రాష్ట్రంలో పోలీసు ఉగ్రవాదం పెరిగిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలీసులే ప్రతిపక్షాల నేతలను బెదిరిస్తున్నారని, బైండోవర్ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఖాకీ డ్రెస్ వేసుకొని ఇలాంటి తప్పుడు పనులు చేయడం నీచమని చంద్రబాబు డీజీపీపై విరుచుకుపడ్డారు. ‘‘నామినేషన్లతో మీకేం సంబంధం’’ అని ప్రశ్నించారు. పోలీసుల తీరు ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడతారని, వారి ముఖాన ఉమ్మేసే పరిస్థితి వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
2020-03-142019 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి రూ. 18,564 కోట్ల నష్టాన్ని ప్రకటించింది సంక్షుభిత ‘ఎస్’ బ్యాంకు. 2018 డిసెంబరు త్రైమాసికంలో బ్యాంకు రూ. 1001 కోట్ల లాభాన్ని చూపించింది. 2019 చివరికి బ్యాంకు పారు బకాయిలు రూ. 40,709 కోట్లకు పెరిగాయి. మొత్తం రుణాల్లో ఇవి 18.87 శాతం. వాటి సర్దుబాటు కోసం బ్యాంకు ఏకంగా రూ. 24,765.73 కోట్లు కేటాయించింది. దీంతో కేపిటల్ భారీగా తగ్గిపోయింది. 2019 సెప్టెంబరు 30 నాటికి రూ. 2.09 లక్షల కోట్లుగా ఉన్న బ్యాంకు డిపాజిట్లు డిసెంబర్ నాటికి రూ. 1.65 లక్షల కోట్లకు తగ్గాయి.
2020-03-15 Read More‘కరోనా వైరస్’కి మందు అంటూ గోమూత్రంతో పార్టీ ఏర్పాటు చేశారు అఖిల భారత హిందూ మహాసభ చీఫ్ చక్రపాణి. శనివారం దేశ రాజధానిలో నిర్వహించిన ఈ తంతులో గోమూత్రాన్ని కలిపిన పాయసం వంటి పదార్ధాన్ని తాగారు. ఇలాంటివి దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని ఆ సంస్థ చెబుతోంది. గోమూత్రంతో రోగాలు పోవని ఎంతమంది చెప్పినా.. మత సంస్థలు మాత్రం అందులో ఔషధ గుణాలున్నాయని ప్రచారం చేస్తున్నాయి. ‘‘కరోనా.. మాంసాహారులైన చైనీయులను శిక్షించడానికి వచ్చిన మరో అవతారం’’ అన్న చక్రపాణి (శాఖాహారి), ఇప్పుడు ‘కరోనా’కు మందు (గోమూత్రం) తీసుకోవడం గమనార్హం.
2020-03-14 Read More‘కరోనావైరస్’ను విపత్తుగా గుర్తిస్తూ.. మృతుల కుటుంబాలకు ఎస్.డి.ఆర్.ఎఫ్. నుంచి రూ. 4 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్ర హోం శాఖ, కొద్ది గంటల్లోనే ఆ ఉత్తర్వులను మార్చింది. తాజా సర్క్యులర్ నుంచి పరిహారం క్లాజును తొలగించింది. వైరస్ సోకినవారికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించే రేట్ల ప్రకారం వైద్యానికి సాయం చేయాలని తొలి సర్క్యులర్ లో పేర్కొన్న కేంద్రం.. తాజా సర్క్యులర్లో ఆ అంశాన్ని కూడా తొలగించింది. వచ్చే 30 రోజుల పాటు ‘కరోనా వైరస్’ను సమర్ధవంతంగా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించింది.
2020-03-14‘కరోనా’ యూరప్ దేశాలను గడగడ వణికిస్తోంది. డెన్మార్క్ లో శనివారం తొలి మరణం నమోదైంది. చైనా తర్వాత ఇటలీలోనే అత్యధికంగా కేసులు (సుమారు 18 వేలు) నమోదు కాగా, స్పెయిన్ దేశంలో గత 24 గంటల్లోనే 1,500 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి స్పెయిన్ మొత్తం కేసుల సంఖ్య 5,750కి చేరింది. వార్తా సంస్థ ఎ.ఎఫ్.పి. ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ‘కరోనా’ కేసుల సంఖ్య లక్షన్నర దాటింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సరిహద్దులను మూసివేశాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులను పరిమితం చేశాయి. మంత్రులు, ఎంపీలు, సెలబ్రిటీలు వైరస్ బారిన పడుతున్నారు.
