వన్డే క్రికెట్ ప్రపంచ కప్-2023 ఆస్ట్రేలియా వశమైంది. ఆదివారం అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన తుది సమరంలో భారత జట్టుపై ఆరు వికెట్ల తేతేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కంగారూలు టీమ్ ఇండియాను బాగా కట్టడి చేసి 240 పరుగులకే పరిమితం చేశారు. తర్వాత బ్యాటింగ్ లో తొలుత తడబడి 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా, భారత జట్టులో ఆశలను పెంచింది. అయితే, నాలుగో వికెట్ కు అసాధారణంగా 190కి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి సునాయాసంగా విజయం సాధించింది. ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలుచుకోవడం ఇది ఆరోసారి.
2023-11-19ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సాధారణ బెయిలు మంజూరైంది. గత నెల 31న మంజూరైన మధ్యంతర బెయిలునే రెగ్యులర్ బెయిలుగా మారుస్తూ సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లిఖార్జునరావు ఉత్తర్వులు వెలువరించారు. మధ్యంతర బెయిలుపై ఇప్పటికే జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుకు తాజా ఉత్తర్వు పెద్ద ఉపశమనం కలిగించింది. ఈ నెల 28న చంద్రబాబు తిరిగి జైలుకు వెళ్లవలసిన అవసరం లేదు. అయితే, మధ్యంతర బెయిలు ఉత్తర్వుల్లో పేర్కొన్న కొన్ని షరతులు 28వ తేదీవరకు వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది. అప్పటివరకు చంద్రబాబు రాజకీయ ర్యాలీలు నిర్వహించడానికి అవకాశం లేదు. చంద్రబాబు చ
2023-11-20పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కొత్తఅంబాపురంలో టీడీపీ నేత పత్తి రామారావు హత్యను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. రామారావును వై.సి.పి. రౌడీ మూక హత్య చేసిందన్న లోకేశ్, "పల్నాడును సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా జగన్ రెడ్డి?" అని ప్రశ్నించారు. వై.సి.పి.కి రోజులు దగ్గరపడే టి.డి.పి. కార్యకార్తలపై రోజుకో దాడి, హత్యలకు పాల్పడుతోందని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నెత్తుటి దాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్నారు.
2023-11-18మాల్దీవుల (Maldives) నుంచి భారత సైనిక దళాలను ఉపసంహరించాలని ఆ దేశ నూతన అధ్యక్షుడు మహ్మద్ ముయిజు (Mohamed Muizzu) అధికారికంగా భారత దేశాన్ని కోరారు. మాల్దీవుల అధ్యక్షుడిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ముయిజు భారత దళాలను వెనుకకు పంపుతానని మరోసారి ప్రతినబూనారు. సైనిక దళాల ఉపసంహరణ ద్వారా మాల్దీవుల ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను గౌరవించాలని అధ్యక్షుడు ఇండియాను కోరినట్లు ఆయన కార్యాలయం శనివారం వెల్లడించింది.
2023-11-18ఉచిత పథకాలను ఈసడించుకూనే బిజెపి అగ్ర నేతలు తెలంగాణ ఎన్నికల్లో వాటినే ఆశ్రయిస్తున్నారు. శనివారం వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మహిళలకు పలు ఉచితాలను ప్రకటించారు. అమ్మాయి పుట్టిన సందర్భంలో రూ. 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్, డిగ్రీ లేదా ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించే వారికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ఉజ్జ్వల యోజన కింద ఏటా 4 ఉచిత సిలిండర్లు, మహిళా స్వయం సహాయక బృందాలకు 1% వడ్డీ రేటుపై రుణాలు షా ఇచ్చిన హామీలలో ఉన్నాయి.
