ప్రభుత్వ, ప్రైవేటు లేబొరేటరీలు అన్నిటిలోనూ ‘కరోనా’ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలన్న తీర్పును సుప్రీంకోర్టు సవరించింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి అర్హులైనవారికి మాత్రమే ఉచిత పరీక్షల తీర్పును పరిమితం చేసింది. ఈ పథకం లబ్దిదారులు (10.7 కోట్ల కుటుంబాలు) ప్రైవేటు లేబొరేటరీలలో ఉచిత పరీక్షలు చేయించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. అందరికీ ఉచితంగానే పరీక్షలు నిర్వహించాలని ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పు ‘కరోనా’పై పోరాటానికి అవరోధమని ఐసిఎంఆర్ అభిప్రాయపడింది.
2020-04-13తెలంగాణలో 246 ప్రాంతాలను నియంత్రిత జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులో 126 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోవే!. కరోనా వైరస్ సోకినవారిలో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే కావడంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. భాగ్యనగరంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఒక్కో జోన్ ను ఒక్కో యూనిట్ గా పరిగణించి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. కేసులు పెరుగుతున్నందున ఇళ్ళలోనుంచి బయటకు రావద్దని కేసీఆర్ ప్రజలకు విన్నవించారు.
2020-04-13‘కరోనా’పై పోరాడి కోలుకున్నవారి రక్తాన్ని ఇతర ‘కోవిడ్19’ రోగులకు చికిత్సలో ఉపయోగించవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఓ కరోనా పాజిటివ్ పేషెంట్ కోలుకున్నాడంటే.. అతని శరీరం వైరస్ తో యుద్ధం చేసి ఉంటుందని, ఆ యుద్ధంకోసం ఉత్పత్తి అయిన ‘యాంటీబాడీస్’ అతని రక్తంలో ఉంటాయని గులేరియా వివరించారు. వ్యాధి నయమైన వారి రక్తాన్ని ఉపయోగించి వైరస్ పేషెంట్లలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచవచ్చని ఆయన పేర్కొన్నారు. కోవిడ్19 రోగులకు చికిత్సలో ప్లాస్మా మార్పిడి ఒక ప్రత్యామ్నాయమని తెలిపారు.
2020-04-13 Read Moreతనను అర్ధాంతరంగా తప్పించడాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఇసి)గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో సవాలు చేశారు. ఎస్ఇసి పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్ళకు కుదిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును, అందుకు అనుగుణంగా జారీ అయిన జీవోలను కొట్టివేయాలని ఆయన కోరారు. రాజ్యాంగంలోని 243 కెె(2) అధికరణం ప్రకారం.. తన పదవీ కాలాన్ని కుదించడానికి వీల్లేదని వాదించారు. సాధారణ పరిపాలనా శాఖ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు కొత్త ఎస్ఇసిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ వి. కనగరాజ్ ను కూడా ప్రతివాదిగా చేర్చారు. రమేష్ కుమార్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
2020-04-11కరోనా వైరస్ సోకినవారికి చికిత్స అందించేవారే వ్యాధి బారిన పడుతున్నారు. బుధవారం (ఏప్రిల్ 8) వరకు 52 దేశాల్లో 22,073 మంది వైద్య సిబ్బంది ‘కరోనా’ బారిన పడినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) వెల్లడించింది. ఈ సంఖ్య వాస్తవ బాధితుల కంటే తక్కువేనని, వైద్య సిబ్బంది కేసులను నమోదు చేసేందుకు నిర్దేశిత పద్ధతేమీ లేకపోవడంవల్ల అన్నీ రిపోర్టు కావడంలేదని పేర్కొంది. వైద్య సిబ్బందికి మెరుగైన పని వాతావరణం కల్పించడం ద్వారా.. వారి హక్కులను పరిరక్షించాలని ప్రపంచ దేశాలకు సూచించింది. వ్యక్తిగతంగా భద్రతకోసం మాస్కులు, గాగుల్స్, గౌన్లు, గ్లోవ్స్ సవ్యంగా వాడాలని సూచించింది.
