నిన్న 2919 పాయింట్లు పడిపోయిన బిఎస్ఇ సెన్సెక్స్, శుక్రవారం (మార్చి 13న) ఓ దశలో 3434 పాయింట్లు (10.48%) పతనమై కల్లోలం సృష్టించింది.12 సంవత్సరాల్లో తొలిసారి బిఎస్ఇ, ఎన్ఎస్ఇలలో వాణిజ్యాన్ని నిలిపివేయవలసి వచ్చింది. అయితే.. తర్వాత కోలుకొని ఈ రోజు నష్టాన్ని పూర్తిగా పూడ్చుకోవడంతోపాటు, వాణిజ్యం ముగిసే సమయానికి 1325 పాయింట్లు (4.04%) లాభపడింది. అంటే.. కనిష్ఠానికి, ముగింపునకు మధ్య 4,760 పాయింట్ల తేడా ఉంది. ఇది అసాధారణమైన ఊగిసలాట. శుక్రవారం సెన్సెక్స్ 34,103 పాయింట్ల వద్ద ముగిసింది.
2020-03-13జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి) లకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇందుకోసం శుక్రవారం ఒక రోజు అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించారు. ‘‘నాకు, నా భార్యకు, నా మొత్తం మంత్రివర్గానికి బర్త్ సర్టిఫికెట్లు లేవు. మమ్మల్ని డిటెన్షన్ క్యాంపులకు పంపుతారా?’’ అని ప్రశ్నించిన కేజ్రీవాల్.. బర్త్ సర్టిఫికెట్లు ఉన్న ఎమ్మెల్యేలు చేతులెత్తాలని కోరారు. 9 మందే చేతులెత్తడంతో.. ‘‘61 మంది ఎమ్మెల్యేలకు బర్త్ సర్టిఫికెట్లు లేవు. వారిని కూడా డిటెన్షన్ సెంటర్లకు పంపుతారా?’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
2020-03-13ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్ప కూలుస్తున్న ‘కరోనా’ కంటే ప్రమాదకరమైన జగన్ వైరస్ రాష్ట్రానికి పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నామినేషన్లు కూడా వేసే పరిస్థితి లేదని, ఆడబిడ్డలకు రక్షణ లేదని, నేరాలు - ఘోరాలను వ్యవస్థీకృతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతల దౌర్జన్యాలను వివరిస్తూ శుక్రవారం సాయంత్రం చంద్రబాబు పలు వీడియోలను ప్రదర్శించారు. ఎక్కువ దౌర్జన్యాలు చేసేవారే సిఎంకు దగ్గరివారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
2020-03-13అధికార పార్టీ వాళ్లే మందు సీసాలు టీడీపీ అభ్యర్ధుల ఇళ్ళలో పెట్టి జైళ్లకు పంపాలని కుట్ర చేశారని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తెనాలి 4వ వార్డు టీడీపీ అభ్యర్ధి అడుసుమల్లి వెంకటేశ్వరరావు ఇంట్లో రాత్రి 12.46 గంటలకు ఓ ముసుగు వ్యక్తి గోడ దూకి వచ్చి మద్యం కేసును పెట్టిన వీడియోను చంద్రబాబు శుక్రవారం సాయంత్రం మీడియా ఎదుట ప్రదర్శించారు. మద్యం పట్టుబడితే జైలు శిక్ష, జరిమానా అంటూ ఓ నల్ల చట్టాన్ని ఇందుకే తెచ్చారని చంద్రబాబు విమర్శించారు. సీసీ టీవీ ఉంది కాబట్టి ఈ దుర్మార్గం రికార్డయిందని, వీళ్లకోసం గ్రామాల్లో కూడా సీసీ టీవీలు పెట్టుకోవలసి వస్తోందని వ్యాఖ్యానించారు.
