అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని 13 జిల్లాలకూ విస్తరింపజేయాలని అఖిలపక్ష నేతలు తీర్మానించారు. శనివారం విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ హాజరయ్యాయి. రాజకీయ విభేదాలను ప్రక్కన పెట్టి అమరావతికోసం పోరాడాలని స్థూలంగా ఓ అభిప్రాయం వ్యక్తమైంది. రాజధానిలో మనోవేదనతో మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలని, ఎస్సీ-ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేయడం మానాలని నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
2020-02-29ఢిల్లీ అల్లర్ల విషయంలో పోలీసులను (కేంద్రాన్ని) తప్పుపట్టిన జస్టిస్ మురళీధర్ పైన సామాజిక మాథ్యమాల్లో ఓ రాజకీయ ప్రచారం సాగుతోంది. ‘‘పై ఫొటోలో జడ్జి మురళీధరన్, కింది చిత్రంలో సోనియాగాంధీ నామినేషన్ వేసే సమయంలో లాయర్ మురళీధరన్. మీరు ఇప్పుడు అర్ధం చేసుకున్నారా?’’ అనే వ్యాఖ్యతో ఫొటోలను షేర్ చేస్తున్నారు. నిజనిర్ధారణలో తేలిందేమంటే... 2019 ఎన్నికల సమయంలో నామినేషన్ వేస్తున్న సోనియాగాంధీ ప్రక్కన ఉన్నది సుప్రీంకోర్టు మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ కె.సి. కౌశిక్.
2020-02-29 Read Moreరిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తొలిసారి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. శనివారం ఆయన తన కుమారుడు అనంత్ అంబానీ, మరో పారిశ్రామికవేత్త.. రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానితో కలసి సిఎం నివాసానికి వచ్చారు. వారికి ఎంపీ విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు. అంబానీ, జగన్ భేటీకి చాలా ప్రాధాన్యత ఉంది. 2009లో సిఎం రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాక ఆయన అనుయాయులు కొందరు అంబానీపై ఆరోపణలు చేశారు. 4 నెలల తర్వాత ఓ టీవీ కథనం ఆధారంగా రిలయన్స్ ఆస్తులను ధ్వంసం చేశారు.
2020-02-29‘కరోనా వైరస్’ కేంద్ర బిందువైన చైనాలో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టగా.. ఆ దేశం వెలుపల అందుకు మూడు రెట్లు కొత్త కేసులు నమోదవుతున్నాయి. 53 దేశాలకు విస్తరించిన ‘కరోనా’ను ప్రపంచానికి ‘చాలా తీవ్రమైన’ ముప్పుగా శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించింది. ‘తీవ్రమైన ముప్పు’ అన్న గత అంచనాను మార్చుకుంది. శుక్రవారం ఒక్క రోజే దక్షిణ కోరియాలో 571 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కొరియా కేసుల సంఖ్య 2,337కు చేరింది. కొరియాలో 13 మంది, ఇటలీలో 21 మంది, ఇరాన్ లో 34 మంది చనిపోయారు.
2020-02-29నిన్న విశాఖ పర్యటనకు వెళ్ళిన ప్రతిపక్ష నేత చంద్రబాబును 151 సెక్షన్ కింద అరెస్టు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పు పట్టింది. నేరం చేసే అవకాశం ఉన్న వ్యక్తిని నిరోధించడానికి ఉపయోగించే 151 సెక్షన్ కింద చంద్రబాబుకు నోటీసు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న నేపథ్యంలో..టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీని, విశాఖ పోలీసులను ఆదేశించిన హైకోర్టు... విచారణను మార్చి 2కి వాయిదా వేసింది.
