తాము వ్యతిరేకించడంతో విశాఖపట్నం ‘మిలీనియం టవర్స్’లో సచివాలయాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విరమించుకుందని వచ్చిన వార్తలను భారత తూర్పు నావికా దళం ఖండించింది. ప్రభుత్వం నుంచి తమకు అలాంటి ప్రతిపాదనే రాలేదని, తాము ఎలాంటి అభ్యంతరాలనూ లేవనెత్తలేదని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తను తెలుగుదేశం నాయకులు అందిపుచ్చుకున్నారు. సాయంత్రానికి నేవీ వివరణ రావడంతో అధికార వైసీపీ ఊపిరి పీల్చుకుంది.
2020-02-22గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకోసం అంటూ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’పై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. ‘‘జీవో 344 వైసీపీ వేధింపులకు పరాకాష్ఠ. గత ఐదేళ్ల నిర్ణయాలపై మీరు‘సిట్’ వేశారు. మీ ఐదేళ్ళ పాలనపై వచ్చే ప్రభుత్వం ‘సిట్’ వేస్తుంది. కక్ష సాధించుకోవడం తప్ప ప్రజలకు ఒరిగేది ఏంటి’’ అని ఆయన ప్రశ్నించారు. 8 నెలల క్రితం మంత్రివర్గ ఉపసంఘం వేసి.. పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించారని మండిపడ్డారు. టీడీపీ నేతలపై కక్ష సాధింపే వైసీపీ ఎజెండా అని విమర్శించారు.
2020-02-22గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకోసం ఏర్పాటు చేసిన ‘సిట్’కు విస్తృత అధికారాలు కల్పించింది జగన్ ప్రభుత్వం. దర్యాప్తులో భాగంగా సీఆర్పీసీ ప్రొవిజన్ల కింద ఏ వ్యక్తినైనా లేక అధికారినైనా పిలిచి విచారించడానికి, వారి స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి ‘సిట్’కు అధికారం ఉంటుంది. విచారణాంశాలు లేదా భూ లావాదేవీలపై ఎలాంటి రికార్డులనైనా తెప్పించుకొని తనిఖీ చేయవచ్చు. ‘సిట్’ విధుల్లో... విచారణ, కేసులు నమోదు, దర్యాప్తు భాగం. కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమాచార మార్పిడి, సమన్వయం సహా అనేక అంశాలపై ఈ ‘సిట్’ ఓ నోడల్ ఏజన్సీలా పని చేస్తుంది.
2020-02-21గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకోసం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’లో సభ్యులు వీరే...1. కొల్లి రఘురాంరెడ్డి, ఇంటెలిజెన్స్ డిఐజి, 2. అట్టాడ బాబూజీ, విశాఖ ఎస్పీ, 3. వెంకట అప్పలనాయుడు, ఇంటెలిజెన్స్ ఎస్పీ, 4. శ్రీనివాసరెడ్డి, కడప అదనపు ఎస్పీ, 5. జయరామరాజు, ఇంటెలిజెన్స్ డి.ఎస్.పి, 6. విజయభాస్కర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెట్ డి.ఎస్.పి, 7. ఎం. గిరిధర్, ఇంటెలిజెన్స్ డి.ఎస్.పి, 8. కెన్నెడీ, ఇన్స్పెక్టర్, ఏలూరు రేంజ్, 9. ఐ. శ్రీనివాసన్, ఇన్స్పెక్టర్, నెల్లూరు జిల్లా, 10. ఎస్వీ రాజశేఖరరెడ్డి, ఇన్స్పెక్టర్, గుంటూరు జిల్లా.
2020-02-21గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలు, స్థాపించిన సంస్థల్లో అక్రమాలపై విచారణకోసం జగన్ ప్రభుత్వం 10 మంది పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇంటెలిజెన్స్ డీఐజీ డాక్టర్ కొల్లి రఘురాంరెడ్డి ఈ ‘సిట్’కు నేతృత్వం వహించనున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన తొలి నివేదిక ఆధారంగా ‘సిట్’ దర్యాప్తు జరుపుతుంది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ బుగ్గన కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.