2020-04-12‘కరోనా’ మహమ్మారి అమెరికాలో మరణ మృదంగం మోగిస్తోంది. శనివారానికి ఆ దేశంలో 20,602 మంది వైరస్ కారణంగా చనిపోయారు. అగ్ర రాజ్యం ‘కరోనా’ మరణాల సంఖ్యలో తాజాగా ఇటలీ (19,468 మరణాల)ని దాటిపోయింది. శుక్ర, శని వారాల్లో సగటున 2 వేలకు పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. 5,29,740 వైరస్ పాజిటివ్ కేసులతో అమెరికా మరే దేశానికీ అందనంత ఎత్తులో ఉంది. రెండో స్థానంలో ఉన్న స్పెయిన్ లో 1,63,027 వైరస్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో మరణాల రేటు కూడా రోజురోజుకూ పెరుగుతోంది. శనివారానికి వైరస్ సోకినవారిలో 3.89 శాతం చనిపోయారు.
2020-04-12‘ఇంటినుంచే పని’కి స్వస్తి పలికి కార్యాలయాలకు వెళ్ళాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన సహచర మంత్రులను ఆదేశించారు. సోమవారం బైశాఖి తర్వాత, మంగళవారం (అంబేద్కర్ జయంతి) నుంచి కార్యాలయాలకు హాజరు కావాలని సూచించారు. మార్చి 24న ప్రారంభమైన 21 రోజుల ‘దేశ దిగ్బంధం’ అదే రోజున (ఏప్రిల్ 14న) ముగియనుంది. సంయుక్త కార్యదర్శులు, ఆ పైస్థాయి అధికారులు కూడా పనికి హాజరు కావాలని పిఎం ఆదేశించారు. అయితే, అందరూ కార్యాలయాల్లో ‘సాంఘిక దూరం’ పాటించాలని స్పష్టం చేశారు. కొన్ని అంశాల్లో ‘లాక్ డౌన్’ సడలిస్తారనడానికి ఇదో సూచికగా భావిస్తున్నారు.
2020-04-11అమెరికా.. అందులో న్యూయార్క్ నగరం ‘కరోనా’ ధాటికి కకావికలమయ్యాయి. ఆ నగరంలోనే 5,820 మంది ‘కరోనా’కు బలయ్యారు. ఆ మరణ మృదంగం ఇంకా ఆగలేదు. దీంతో పాఠశాలలను సెప్టెంబరు వరకూ మూసే ఉంచనున్నట్టు న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో శనివారం చెప్పారు. అంటే.. మిగిలిన విద్యా సంవత్సరమంతా పాఠశాలలు లేనట్టే. ‘కరోనా’ కేసులు పెరుగుతుండటంతో గత నెలలో పాఠశాలలను (ఏప్రిల్ వరకు) మూసివేశారు. న్యూయార్క్ పాఠశాలల వ్యవస్థ దేశంలోనే అతిపెద్దది. 1800 పాఠశాలల్లో 11 లక్షల మంది చదువుతున్నారు.
2020-04-11ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని సూరత్ నగరంలో వలస కార్మికుల ఆకలి మంటలు విధ్వంసానికి దారి తీశాయి. శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో వలస కూలీలు లక్సానా ప్రాంతంలో రోడ్లెక్కారు. తోపుడు బండ్లు, మరికొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. తమకు అందిస్తున్న ఆహారం తినలేని విధంగా ఉందని, దానికోసమూ క్యూలో చాలాసేపు వేచిచూడాల్సి వస్తోందని వారు మండిపడ్డారు. వారిలో ఎక్కువమంది ఒడిషాకు చెందినవారు. తమను సొంత ప్రాంతాలకు పంపించాలని వారు డిమాండ్ చేశారు. అయితే, విధ్వంసానికి దిగారంటూ 90 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
2020-04-11ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఇసి)గా మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. కనగరాజ్ నియమితులయ్యారు. రమేష్ కుమార్ ను తొలగించేందుకు కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్ళకు కుదిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన జగన్ ప్రభుత్వం, ఇకపైన హైకోర్టు మాజీ న్యాయమూర్తులనే నియమించేలా చట్టానికి మార్పు చేసింది. తమిళనాడుకు చెందిన కనగరాజ్ 1997లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై తొమ్మిదేళ్లపాటు పని చేశారు.
2020-04-11