2020-03-14అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ‘కరోనా’ పరీక్ష చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గత రాత్రి ఈ పరీక్ష నిర్వహించారని, ఫలితం కోసం ఎదురు చూస్తున్నానని ఆయన చెప్పారు. శనివారం స్వేతసౌధంలో ‘కరోనా’పై సమీక్ష నిర్వహించిన అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ట్రంప్ కొద్ది రోజుల క్రితం బ్రెజిల్ దేశాధ్యక్షుడితోనూ, ఆయన మీడియా కార్యదర్శితోనూ భేటీ అయ్యారు. తర్వాత ఆ మీడియా కార్యదర్శికి ‘కరోనా పాజిటివ్’ తేలింది. ఈ నేపథ్యంలో.. శనివారం ఓ విలేకరికి 99.9 డిగ్రీల జ్వరం ఉన్న కారణంగా ట్రంప్ ప్రెస్ మీట్ కు అనుమతించలేదు.
2020-03-14‘కరోనా వైరస్’ సోకినట్టు ఆరోగ్య శాఖ నిర్ధారిస్తేనే రాయాలని, మిగిలినవి రాస్తే సహించబోమని తెలంగాణ సిఎం కేసీఆర్ మీడియాను.. ప్రత్యేకించి టీవీ ఛానళ్లను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. సామాజిక మాథ్యమాల్లో కొంతమంది అతిగా రాస్తున్నారని, టీవీ ఛానళ్లలోనూ కొన్ని అతి చేస్తున్నాయని, అది కొనసాగితే ప్రభుత్వం అంటే ఏంటో చూస్తారని కేసీఆర్ హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛకు తాము భంగం కలిగించబోమని, అయితే.. ఈ విషయంలో అనవసర భయోత్పాతం సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చెప్పినా వినకపోతే అనుభవిస్తారనీ వ్యాఖ్యానించారు.
2020-03-14రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ప్రజలు గుమి కూడే అన్ని ప్రాంతాలనూ మూసివేయాలని, సెమినార్లు-సభలు సహా అన్ని ఈవెంట్లనూ మానుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. ఆర్టీసీ, మెట్రో రైలు, సూపర్ మార్కెట్లు, మాల్స్ మాత్రమే పని చేస్తాయని ఆయన చెప్పారు. ఇప్పటికే ముహూర్తాలు పెట్టుకున్న పెళ్లిళ్లను 31వరకు అనుమతించాలని, ఆ తర్వాత పెళ్లిళ్ళు కూడా వద్దని, ఎవరూ కళ్యాణ మండపాలను ఇవ్వొద్దని కేసీఆర్ హుకుం జారీ చేశారు. సినిమా హాళ్ళు, క్లబ్బులు, ప్రైవేటు కోచింగ్ సెంటర్లు సహా అన్నీ మూతపడాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
2020-03-14‘కరోనా’పై పోరాటానికి రూ. 500 కోట్లు కేటాయించినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. శనివారం రాత్రి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధిలో ఉంటాయని, అవసరం మేరకు విడుదల చేస్తారని చెప్పారు. ‘కరోనా’కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో 1020 ప్రత్యేక పడకలు ఏర్పాటు చేశామని, మరో 321 ఐసియు పడకలు, 240 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. వివిధ ప్రాంతాల్లో నాలుగు క్వారంటైన్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని కేసీఆర్ చెప్పారు.
2020-03-14మధ్యప్రదేశ్ మంత్రివర్గం నుంచి నిన్న ఉధ్వాసనకు గురైన ఆరుగురు (మాజీ) మంత్రుల ఎమ్మెల్యే పదవులూ ఊడిపోయాయి. వారు శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి శనివారం ఆమోదించారు. జ్యోతిరాదిత్య సింధియాకు మద్ధతుగా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేలలో ఈ ఆరుగురు ఉన్నారు. ఆ రాజీనామాలతో కమలనాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అయితే, శుక్రవారం ముఖ్యమంత్రి కమలనాథ్ సూచన మేరకు ఆయా మంత్రులను గవర్నర్ లాల్జీ టాండన్ తొలగించారు. మిగిలిన ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు సాగుతున్నాయి.
2020-03-14