2020-03-13‘కరోనా’పై ముందు జాగ్రత్తగా.. తిరుపతిలో 500 పడకలు, విశాఖపట్నంలో 200 పడకలతో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో 56 ప్రత్యేక వార్డులు (428 పడకలు), జిల్లాకు ఒకటి చొప్పున 13 ర్యాపిడ్ రెస్పాన్స్ టీములు, 13 అంబులెన్సుల వంటి చర్యలు తీసుకున్నామని శుక్రవారం మీడియాకు చెప్పారు. 55 మంది నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకోసం పంపామని, 47 నెగెటివ్ రాగా ఒక్కరికి వైరస్ తేలిందని, మరో ఏడుగురి ఫలితాలు రావలసి ఉందని వివరించారు.
2020-03-13జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని ఉపసంహరించాక గృహ నిర్బంధానికి గురైన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (83) శుక్రవారం విడుదలయ్యారు. లోక్ సభ సభ్యుడైన ఫరూక్ అబ్దుల్లాను పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద సుమారు 7 నెలల 10 రోజులు నిర్బంధంలో ఉంచారు. ఆయనతోపాటు ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పిడిపి నేత మెహబూబా ముఫ్తీలు కూడా గత ఆగస్టు 5 నుంచి నిర్బంధంలో ఉన్నారు. ‘‘ఈ రోజు నాకు స్వేచ్ఛ వచ్చింది. అయితే, మిగిలిన నాయకులు విడుదలయ్యేదాకా పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు కాదు’’ అని ఫరూక్ వ్యాఖ్యానించారు.
2020-03-13 Read Moreమరో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాను నిలబెట్టుకునేలా లేరని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ మారితే రాజీనామా చేయాలన్న జగన్మోహన్ రెడ్డి మాటలో ఎలాంటి మార్పూ లేదంటూ... కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్ధతు ప్రకటిస్తున్నారని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆక్షేపించారు.
2020-03-13 Read Moreగతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అధికార పార్టీతో పోలీసు యంత్రాంగం కుమ్మక్కైందని బిజెపి పార్లమెంటు సభ్యులు జివిఎల్ నరసింహారావు, టిజి వెంకటేశ్, సిఎం రమేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ చట్ట వ్యతిరేక చర్యలకు పోలీసులు పూర్తి స్థాయిలో మద్ధతు ఇస్తున్నారని, జోక్యం చేసుకొని శాంతిభద్రతలను సరిదిద్దాలని వారు శుక్రవారం సమర్పించిన వినతిపత్రంలో కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ఆదేశానుసారం పని చేస్తున్నట్టు అంతా నమ్ముతున్నారని పేర్కొన్నారు.
2020-03-13గురువారం ఓ ‘గూగుల్’ ఉద్యోగికి ‘కరోనా వైరస్’ నిర్ధారణ కావడంతో ఇండియన్ టెక్ సిటీలో కలకలం రేగింది. గూగుల్ సంస్థ తమ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఓ రోజు మూసివేసి ఉద్యోగులు ఇంటినుంచే పని చేయాలని సూచించింది. ఆ ఉద్యోగికి దగ్గరగా మెలిగినవారిపైనా నిఘా ఉంచారు. ఇంతకు ముందే ‘డెల్’, ‘మైండ్ ట్రీ’ కంపెనీల్లోనూ ఒక్కో ఉద్యోగికి ‘కరోనా’ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో.. ఇ- కామర్స్ దిగ్గజం అమేజాన్ మార్చి నెలాఖరువరకు ఇంటినుంచే పని చేయాల్సిందిగా తన ఉద్యోగులకు సూచించింది. ఫ్లిప్ కార్ట్ మూడు రోజులపాటు ఇంటినుంచి పనిని అమలు చేసింది.
2020-03-13 Read Moreవేల కోట్ల వ్యాపారానికి వేదికైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 సీజన్ వాయిదా పడింది. మార్చి 29న ప్రారంభం కావలసిన ఈ ‘ఈవెంట్’ను ఏప్రిల్ 15 నుంచి నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. తర్జనభర్జనలు, అనేక సూచనల మధ్య ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకుంది.
2020-03-13