దీపికా పదుకొనే నటించిన ‘‘ఛపాక్’’ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు చత్తీస్ గఢ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పన్ను మినహాయింపు ఇచ్చింది. యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా తీసిన సందేశాత్మక చిత్రం ‘‘ఛపాక్’’ శుక్రవారం విడుదల కాబోతోంది. పన్ను మినహాయింపు ఇవ్వడంతో పాటు చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి ‘‘ఛపాక్’’ సినిమా చూడవలసిందిగా రాష్ట్ర ప్రజలను కోరారు.
2020-01-09 Read More‘భారతదేశం స్త్రీలను దేవతలుగా పూజించే పుణ్యభూమి’. ఇది చెప్పుకోవడం వరకు బాగానే ఉంది. కానీ, అత్యాచారాలకు కొదవలేదు. 2018లో రోజుకు 91 చొప్పున మానభంగాలు జరిగినట్టు జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్.సి.ఆర్.బి) గురువారం వెల్లడించింది. ఈ లెక్క కేవలం అధికారికంగా నమోదైన కేసులకు సంబంధించినదే. పోలీసు స్టేషన్ల వరకూ రానివి ఎన్నో తెలియదు. 2018లో రోజుకు 291 అపహరణలు, 80 హత్యలు జరిగాయి.
2020-01-09ఓ పాత ‘‘న్యూస్ పేపర్ క్లిప్పింగ్’’ మరోసారి సామాజిక మాథ్యమాల్లో విస్తృతంగా పంపిణీ అవుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 2001లో అమెరికాలో బోస్టన్ ఎయిర్ పోర్టులో మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డారన్నది ‘‘ఆ క్లిప్పింగ్’’లోని సారాంశం. ఆ వార్త అసత్యం. ఆ క్లిప్లింగ్ కూడా కృత్రిమంగా సృష్టించినదే.! ‘‘న్యూస్ పేపర్ క్లిప్పింగ్ జనరేటర్ వెబ్ సైట్’’ను ఉపయోగించి 2001 సెప్టెంబర్ 30న ఓ బోస్టన్ పత్రిక ప్రచురించినట్టుగా ఈ వార్తను సృష్టించారు.
2020-01-09 Read Moreబడికి వెళ్లే పిల్లలకు ఆర్థిక సాయం చేయడంకోసం తన పేరిటే రూపొందించుకున్న (జగనన్న అమ్మ ఒడి) పథకాన్ని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు పి.వి.కె.ఎన్. కళాశాల ఆవరణలో జరిగిన సభలో సిఎం మాట్లాడారు. ఈ పథకాన్ని చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్టు జగన్ ప్రకటించారు. చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఈ పథకాన్ని రూపొందించామని చెప్పారు.
2020-01-09ఏదో ఒక సాకు చెప్పి అమరావతి ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూస్తే కుదరదని మాజీ సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం మచిలీపట్నం బయలుదేరే ముందు విజయవాడ జెఎసి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ యాత్రను ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్నారు. ‘‘మీకు ధైర్యం ఉంటే... ప్రజల్లోకి వెళ్లి మీ వాదన వినిపించండి. అంతేగాని, శాంతిభద్రతల పేరుతో మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే ఆగేది లేదు. రెచ్చిపోతాం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
2020-01-09నిరసన తెలిపితే భయపడుతున్న జగన్మోహన్ రెడ్డి కంటే పిరికివాళ్ళు మరెవరూ ఉండరని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాను సిఎంగా ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ కూడా పాదయాత్ర చేశారని, ప్రజల్లోకి వెళ్లడానికి వారికి అనుమతి ఇచ్చామని గుర్తు చేశారు. కానీ, అమరావతికోసం ప్రజల్లోకి వెళ్తుంటే జగన్ అడ్డుకుంటున్నారని, ఇది పిరికితనమేనని చంద్రబాబు పేర్కొన్నారు.
2020-01-09‘‘క్షిపణి దాడి లక్ష్యం అమెరికన్లను చంపడం కాదు. మా సామర్ధ్యాన్ని ట్రంప్ కు చాటడమే’’ అని ఇరాన్ చెబుతోంది. ఉపగ్రహ చిత్రాలు దాన్ని రుజువు చేస్తున్నాయి. బుధవారం ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడికి సంబంధించి ఉపగ్రహ చిత్రాలను ‘ప్లానెట్ ల్యాబ్స్’ విడుదల చేసింది. అల్ అసద్ వైమానిక స్థావరంలోని పలు నిర్మాణాలను ఇరాన్ క్షిపణులు కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్టు ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
2020-01-09 Read Moreభారత దేశంలో అమెరికా రాయబారి సహా 15 మంది దౌత్య ప్రతినిధులు గురువారం ఉదయం శ్రీనగర్ చేరుకున్నారు. రెండు రోజులపాటు వారు జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన 370 అధికరణను రద్దు చేసి, రెండు కేంద్ర పాాలిత ప్రాంతాలుగా విడదీసిన కేంద్రం ఆగస్టులో తీవ్రమైన ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విదేశీ దౌత్యవేత్తలు తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
2020-01-09 Read Moreభారత ‘లోక్ పాల్’ వ్యవస్థలో భాగమైన సభ్యుడు జస్టిస్ డి.బి. భోసాలె తన పదవికి రాజీనామా చేశారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన భోసాలె ‘లోక్ పాల్’లో జ్యుడిషియల్ సభ్యుడిగా ఉన్నారు. జస్టిస్ భోసాలె 2019 మార్చి 27న సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనే సీనియర్ మోస్ట్ సభ్యుడు. ఈ రాజీనామాకు వ్యక్తిగత అంశాలే కారణమని చెబుతున్నారు.
2020-01-09మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదల ప్రజలను మరింత బాధించే అంశం. రిటైల్ ద్రవ్యోల్భణం 4 శాతానికి పరిమితం కావాలన్నది రిజర్వు బ్యాంకు మధ్యంతర లక్ష్యం కాగా వాస్తవంలో 6.2 శాతానికి పెరిగినట్టు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. గత ఐదేళ్ళలో ఇదే అత్యధికం. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కూరగాయల ధరలు. జనవరి 3-8 తేదీల్లో ‘రాయిటర్స్’ 50 మంది ఆర్థికవేత్తల అంచనాలను సేకరించింది. ద్రవ్యోల్భణం 7.01 శాతం ఉండొచ్చని కొందరి అంచనా.
2020-01-09 Read More