హ్యూండాయ్ మోటార్ ఇండియా కంపెనీ కార్ల అమ్మకాలు డిసెంబరులో 9.9 శాతం తగ్గాయి. గత ఏడాది ఇదే మాసంలో 55,638 యూనిట్లు అమ్ముడుపోగా ఈసారి ఆ సంఖ్య 50,135కు తగ్గింది. దేశీయంగా గత డిసెంబరులో 42,093 యూనిట్లు అమ్ముడైతే ఈసారి 37,953కు తగ్గాయి. దేశీయ అమ్మకాలు 9.8 శాతం తగ్గితే.. ఎగుమతులు 10.06 శాతం తగ్గాయి. 2018 డిసెంబరులో ఎగుమతులు 13,545 యూనిట్లు కాగా ఈసారి 12,182కి పడిపోయాయి.
2020-01-01 Read Moreచంద్రుడిపై ఓ వాహనాన్ని సాఫీగా దించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తలపెట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే, ఈ ప్రయోగం వచ్చే ఏడాది (2021)కి వాయిదా పడవచ్చు. 2020లో ప్రయోగం ఉంటుందని నిన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పగా, వచ్చే ఏడాదికి మారవచ్చని బుధవారం ‘ఇస్రో‘ ఛైర్మన్ శివన్ చెప్పారు. చంద్రయాన్-2 ప్రయోగంలో రోవర్ చంద్రునిపై దిగడంలో విఫలమైన నేపథ్యంలో ‘ఇస్రో’ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
2020-01-01‘‘గగన్ యాన్’’ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ శివన్ వెల్లడించారు. వారికి శిక్షణ జనవరి మూడో వారంలో రష్యాలో ప్రారంభమవుతుందని తెలిపారు. 2019లో ఇస్రో ప్రగతిని వివరించేందుకు శివన్ బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇండియా తొలిసారి 2022లో మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపడుతోంది. కనీసం ఏడు రోజుల పాటు భారత వ్యోమగాములు అంతరిక్షంలో గడపాలన్నది ప్రణాళిక.
2020-01-01వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) వసూళ్ళ వృద్ధి రేటు జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. 2018 డిసెంబరు కంటే 2019 డిసెంబరులో అధికంగా వసూలైన మొత్తం తెలంగాణలో 13 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 శాతం. అదే సమయంలో జాతీయ సగటు వృద్ధి 16 శాతంగానూ మహారాష్ట్రలో 22 శాతంగానూ, గుజరాత్ రాష్ట్రంలో 18 శాతంగానూ ఉంది. దక్షిణాదిన కర్నాటక మాత్రమే తక్కువ (ఏపీతో సమానంగా 11 శాతం) వృద్ధిని నమోదు చేసింది. కేరళలో 17 శాతం, తమిళనాట 19 శాతం వృద్ధి నమోదైంది.
2020-01-012019 చివరి మాసంలో వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) వసూళ్ళు లక్ష కోట్లు దాటాయి. 2018 డిసెంబరులో రూ. 94,726 కోట్లు రాగా, ఈసారి 1,03,184 కోట్లు వసూలయ్యాయి. అందులో సి.జి.ఎస్.టి. 19,962 కోట్లు, ఎస్.జి.ఎస్.టి. 26,792 కోట్లు కాగా, ఐ.జి.ఎస్.టి. 48,099 కోట్లు. మరో రూ. 8,331 కోట్లు సెస్ రూపంలో వచ్చాయి. వృద్ధి రేటు 8.93 శాతం. 2019-20లో నెలకు లక్ష కోట్లు దాటడం ఇది ఆరోసారి. ఏప్రిల్ మాసంలో అత్యధికంగా రూ. 1,13,865 కోట్లు వసూలయ్యాయి.
2020-01-01 Read Moreతెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి రాజధాని రైతులకు మద్ధతుగా రంగంలోకి దిగారు. బుధవారం చంద్రబాబుతో కలసి ఎర్రబాలెం వద్ద రైతుల దీక్షలో పాల్గొని ఉద్యమానికి మద్ధతు తెలిపారు. అమరావతి నిర్మాణంకోసం భూములిచ్చిన రైతులు రోడ్డున పడిన నేపథ్యంలో... నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. అమరావతి ఉద్యమానికి విరాళంగా భువనేశ్వరి తన చేతి గాజులను ఇచ్చారు.
2020-01-01మిస్టర్ బీన్ తెలియని పిల్లలు ప్రపంచంలో అరుదుగా ఉంటారేమో! అంతగా పాపులర్ అయిన హాస్యభరిత పాత్ర అది. ‘మిస్టర్ బీన్’కు నేటితో 30 వసంతాలు! 1990 జనవరి 1న తొలిసారి ఈ కామెడీ పాత్ర ఐ.టి.వి. తెరపైన కనిపించింది. రోవన్ ఆట్కిన్సన్, రిచర్డ్ కర్టిస్ రూపొందించిన ఈ పాత్ర తొలుత ప్రయోగాత్మకంగా మొదలైంది. ‘‘నిశ్శబ్ద హాస్యాన్ని’’ పండించడంలో మిస్టర్ బీన్ ది ప్రత్యేక శైలి. ఈ తరహా హాస్యానికి పితామహుడు చార్లీ చాప్లిన్ అయితే ఇప్పటి కింగ్ ‘మిస్టర్ బీన్’.
2020-01-01 Read Moreపారదర్శక పాలన అందిస్తామని సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార వేదికపైనే ప్రకటించారు. అయితే, ఆచరణ అందుకు భిన్నంగా ఉందనడానికి రహస్య జీవోలు ఓ ఉదాహరణ. 2019 సంవత్సరం చివరి రోజైన డిసెంబరు 31వ తేదీనే ఏకంగా 80 రహస్య జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. అందులో సింహభాగం పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించినవే. ఆర్థిక శాఖకు సంబంధించి 2, రెవెన్యూ, మహిళా సంక్షేమ శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి ఉన్నాయి.
2020-01-01 Read Moreఇరాక్ రాజధాని బాగ్ధాద్ లోని అమెరికా ఎంబసీ సిబ్బందికి సాయంగా అమెరికా ప్రత్యేక దళాలను రంగంలోకి దించింది. ఎంబసీపై ఇరాకీలు దాడి చేసిన విషయం తెలియగానే రెండు రెండు ఎహెచ్-64 అపాచీ హెలికాప్టర్లను ఎంబసీపై గస్తీకోసం పంపింది. తర్వాత ప్రత్యేక మెరైన్ దళాలనూ తరలించింది. ఎంబసీకి సెక్యూరిటీ, అమెరికన్ల భద్రతకు పూచీ ఇవ్వడానికి సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది.
2019-12-31ఇరాక్ రాజధాని బాగ్ధాద్ లోని అమెరికా ఎంబసీపై ఆ దేశ పౌరులు మంగళవారం దాడి చేశారు. ‘‘ఇరాన్ మద్ధతు ఉన్న మిలీషియా’’పై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 25 మంది మరణించారు. దీంతో ఆగ్రహించిన ఇరాకీలు మంగళవారం వందల సంఖ్యలో అమెరికా ఎంబసీపై దండెత్తారు. ఎంబసీ వెలుపలి భాగంలో ఉన్న వాహనాలను ధ్వసం చేసి ఓ గది అద్దాలను పగులగొట్టి నిప్పంటించారు.
2019-12-31 Read More