2023-11-18త్యాగాలు లేకుండా ఏ ఒక్క ప్రజకు విముక్తి లభించదని హమాస్ పొలిట్‌బ్యూరో చైర్మన్ ఖాలీద్ మషల్ ఉద్ఘాటించారు. “దేశాలు సులభంగా స్వాతంత్ర్యం పొందలేవు, హిట్లర్ దాడి నుండి తమను తాము విముక్తి గావించుకోడానికి రష్యన్లు రెండవ ప్రపంచ యుద్ధంలో 30 మిలియన్ల మందిని బలిదానం చేశారు. వియత్నామీయులు అమెరికన్లను ఓడించే వరకు 3.5 మిలియన్ల మందిని త్యాగం చేశారు. USSR మరియు USAని ఓడించడానికి ఆఫ్ఘనిస్తాన్ మిలియన్ల మంది అమరవీరులను త్యాగం చేసింది. అల్జీరియన్లు 130 ఏళ్లలో 6 మిలియన్ల మంది అమరవీరులను బలి ఇచ్చారు. పాలస్తీనియన్లు అన్నింటిలాగే ఒక జాతి." అని ఖాలిద్ వ్యాఖ్యానించారు.
2023-11-18జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్న ప్రజల సంక్షేమం రాష్ట్రంలో ఎక్కడా కనిపించడంలేదని సిపిఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ. గఫూర్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ చేపట్టిన జాతాల సందర్భంగా కష్టాలు చెప్పుకున్నవాళ్ళే తప్ప హాయిగా ఉన్నామన్నవాళ్ళు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం బుధవారం విజయవాడలో నిర్వహించిన ‘‘ప్రజారక్షణ భేరి’’ బహిరంగ సభలో గఫూర్ ప్రసంగించారు. కరువు, నిరుద్యోగంతో ప్రజలు పెద్ద ఎత్తున వలస పోతున్నారని, జగన్ ఆయన భజన బృందం మాత్రమే సుఖంగా ఉన్నారని పేర్కొన్నారు. ‘‘వైసిపి నాయకులు, కాంట్రాక్టర్లు, ప్రజాధనాన్ని కొల్లగొట్టేవారు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ఆక్రమించేవారు బాగ
2023-11-15ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బానిసలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు వ్యాఖ్యానించారు. దేశంలో మోదీ పీడను, రాష్ట్రంలో మోదీ బానిసల పీడను వదలించుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలో సిపిఎం నిర్వహించిన ‘‘ప్రజారక్షణ భేరి’’ బహిరంగ సభలో రాఘవులు ప్రసంగించారు. విభజన తర్వాత మొదటి ఐదేళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం, గత నాలుగున్నరేళ్ళలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేశాయని రాఘవులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. .
2023-11-15ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుమతి లేకుండా చంద్రబాబునాయుడును జైల్లో పెట్టే సాహసం సిఎం జగన్మోహన్ రెడ్డి చేయలేరని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఉద్ఘాటించారు. బుధవారం విజయవాడలో సిపిఎం నిర్వహించిన ‘‘ప్రజారక్షణ భేరి’’ బహిరంగ సభలో రాఘవులు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో బిజెపికి ఒక్క ఎంపి, ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల కంటే ఇక్కడే అత్యంత బలంగా ఉందని రాఘవులు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 3 ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఊడిగం చేయడమే అందుకు కారణమని దుయ్యబట్టారు. ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఆంధ్ర దేశానికి గతంలో ఎన్నడూ కలగలేదని వ్యాఖ్యానించా
2023-11-15ఢిల్లీలో మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. మంగళవారం హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో జరిగిన ఎన్నికల సభలో పవన్ ప్రధాని నరేంద్ర మోదీతో కలసి పాల్గొన్నారు. తన ప్రసంగంలో మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ దేశ ప్రయోజనాల కోసమే పని చేస్తారంటూ, ‘‘ఎన్నికల ప్రయోజనాల కోసమే అయితే ఆర్టికల్ 370ని రద్దు చేసేవారు కాదు, ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసేవారు కాదు. ఎన్నికల ప్రయోజనాల కోసమే అయితే రామమందిరం నిర్మించేవారు కాదు, పెద్ద నోట్లను రద్దు చేసేవారు కాదు’’ అని పవన్ వ్యాఖ్యానించారు. ప్రంపంచ దేశాలు మెచ్చేలా మోదీ విదేశాంగ విధానం ఉందని కీర్తించారు.
2023-11-07