం చెప్పారు. అయితే, తక్కువ స్థాయి చిప్‌సెట్‌తో వచ్చే వెర్షన్ రూ. 25,790కు లభించవచ్చని ఓ ప్రముఖ వెబ్ సైట్ పేర్కొంది. X50 ప్రో 5జి ఫోన్ ను స్పెయిన్, ఇండియాలలో ఒకేసారి ఆవిష్కరించనుండగా, మరో చైనా బ్రాండ్ ‘ఐకూ 3’ కూడా ఈ నెల 25నే 5జి ఫోన్ ను ఇండియాలో విడుదల చేయనుంది.
2020-02-19 Read Moreమోడీ ప్రభుత్వం ‘పన్నుల సంస్కరణ’ పేరిట తెచ్చిన వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి)ని ‘21వ శతాబ్దపు అతిపెద్ద పిచ్చి నిర్ణయం’గా అభివర్ణించారు బిజెపి ఎంపీ సుబ్రమణియన్ స్వామి. బుధవారం హైదరాబాద్ నగరంలో ‘ఇండియా- యాన్ ఎకనామిక్ సూపర్ పవర్’ అనే అంశంపై స్వామి మాట్లాడారు. దేశం ‘సూపర్ పవర్’ కావాలంటే వచ్చే పదేళ్ళూ సగటున 10 శాతం వృద్ధి సాధించాలన్నారు. మాజీ ప్రధాని పి.వి. నరసింహరావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలకు గాను ఆయనకు ‘భారత రత్న’ ఇవ్వాలని స్వామి అభిప్రాయపడ్డారు.
2020-02-19 Read More