2020-02-28కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు గడచిన 10 నెలల కాలంలో రెవెన్యూ లోటు రూ. 7,50,475 కోట్లుగా తేలింది. ద్రవ్య లోటు రూ. 9,85,472 కోట్లకు చేరింది. కేంద్రం నిర్దేశించుకున్న పరిమితులు దాటి 10 నెలల్లోనే ద్రవ్య లోటు 128.5 శాతంగా, రెవెన్యూ లోటు ఏకంగా 150 శాతంగా నమోదయ్యాయి. 2019-20లో రెవెన్యూ రశీదులు రూ. 18,50,101 కోట్లుగా సవరించిన అంచనాల్లో చూపించిన కేంద్రం, జనవరి వరకు రూ. 12,50,120 కోట్లు (67.6 శాతం) రాబట్టుకోగలిగింది.
2020-02-28 Read Moreస్టాక్ మార్కెట్ పతనానికి సమాంతరంగా రూపాయి విలువ పడిపోయింది. శుక్రవారం (ఫిబ్రవరి 28) ఒక్క రోజే 60 పైసలు పతనమైంది. ఈక్విటీల అమ్మకం, విదేశీ నిధుల పలాయనంతో రూపాయి 72 మార్కు దాటింది. డాలరుకు రూ. 72.21 వద్ద ట్రేడింగ్ ముగిసింది. శుక్రవారం ఓ దశలో 72.29కి చేరింది. ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లడంతో బిఎస్ఇ బెంచ్ మార్క్ సెన్సెక్స్ శుక్రవారం ఏకంగా 1,448.37 పాయింట్లు తగ్గింది. విదేశీ నిధులు గత కొద్ది రోజులుగా వెనక్కు మళ్లుతున్నాయి.
2020-02-28 Read More2019-20 ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల వృద్ధి రేటు అంచనాలను కేంద్ర గణాంకాల సంస్థ సవరించింది. తొలి త్రైమాసికం వృద్ధి రేటు 5.1 శాతమని ఆర్నెల్ల క్రితం ప్రకటించగా.. ఇప్పుడా అంచనాను 5.6 శాతానికి పెంచింది. రెండో త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయి కేవలం 4.5 శాతం వృద్ధి నమోదు కాగా.. దాన్ని 5.1 శాతానికి పెంచింది. మొత్తంగా తొలి అర్దభాగంలో వృద్ధి రేటును 5.35 శాతంగా చూపుతున్నారు. మూడో త్రైమాసికంలో వృద్ధి 4.7 శాతంగా శుక్రవారం ప్రకటించారు. సవరించిన అంచనాలతో వార్షిక వృద్ధి రేటు అంచనా 5 శాతానికి పెరిగింది.
2020-02-28 Read More2019-20 మూడో త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం 4.7 శాతం పెరిగినట్లు అంచనా. కేంద్ర గణాంకాల సంస్థ (సి.ఎస్.ఒ) శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం...గత అక్టోబర్-డిసెంబరు కాలంలో జీడీపీ మొత్తం రూ. 36.65 లక్షల కోట్లు. 2018-19లో ఇదే కాలానికి రూ. 35 లక్షల కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకంగా 4.5 శాతానికి పడిపోయిన జీడీపీ వృద్ధి రేటు ఇంకా కోలుకోలేదు. పూర్తి సంవత్సరానికి వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందన్న అంచనాను మాత్రం సిఎస్ఒ మార్చలేదు.
2020-02-28 Read Moreభారత స్టాక్ మార్కెట్లో ఈ శుక్రవారం (ఫిబ్రవరి 28న) భారీ ప్రకంపనలు నమోదయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బిఎస్ఇ సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల వరకు పడిపోగా ముగింపు మరింత దారుణంగా ఉంది. శుక్రవారం ఒక్క రోజే బెంచ్ మార్క్ సెన్సెక్స్ 1,448.37 పాయింట్లు పతనమై 38,297కి దిగజారింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 414 పాయింట్లు పతనమై 11,219 వద్ద ముగిసింది. ఈ పరిణామాన్ని దలాల్ స్ట్రీట్ లో మారణహోమంగా అభివర్ణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘కరోనా’ భయంతో ఈక్విటీల అమ్మకాలు వెల్లువెత్తడం దీనికి కారణంగా చెబుతున్నారు.
2020-02-28 Read More