రాజధాని అమరావతిలో భూముల ‘ఇన్సైడర్ ట్రేడింగ్’పై సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ బుధవారం తీర్మానించింది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం విచారణ జరిపి టీడీపీ నేతలు 4070 ఎకరాలు కొనుగోలు చేశారంటూ నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణ కోసం స్వయంగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఓ స్వతంత్ర సంస్థతో విచారణ జరిపిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
2020-01-22పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వ వాదన వినకుండా స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్రం స్పందించడానికి 4 వారాలు సమయం ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బాబ్డే, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన బెంచ్ ఈ అంశాన్ని ఐదు వారాల తర్వాత మళ్ళీ విననుంది. రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం అవసరమా లేదా? అనే విషయంపై నిర్ణయం తీసుకోనుంది.
2020-01-22ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మంగళవారం ఉదయం నుంచి నెలకొన్న ప్రతిష్ఠంభన వీడింది. రాజధాని ‘వికేంద్రీకరణ’ బిల్లును, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సి.ఆర్.డి.ఎ) రద్దు బిల్లును మంగళవారం రాత్రి మండలిలోనూ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అధికార పార్టీకి మండలిలో మెజారిటీ లేకపోవడంతో... ఈ బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ రూల్ 71ను ప్రయోగించింది. వాగ్వివాదాలు, వాయిదాలు, చర్చల తర్వాత బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఛైర్మన్ షరీఫ్ అనుమతించారు.
2020-01-21ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో ఒక్క ముంబై నగరం వాటానే 37 శాతం. అది దేశ వాణిజ్య రాజధాని మరి! ఏటేటా పెరుగుతున్న ప్రత్యక్ష పన్నుల మొత్తం ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. జనవరి మొదటి పక్షంలో పన్ను వసూళ్ళు 13 శాతం తగ్గాయి. డిసెంబరులో 4 శాతం తగ్గాయి. జనవరిలో ‘డబుల్ డిజిట్ పతనం’ అధికారులను కలవరపెడుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి దేశవ్యాప్తంగా వసూలైన ప్రత్యక్ష పన్నుల మొత్తం రూ. 9 లక్షల కోట్లను దాటలేదని తెలుస్తోంది.
2020-01-21 Read Moreనిన్న పోలీసుల దాడికి గురై జైలుకు వెళ్లిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మంగళవారం బెయిలుపై విడుదలయ్యారు. సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన జయదేవ్ ను పోలీసులు నిర్భంధించారు. పోలీసుల బల ప్రయోగంలో జయదేవ్ గాయపడ్డారు. తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నారో... ఏ కేసు పెట్టారో చెప్పకుండా రాత్రి చాలా సేపు వివిధ ప్రాంతాల్లో తిప్పారు. మంగళవారం వేకువజామున రిమాండుకు పంపగా.. మంగళగిరి కోర్టు మధ్యాహ్నం బెయిలు మంజూరు చేసింది.
2020-01-21రాజధానిని వైసీపీ ప్రభుత్వం ఎక్కడికి తరలించినా తిరిగి అమరావతికి తెస్తామని, 3 కాకుండా 30 చోట్ల ఏర్పాటు చేసినా ఏకం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. అమరావతే శాశ్వత రాజధాని అంటేనే తాను బీజేపీతో కలుస్తానని చెప్పానని, అందుకు ఆ పార్టీ అంగీకరించిందని మంగళవారం రాజధాని మహిళలతో చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం మనుషులను తీసుకెళ్లి ఎక్కడైనా కూర్చోబెట్టవచ్చని, కానీ రాజధానిని తరలించలేదని నొక్కి చెప్పారు.
2020-01-21వికేంద్రీకరణ పేరిట రాజధానిని విశాఖపట్టణానికి తరలించే బిల్లును నిన్న శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో మంగళవారం అమరావతి స్తంబించింది. రాజధాని ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా మరోసారి బంద్ నిర్వహించారు. పోలీసులు అణచివేతకు దిగినందున వారికి తాగునీరు సహా ఏమీ ఇవ్వకూడదని నిరసనకారులు నిర్ణయించారు. నిరసన శిబిరాల వద్ద రాజధాని తరలింపు బిల్లు ప్రతులను దగ్ధం చేశారు.
2020-01-21రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్టణానికి తరలించే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన ‘వికేంద్రీకరణ’ బిల్లుకు శాసన మండలిలో తాత్కాలిక అవరోధం ఎదురైంది. ఈ బిల్లు కంటే ముందు... దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ రూల్ 71 కింద ఇచ్చిన నోటీసుపై చర్చకు ఛైర్మన్ షరీఫ్ అనుమతించారు. మండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది. ఛైర్మన్ కూడా తెలుగుదేశం హయాంలో ఎన్నికయ్యారు. దీంతో... ప్రభుత్వానికి కొంత తలనొప్పి తప్పడంలేదు.
2020-01-21రాజధాని తరలింపు వెనుక లక్ష్యం ఉత్తరాంధ్ర అభివృద్ధి కాదని, విశాఖపట్నం భూములేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు రూ. 1400 కోట్లు ఇచ్చుకున్నాడంటూ ‘అందులో 700 కోట్లు ఉత్తరాంధ్రకు ఎందుకు ఇవ్వలేదు’ అని ప్రశ్నించారు. ఆ 1400 కోట్లు రాయలసీమ మొత్తానికి ఇచ్చినా సంతోషించేవారమని కన్నా పేర్కొన్నారు. సోమవారం రాత్రి ‘రాజధాని తరలింపు’ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కన్నా మాట్లాడారు.
2020-01-21రాజధాని తరలింపు విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలన్న టీడీపీ విన్నపానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఘాటుగా స్పందించారు. ‘కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తే టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా’ అని ప్రశ్నించారు. అమరావతి పరిరక్షణ విషయంలో టీడీపీ విఫలమైందని విమర్శించారు. 33 వేల ఎకరాలు సమీకరించానని గొప్పలు చెప్పుకొంటున్న చంద్రబాబునాయుడు.. ఐదు శాశ్వత భవనాలు కట్టలేని చేతగానివాడిగా చరిత్రలో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.
2020-01-21