ఆర్టీసీలో కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటే హైకోర్టు కొడుతుందా? అని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అనూహ్యమైన ప్రశ్న వేశారు. సెప్టెంబర్ జీతాలు ఇవ్వలేదని ఒక యూనియన్ పిటిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ కేసీఆర్ ఈ వ్యాఖ్య చేశారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి పండుగ సమయంలో రోజుకు రూ. 100 కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చేదని, అదే సమయంలో సమ్మె చేయడం ద్వారా అదనపు నష్టాన్ని తెచ్చి పెట్టారని మండిపడ్డారు. యూనియన్లు లేకుండా ఆర్టీసీ సరిగ్గా పని చేస్తే లక్ష రూపాయలు బోనస్ తీసుకునే పరిస్థితి వస్తుంది.
2019-10-24ఆర్టీసీ సమ్మె ముగియడం కాదని, ఆర్టీసీనే ముగిసిపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనియన్ ఎన్నికల్లో ఓట్లకోసం ప్రతిసారీ చేసే చిల్లర రాజకీయాల్లో భాగంగానే ఈ సమ్మె జరుగుతోందని కేసీఆర్ ఆరోపించారు. నాలుగేళ్లలో జీతాలు 67% పెంచిన ఆర్టీసీ మరే రాష్ట్రంలోనైనా ఉందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. తిన్నది అరగక సమ్మె చేస్తున్నారా? అని కూడా కేసీఆర్ మండిపడ్డారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో విజయం నేపథ్యంలో కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.
2019-10-24మహారాష్ట్రలో శరద్ పవార్ పని అయిపోయిందని, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని అసెంబ్లీ ఎన్నికలకు ముందు విశ్లేషణలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో కూడా ఎన్సీపీని చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఫలితాలు చూస్తుంటే ఈ అంచనాలు పూర్తిగా తల్లికిందులైనట్టు అర్ధమవుతోంది. అధికార కూటమిలోని శివసేనకు ధీటుగా, మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకంటే ఎక్కువగా సుమారు 55 సీట్లు సాధించబోతోంది. మరాఠా రాజకీయ యోధుడు పవార్ (79) వయోభారానికి అనారోగ్యం తోడైందేమో కానీ, పవర్ మాత్రం తగ్గలేదని నిరూపించారు.
2019-10-24హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీకి పరాభవం మిగిలింది. పోలైన ఓట్లలో ఒక్క శాతం కూడా ఆ పార్టీ తెచ్చుకోలేకపోయింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అవుతామంటున్న బీజేపీ కూడా చతికిలపడింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి చావా కిరణ్మయికి కేవలం 1,827 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్ధికి 2,621 ఓట్లు (సుమారు 1.3 శాతం) వచ్చాయి. ఈ రెండు పార్టీల అభ్యర్ధులూ డిపాజిట్ కోల్పోయారు. విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి 1,12,796 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి పద్మా ఉత్తమ్ రెడ్డికి 69,563 ఓట్లు లభించాయి.
2019-10-24తెలంగాణలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార టి.ఆర్.ఎస్. పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్ధి పద్మా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన టిఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి ఏకంగా 43,624 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత తమకు లాభిస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీకి నిరాశే ఎదురైంది. ఎంపీగా ఎన్నికైన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఖాళీ చేసిన స్థానంలో ఆయన భార్యే పోటీ చేశారు. ఈ ఓటమి ‘ఉత్తమ్’కు వ్యక్తిగతంగా కూడా దెబ్బగా భావిస్తున్నారు.
2019-10-24మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయాన్ని సాధిస్తుందని చెప్పిన జోస్యాలు విఫలమయ్యాయి. సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిశాక అరడజను ప్రముఖ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమికి 204 నుంచి 243 వరకు సీట్లు వస్తాయని ఊహించాయి. కాంగ్రెస్-ఎన్.సి.పి. లను మరీ తీసి పారేశాయి. అయితే, ఫలితాలు అందుకు భిన్నంగా... రెండు కూటములకు సుమారు 160, 100 వచ్చేలా ఉన్నాయి. హర్యానాలో హంగ్ రావచ్చని ఒక్క ‘ఇండియా టుడే’ మాత్రమే చెప్పింది.
2019-10-24హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఫలితాలు హంగ్ దిశగా వస్తున్నాయి. అసెంబ్లీలోని 90 సీట్లలో ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభమైంది. మధ్యాహ్నానికి అందిన సమాచారం ప్రకారం 37 అసెంబ్లీ సీట్లలో బీజేపీ, 35 సీట్లలో కాంగ్రెస్, 15 సీట్లలో ఇతరులు ముందంజలో ఉన్నాయి. మహారాష్ట్రలో మళ్లీ ఎన్డీయే జెండా ఎగురుతోంది. అసెంబ్లీలోని 288 సీట్లకుగాను బీజేపీ-శివసేన కూటమి 161 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్-ఎన్.సి.పి. కూటమి 100 సీట్లను గెలిచే దిశగా పయనిస్తున్నాయి.
2019-10-24ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 నివేదికలో ఇండియా 63 వ స్థానానికి మెరుగుపడింది. 2019 నివేదికలో ఇండియాది 77వ స్థానం. ఈ ఏడాది 14 స్థానాలు మెరుగైనా, ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టుగా టాప్ 50లోకి వెళ్ళలేకపోయింది. పది పరామితుల ఆధారంగా 190 దేశాలకు ర్యాంకులు కేటాయించారు. ఇందులో వ్యాపారం ప్రారంభించడం, నిర్మాణ అనుమతులు, విద్యుత్ పొందడం, క్రెడిట్ పొందడం, పన్నులు చెల్లించడం, సరిహద్దుల్లో వ్యాపారం, ఒప్పందాలను అమలు చేయడం, దివాలా తీయడం వంటివి ఉన్నాయి.
2019-10-24ఆశ్చర్యకరంగా... ఇండియాలో రెండు ప్రధాన వివాదాస్పద అంశాలపై అమెరికా కాంగ్రెస్ చర్చించింది. జమ్మూ కాశ్మీర్ ప్రజలపై విధించిన అంక్షలు, అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి) ప్రచురణ నేపథ్యంలో ఇండియాలో మైనారిటీల పరిస్థితిపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. మంగళవారం జరిగిన ఈ చర్చలో సభ్యురాలు అలిస్ వెల్స్ మాట్లాడుతూ... మత స్వేచ్ఛపై సార్వత్రిక హక్కును గౌరవించాలని సూచించారు. పౌరులే కాదంటున్న 19 లక్షల మంది అస్సాం వాసులతో పాటు ప్రమాదంలో ఉన్న అందరినీ కాపాడాలని కోరారు.
2019-10-23కేంద్ర ప్రభుత్వం రబీలో పండే గోధుమలకు కనీస మద్దతు ధరను రూ .85 రూపాయలు పెంచింది. ఇంతకు ముందు క్వింటాల్‌కు రూ. 1840 ఉండగా ఈ నిర్ణయంతో రూ. 1,925కి పెరగనుంది. పప్పుధాన్యాల మద్ధతు ధరలను క్వింటాల్‌కు రూ .335 వరకు పెంచింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) సమావేశంలో ఈమేరకు నిర్ణయాలు తీసుకున్నారు. బార్లీ మద్ధతు ధరను రూ. 85 (రూ. 1440 నుంచి 1525కు), కందుల ధరను రూ. 325 (రూ. 4475 నుంచి రూ. 4800కు) పెంచారు.
2019-10-23