జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్ధులపై జరిగిన దాడి అధికారంలో ఉన్నవాళ్ళు ప్రణాళిక ప్రకారం చేయించినదేనని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. హిందూత్వ ఎజెండాకు జె.ఎన్.యు. విద్యార్ధులు చూపిన ప్రతిఘటనకు భయపడే హింసకు దిగారని ఆరోపించారు. వర్శిటీ నుంచి అందిన సమాచారం ప్రకారం...అధికార యంత్రాంగం, ఎబివిపి గూండాలు కుమ్మక్కైనట్టు స్పష్టమవుతోందని ఏచూరి పేర్కొన్నారు.
2020-01-05జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్ధులు, ప్రొఫెసర్లపై గూండాల దాడి సమాచారం తెలిసి బాలీవుడ్ నటీమణి స్వరాభాస్కర్ విలపించారు. ‘‘అర్జెంట్ ఎస్.ఒ.ఎస్. అప్పీల్’’ అంటూ ‘‘ఇన్స్టాగ్రామ్’’లో ఆమె వీడియో పోస్టు చేశారు. తన తల్లిదండ్రులు కూడా వర్శిటీ ఆవరణలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. వర్శిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షురాలికి రక్తగాయాలు అయిన వీడియోను కూడా స్వర పోస్టు చేశారు. యూనివర్శిటీ ఉత్తర ద్వారం వైపు వెళ్ళాలని ఆమె ఢిల్లీవాసులకు విన్నవించారు.
2020-01-05మూడు రాజధానుల ప్రతిపాదనకు తాము వ్యతిరేకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు స్పష్టం చేశారు. మందడంలో ఆందోళన చేస్తున్న రైతులను మధు ఆదివారం పరామర్శించి మద్ధతు తెలిపారు. చేయని తప్పుకు రాజధాని రైతులను ప్రభుత్వం శిక్షిస్తోందని మధు ఆక్షేపించారు. గత ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగి ఉంటే అందుకు బాధ్యులను శిక్షించాలన్నారు. రాజధాని రైతులతో సిఎం చర్చించాలని సూచించారు.
2020-01-05సరిలేరు నీకెవ్వరూ ప్రి రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి, విజయశాంతి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. రాజకీయాల్లో విజయశాంతి తనపై తీవ్ర విమర్శలు చేశారని చిరంజీవి వేదికపై గుర్తుచేయగా, రాజకీయాలు వేరు.. సినిమాలు వేరని లేడీ సూపర్ స్టార్ మెగాస్టార్ కు బదులిచ్చారు. విజయశాంతి తనను ఎన్ని మాటలన్నా తాను మాత్రం ఒక్కసారి కూడా ఆమెను ఏమీ అనలేదని చిరంజీవి చెప్పారు. చిరు, విజయశాంతి తాము సినిమాల్లో కలిసి నటించిన రోజులను గుర్తుచేసుకున్నారు.
2020-01-05సరిలేరు నీకెవ్వరూ ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 13 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హీరో మహేశ్ బాబు, హీరోయిన్లు రష్మిక మందన, తమన్నా, ఇతర నటీనటులు సందడి చేశారు. మెగా, సూపర్ స్టార్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
2020-01-05దేశాన్ని నియంత్రిస్తున్న ఫాసిస్టులు విద్యార్ధులు గళమెత్తితే భయపడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. జె.ఎన్.యు.పై ఆదివారం రాత్రి జరిగిన దాడి ఈ భయానికి నిదర్శనమని రాహుల్ ట్విటర్లో పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ముసుగు ధరించిన దుండగులు 50 మంది వర్శిటీలోకి ప్రవేశించి విద్యార్ధులు, ప్రొఫెసర్లపై దాడి చేసి... ఆస్తులను ధ్వంసం చేశారు. ఆర్.ఎస్.ఎస్. అనుబంధ ఎబివిపి నేతలే దీనికి కారణమని ఆరోపణలున్నాయి.
2020-01-05దేశ రాజధానిలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం రక్తసిక్తమైంది. ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించిన సుమారు 50 మంది గూండాలు వర్శిటీ విద్యార్ధులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన 15 మంది విద్యార్ధులను ‘ఎయిమ్స్’కు తరలించవలసి వచ్చింది. పోలీసులు చూస్తుండగానే ఎబివిపి నాయకులు తమపై దాడి చేశారని జె.ఎన్.యు. విద్యార్ధి సంఘం నేతలు చెప్పారు. దుండగులు పెద్ద రాళ్ళు విసురుతూ కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు.
2020-01-05పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులు విడుదలయ్యారు. 20మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ లాండి జైలు నుంచి విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్ద రేపు భారత అధికారులకు వారిని అప్పగించనుంది. మంత్రి మోపిదేవి మత్స్యకారులను తీసుకొచ్చేందుకు వాఘా బయలు దేరి వెళ్లారు. చేపల వేట కోసం గుజరాత్ వెళ్లిన మత్స్యకారులు 2018 నవంబర్ లో పొరపాటున పాకిస్థాన్ జలాల్లో ప్రవేశించారు. దీంతో పాక్ నౌకాదలం వారిని అదుపులోకి తీసుకుంది.
2020-01-05భద్రాచలం స్వామివారి తెప్పోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సీతారామచంద్రులు విహరిస్తున్న హంసవాహనాన్ని అనుసరిస్తున్న పడవలో ప్రమాదవశాత్తూ బాణాసంచా పేలింది. దీంతో పడవలోని ముగ్గురు వ్యక్తులు భయంతో గోదావరిలో దూకారు. వారిలో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు రాగా, మరొకరు గల్లంతయ్యారు. ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
2020-01-05చంద్రబాబు తమ కమిటీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని జీఎన్ రావు ఆరోపించారు. సీఎం సలహాదారు అజయ్ కల్లాం ఇచ్చిన రిపోర్టునే తాము సమర్పించామనడం అవాస్తవమన్నారు. అన్ని ప్రాంతాల్లో పర్యటించి, జిల్లా కలెక్టర్లందరితో మాట్లాడి, ప్రజల అభిప్రాయాలను సేకరించి సమగ్రంగా నివేదిక రూపొందించామన్నారు. అన్ని జిల్లాల అభివ్రుద్ధికి తాము సూచనలు చేశామని జీఎన్ రావు చెప్పారు.
2020-01-05