2020-02-21బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులైన రామజన్మభూమి న్యాస్ చీఫ్ నృత్యగోపాల్ దాస్, విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు చంపత్ రాయ్ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఛైర్మన్, ప్రధాన కార్యదర్శులుగా ఎంపికయ్యారు. కేంద్రం ప్రకటించిన ట్రస్టు తొలి సమావేశం బుధవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాది పరాశరన్ ఇంట్లో జరిగింది. ముందే నిర్ణయమైన వారిద్దరి పేర్లనూ చివరివరకు ట్రస్టు సభ్యుల్లో చేర్చలేదు. బుధవారం నాటి సమావేశానికి కూడా వారు ఆహ్వానితులుగానే హాజరయ్యారు. వారిద్దరూ ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు.
2020-02-20 Read Moreసుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరిట తీసుకున్న రుణం తిరిగి చెల్లించనందుకు గాను ఎం.పి. సుజనా చౌదరి ఆస్తుల వేలానికి బ్యాంకు నోటీసు ఇచ్చింది. రూ. 400 కోట్ల రుణం ఎగవేతకు సంబంధించి.. చౌదరి సహా 10 మంది గ్యారంటీర్లుగా ఉన్నారు. మార్చి 23న వారి ఆస్తులను వేలం వేయనున్నట్టు చెన్నై బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ బ్రాంచ్ గురువారం పత్రికల్లో ప్రకటించింది. ఆసక్తి ఉన్నవాళ్లు మార్చి 20న ఆస్తులు తనిఖీ చేసుకోవచ్చని, ఆ తర్వాత రోజే బిడ్లు దాఖలు చేయాలని ఇ-ఆక్షన్ నోటీసులో సూచించింది.
2020-02-20కంప్యూటర్ కీ బోర్డుపై ‘కట్/కాపీ, పేస్ట్’ కమాండ్ల సృష్టికర్త లారీ టెస్లర్ (74) మరణించారు. ఆయన కనుగొన్న అంశాలతో అందరూ కంప్యూటర్ నేర్చుకోవడం తేలికైంది. 1945లో న్యూయార్క్ లోని బ్రాంగ్జ్ లో జన్మించిన టెస్లర్, స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో చదివారు. అమెరికాలో జనసామాన్యానికి కంప్యూటర్ అందుబాటులోకి రాని 1960లలో టెస్లర్ సిలికాన్ వ్యాలీలో పని చేశారు. ‘యూజర్ ఇంటర్ ఫేస్ డిజైన్’లో ప్రత్యేకత సాధించారు. జెరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్ (పార్క్)తో ప్రారంభమైన ఆయన కెరీర్ అనేక టెక్నాలజీ సంస్థల్లో సుదీర్ఘంగా సాగింది.
2020-02-20ఎమ్మెల్యేలు, అధికారులపై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికార వైసీపీ శాసనసభ్యురాలు ఆర్.కె. రోజా హెచ్చరించారు. గురువారం రాజధాని రైతులు ఆమె కారును అడ్డగించిన నేపథ్యంలో విలేకరులతో మాట్లాడారు. రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తోందని ఆరోపించారు. ‘‘వాళ్ళ సామాజిక వర్గంతో చేయిస్తున్న దాడులు తప్ప మరొకటి కావు’’ అని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చెప్పినట్టు 2018 నాటికి శాశ్వత భవనాలను కట్టి ఉండేవారని విమర్శించారు.
2020-02-20రాజధాని గ్రామాల్లో ఆందోళనలు ‘పెయిడ్ ఆర్టిస్టు’ల పనేనన్న ఎమ్మెల్యే ఆర్.కె. రోజాకు నిరసనల సెగ తగిలింది. గురువారం రోజా ఐనవోలు లోని ఎస్.ఆర్.ఎం. యూనివర్శిటీలో ఓ సదస్సుకు హాజరైన విషయం తెలిసి మహిళా రైతులు అక్కడికి చేరుకున్నారు. ఆమె తిరిగి వెళ్లే సమయంలో కారును అడ్డుకున్నారు. అక్కడ రైతులను తప్పించి పోలీసులు రోజాను పంపించినా...పెదపరిమి వద్ద మరోసారి ఆమె వాహనాన్ని అడ్డగించారు. భారీగా మోహరించిన పోలీసులు రోడ్డుపై బైఠాయించిన రైతులను తొలగించి రోజాకు దారి ఇచ్చారు.
2020-02-20