తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కట్టు తప్పారు. గుంటూరు-2 ఎమ్మెల్యే మద్దాల గిరి సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలసి మద్ధతు ప్రకటించారు. ఆ తర్వాత బయటకు వచ్చి చంద్రబాబును విమర్శించారు. గతంలో తాను ఇన్ఛార్జిగా ఉన్నా పనులేమీ జరగలేదని, చంద్రబాబు మాటలకే పరిమితమయ్యారని ఆరోపించారు. ఇటీవల ఆంగ్ల మాథ్యమంపై టీడీపీ మాటలు మార్చడాన్ని తాను తప్పు పట్టినట్టు చెప్పుకొచ్చారు.
2019-12-30‘నీతి ఆయోగ్’ సోమవారం ప్రకటించిన ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఇండెక్స్’ ర్యాంకులలో కేరళ తొలి స్థానంలో నిలిస్తే బీహార్ అట్టడుగున ఉంది. 16 లక్ష్యాలను పరిశీలించిన నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ర్యాంకులు కేటాయించింది. స్థూల ర్యాంకుల్లో 70 పాయింట్లతో కేరళ రాష్ట్రంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ ముందుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ 67 పాయింట్లతో తర్వాత స్థానంలో నిలిచాయి.
2019-12-30ఇటీవలి వరకు తీవ్రంగా కొరతను ఎదుర్కొన్న సరుకు ఇసుక. ఇకపైన ఇసుకను ఇంటివద్దకే డెలివరీ ఇస్తామంటోంది ప్రభుత్వం. తొలుత జనవరి 2న కృష్ణా జిల్లాలో ప్రారంభించి, 7న ఉభయ గోదావరి, కడప జిల్లాల్లోనూ డోర్ డెలివరీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 20 నాటికి రాష్ట్రమంతటా ఇసుకను ఇంటివద్దకే పంపే ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
2019-12-30‘‘ఆ టీవీ లక్ష్యం...అమరావతిని నాశనం చేసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచడమే’’ అంటూ టీవీ9పై మండిపడ్డారు చంద్రబాబు. టీవీ9ను కొనుగోలు చేసిన ‘‘మై హోమ్’’ రామేశ్వరరావు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టైకూన్. అమరావతిలో రాజధాని కొనసాగింపును కోరుతూ ఆందోళన చేస్తున్నవారిని టీవీ9 రిపోర్టర్ ఫిర్యాదు ఆధారంగా అరెస్టు చేశారు. ‘‘టీవీకి స్వేచ్ఛ ఉందని..రైతులను పెయిడ్ ఆర్టిస్టులు, బిర్యానీ పొట్లాలకోసం వచ్చారని అంటారా’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
2019-12-30మీడియాపై దాడి కేసులో రాజధాని ఆందోళనకారులను అరెస్టు చేయడంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆరుగురు రైతులను ఇళ్లనుంచి కిడ్నాప్ చేసినట్టు తీసుకెళ్లారని, పూటకో పోలీసు స్టేషన్ తిప్పుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. ‘రైతులపై హత్యాయత్నం, దొంగతనం కేసులు పెడతారా?’ అని ప్రశ్నించారు. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో చురుగ్గా ఉన్నవారిని ఎంపిక చేసుకొని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.
2019-12-30సైనిక, నౌకా, వైమానిక దళాల మధ్య సమన్వయం కోసం నియమించనున్న త్రివిధ దళాల అధిపతి (సిడిఎస్) పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా నిర్ణయించనున్నారు. త్రివిధ దళాల అధిపతులకు ఇంతవరకు ఉన్న గరిష్ఠ వయోపరిమితి 62 సంవత్సరాలు. కాగా... సి.డి.ఎస్.ను నియమించడానికి వీలుగా త్రివిధ దళాల సర్వీసు నిబంధనలను మారుస్తూ తాజాగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అందులో గరిష్ఠ వయోపరిమితిని 65గా పేర్కొన్నారు.
2019-12-302020లో మరింత మంది సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ చెల్లింపుల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందట. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ, యాంటీ వైరస్ బ్రాండ్ ‘కాస్పర్‌స్కీ’ పరిశోధకులు ఈమేరకు హెచ్చరిక జారీ చేశారు. సైబర్ నేర ప్రపంచంలో గత కొన్ని సంవత్సరాలుగా జె.ఎస్- స్కిమ్మింగ్ (ఆన్‌లైన్ స్టోర్ల నుండి చెల్లింపు కార్డు డేటాను దొంగిలించే పద్ధతి) విపరీతంగా ఆదరణ పొందిందని ‘కాస్పర్‌స్కీ’ పేర్కొంది. తస్మాత్ జాగ్రత్త.
2019-12-30చట్ట విరుద్ధంగా జన్యు సవరణకు పాల్పడిన చైనా పరిశోధకుడు ఒకరికి మూడేళ్ళ జైలు శిక్ష పడింది. హి జియాన్‌కుయి అనే పరిశోధకుడు మానవ పిండాల జన్యు సవరణ ద్వారా పునరుత్పత్తి ప్రక్రియను చేపట్టారు. ఆ ప్రక్రియ ద్వారా ముగ్గురు పిల్లలు ‘జన్యు సవరణ’లతో జన్మించారు. అయితే, ఇదంతా చట్ట విరుద్ధంగా జరిగిందని ఆరోపణలున్నాయి. దీంతో ‘హి’కి మూడేళ్ల జైలు శిక్షతో పాటు 3 మిలియన్ యువాన్ల (రూ. 3 కోట్ల) జరిమానా విధించారు.
2019-12-30జమ్మూ కాశ్మీర్, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) చర్చనీయాంశాలుగా ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఒ.ఐ.సి) 2020 ఏప్రిల్ మాసంలో సమావేశం కానుంది. ఈ సమావేశం భారత దాయాది పాకిస్తాన్లో జరుగుతుంది. 57 ఇస్లామిక్ దేశాలు సభ్యులుగా ఉన్న ఒ.ఐ.సి., ఇండియాలో పరిణామాలపై చర్చించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మన దేశానికి ఇది ఒకింత ఇబ్బందికర పరిణామం. ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతారు.
2019-12-292019లో భారతీయ కంపెనీలు దేశీయ, విదేశీ మార్కెట్లనుంచి రూ. 8.68 లక్షల కోట్ల మేరకు నిధులను సమీకరించాయి. ఇది గత సంవత్సరం కంటే 20 శాతం అధికం. భారతీయ రుణ మార్కెట్ నుంచే రూ. 6.2 లక్షల కోట్లు సేకరించగా, సుమారు 1.2 లక్షల కోట్లు విదేశీ బాండ్ల ద్వారా సేకరించాయి. అయితే, 2020లో రుణ సేకరణ... మార్కెట్ స్థితి, ఆర్థిక వృద్ధి, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, కేంద్ర బడ్జెట్ తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
2019-12-29 Read More