నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలలో కేరళ మరోసారి ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. డబుల్ ఇంజిన్ అభివృద్ధికి చిరునామాగా ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న ఉత్తరప్రదేశ్ ఆఖరి స్థానంలో కొనసాగింది. పెద్ద రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలవగా.. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ చివరి మూడు స్థానాల్లో సెటిలయ్యాయి. కేరళ స్కోరు 82.20 కాగా యూపీ స్కోరు 30.57 మాత్రమే! అయితే పెరుగుదల రేటులో యూపీ మొదటి స్థానంలో ఉన్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది.
2021-12-27లఖీంపూర్ ఖేరిలో జరిగిన హింస రైతులకు, వారి ఆందోళనకు వ్యతిరేకంగా జరిగిన పెద్ద కుట్రలో భాగమని, ఇదొక విడి ఘటన కాదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.ఎం) పేర్కొంది. హింసాత్మక చర్యల ద్వారా రైతుల ఆందోళనను విరమింపజేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ‘‘ప్రజలను భయకంపితులను చేసి వారి గొంతును నులిమేసేందుకు తగిన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నమే లఖీంపూర్ ఘటన’’ అని ఎస్.కె.ఎం. నేత దర్శన్ పాల్ అభిప్రాయపడ్డారు.
2021-10-09భారత జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూపు పరమైంది. అప్పుల్లో మునిగిన ఎయిర్ ఇండియా అమ్మకానికి ప్రభుత్వం నిర్వహించిన టెండర్ ప్రక్రియలో ‘టాటా సన్స్’ అనుబంధ సంస్థ విజయం సాధించింది. పోటీదారైన స్పైస్ జెట్ ప్రమోటర్లను ఓడించి 100 శాతం వాటాకు రూ. 18,000 కోట్లు చెల్లించడానికి టాటా గ్రూపు ముందుకొచ్చింది. ఎయిర్ ఇండియాకు ఉన్న అప్పులు రూ. 15,300 కోట్లను స్వీకరించి మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించనుంది.
2021-10-08లఖీంపూర్ హత్యాకాండ కేసులో దర్యాప్తుపై ఓ నివేదికను రేపటిలోగా సమర్పించాలని సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారుతో రైతులను తొక్కించిన ఘటనపై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. నిందితుల వివరాలు, వారిని అరెస్టు చేశారా.. లేదా? అన్న అంశం రిపోర్టులో ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరణించిన లవ్ ప్రీత్ సింగ్ తల్లికి వైద్యసాయం అందించాలని కూడా సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2021-10-07ఉత్తరప్రదేశ్ లో నిరసన తెలుపుతున్న రైతులను కారుతో తొక్కించిన కేంద్ర మంత్రి కుమారుడి వ్యవహారంలో నోరు విప్పిన ఏకైక బిజెపి నేత ఎంపీ వరుణ్ గాంధీపై ఆ పార్టీ వేటు వేసింది. కేంద్ర మంత్రి కారు రైతులను తొక్కుకుంటూ వెళ్ళిన వీడియోను వరుణ్ గాంధీ ట్విట్టర్లో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే.. బిజెపి జాతీయ కార్యవర్గం నుంచి ఆయనను, ఆయన తల్లి మేనకా గాంధీని తప్పించారు. చిందిన రైతుల రక్తానికి జవాబుదారీ వహించాలని, న్యాయం జరగాలని వరుణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
2021-10-07కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తనకు లేఖ రాశారని తెలంగాణ సిఎం కేసీఆర్ గురువారం అసెంబ్లీలో వెల్లడించారు. అవసరమైతే.. రాష్ట్రాల హక్కులకోసం కేంద్రంపై పోరాడతామని ఉద్ఘాటించారు. రాష్ట్రాల హక్కులను హరించడంలో బిజెపి, కాంగ్రెస్ మధ్య తేడా ఏం లేదని వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ కూలీల వేతనాలను కూడా నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలో వేస్తామంటున్నారని, మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీ సర్పంచ్ ల వరకు ఏం చేయాలని కేసీఆర్ ప్రశ్నించారు.
2021-10-07నలుగురు రైతుల సామూహిక హత్యతో పాటు మొత్తం 8 మంది మరణించిన లఖీంపూర్ ఖేరి ఘటనలపై విచారణకు సుప్రీంకోర్టు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లి గురువారం విచారించనున్నారు. లఖీంపూర్ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలంటూ యూపీకి చెందిన ఇద్దరు లాయర్లు నిన్న సిజెఐకి లేఖ రాసిన నేపథ్యంలో బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు.
2021-10-06యూపీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారుతో తొక్కించిన రైతుల కుటుంబాలకు చత్తీస్ గఢ్, పంజాబ్ రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాలు రూ. 50 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించాయి. లఖీంపూర్ ఖేరి వద్ద సామూహిక హత్యకు గురైన నలుగురు రైతులకు, ఓ జర్నలిస్టుకు ఈ సాయం అందనుంది. పార్టీ నేత రాహుల్ గాంధీతో కలసి బుధవారం బాధిత కుటుంబాల పరామర్శకు వచ్చిన ఆ రాష్ట్రాల సిఎంలు భూపేష్ బఘేల్, చరణ్ జిత్ చన్ని సాయంపై ప్రకటనలు చేశారు.
2021-10-06దేశంలో ప్రస్తుతం నియంతృత్వం ఉందని, ప్రభుత్వం రైతులపై దాడి చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. యూపీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి వాహనం తొక్కుకుంటూ వెళ్లగా మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించడానికి రాహుల్ బుధవారం ఆ రాష్ట్రానికి వెళ్లారు. రాహుల్ గాంధీతోపాటు చత్తీస్ గఢ్, పంజాబ్ సిఎంలు భూపేష్ బఘేల్, చరణ్ జిత్ సింగ్ చని ఉన్నారు. ముందు నిరాకరించిన యూపీ పోలీసులు ఎట్టకేలకు రాహుల్ పర్యటనకు అనుమతి ఇచ్చారు.
2021-10-06ఆగస్టు 14ను ‘విభజన ఘోరాల స్మారక దినం’గా పాటిస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీకి మహాత్మాగాంధీ మనుమడు రాజ్ మోహన్ గాంధీ ఓ సూటి ప్రశ్న వేశారు. ‘మతి లేని విద్వేషానికి, హింసకు లక్షలాది మంది మన సోదరీ సోదరులు నిరాశ్రయులయ్యారు, చాలా మంది మరణించారు’ అని మోదీ చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ, ‘మన సోదర సోదరీమణుల్లో నిరాశ్రయులైన లేదా చంపబడ్డ ముస్లింలను కూడా చేర్చారా?’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ‘అవును’ అని మోదీ సమాధానం చెబితే అది ఒక కొత్త రోజు అవుతుందని గాంధీ ఎన్.డి. టీవీకి రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
2021-08-18