కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ‘సమత’ అత్యాచారం, హత్య కేసులో ముగ్గురికి ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణశిక్షను విధించింది. నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మఖ్దుమ్ లను ఉరి తీయాలని కోర్టు గురువారం తీర్పు చెప్పింది. హైదరాబాద్ ‘దిశ’ అత్యాచారం తర్వాత..2019 నవంబర్ 24న లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామంలో ఈ నేరం జరిగింది. డిసెంబర్ 11న ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు. 14న ఛార్జిషీటు దాఖలు చేయగా, 23 నుంచి 31 వరకు సాక్షలును విచారించారు.
2020-01-30ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బిజెపి మరో ఎంపీ పర్వేష్ వర్మలపై సిపిఎం నేత బృందా కారత్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా వారి ప్రకటనలు, ప్రసంగాలు విద్వేషపూరితంగా, చట్టవిరుద్ధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై వెంటనే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలని బృందా, సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ డిమాండ్ చేశారు.
2020-01-30 Read Moreనవంబర్ వరకు పన్నుల వసూళ్లు గత ఏడాది కంటే తక్కువగా నమోదైన 6 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ తోపాటు మహారాష్ట్ర, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ కూడా పన్నుల వసూళ్ళలో తిరోగమనంలో ఉన్నాయి. తొలి ఎనిమిది నెలల్లో ఏపీలో 11.4 శాతం తగ్గితే పంజాబ్ రాష్ట్రంలో 10.4 శాతం తగ్గుదల నమోదైంది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో 13.44 శాతం ఎక్కువ వసూలు కావడం విశేషం.
2020-01-30 Read Moreఎన్నికల వ్యూహకర్త, జెడి(యు) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్, పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్ వర్మ బహిష్కరణకు గురయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్ధతు ఇవ్వడంపై ఈ ఇద్దరూ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. సిఎఎకి మద్ధతు రాజ్యాంగ వ్యతిరేకమే కాక... జెడి(యు) లౌకిక ప్రస్థానాన్ని కూడా ఉల్లంఘించడమని వ్యాఖ్యానించారు. సిఎఎ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇది బిజెపి మిత్రుడైన నితీష్ కు కోపం తెప్పించింది.
2020-01-30 Read Moreవిమానంలో ఉండగా రిపబ్లిక్ టీవీ యాంకర్ ఆర్ణబ్ గోస్వామిని అవహేళన చేశారని కమెడియన్ కునాల్ కమ్రాను విమానయాన సంస్థలు బహిష్కరించాయి. ఈ సందర్భంగా పాత వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. 2017లో రిపబ్లిక్ టీవీ రిపోర్టర్ విమానంలో ఇంటర్వ్యూ కోసం...ఆర్.జె.డి. నేత తేజస్వి యాదవ్ ను ఇబ్బంది పెట్టారు. విమానంలో వద్దని, సాటి ప్రయాణీకులకూ ఇబ్బంది అని తేజస్వి ఎంత చెప్పినా వినలేదు. పదే పదే ప్రశ్నలు వేయడంతో తప్పనిసరై కొన్నిటికి జవాబులు చెప్పారు తేజస్వి.
2020-01-30 Read Moreనరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఓ పెద్ద ఉపశమన వార్త. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా యూరోపియన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ వాయిదా పడింది. మార్చి రెండో పక్షానికి ఓటింగ్ వాయిదా వేయడంపై ఓటింగ్ నిర్వహించారు. వాయిదాకు అనుకూలంగా 271 ఓట్లు, వ్యతిరేకంగా 191 ఓట్లు నమోదయ్యాయి. యూరోపియన్ పార్లమెంటులోని 5 ప్రధాన రాజకీయ గ్రూపులు సిఎఎ వ్యతిరేక తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఓటింగ్ వాయిదా దౌత్య విజయమని కేంద్రం పేర్కొంది.
2020-01-29 Read Moreప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పి.ఎ.సి.ఎస్.ల)కు 15 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. పి.ఎ.సి.ఎస్.లకు నియమించిన పర్సన్ ఇన్ఛార్జిల పదవీ కాలం ముగుస్తున్నందున నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇంతవరకు పి.ఎ.సి.ఎస్.లకు ఎన్నికలు జరగలేదు. 2013లో ఏర్పాటైన పాలక మండళ్ళ పదవీ కాలం 2018 ఫిబ్రవరితో ముగిసింది.
2020-01-29ఏపీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పన్ను రేట్లలో మార్పులు చేసింది. దీనివల్ల ధరలు కొద్దిగా పెరగవచ్చు. ఇప్పటిదాకా ‘వ్యాట్’ కింద పెట్రోలుపై ‘31 శాతం+2 రూపాయలు’ ఉంటే దాన్ని ‘35.20%’గా మార్చారు. డీజిల్ పైన ‘22.25% + 2 రూపాయలు’ స్థానంలో ‘27%’ అని మారుస్తూ బుధవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ జీవో ఎంఎస్ నెంబర్ 19 జారీ చేసింది. తెలంగాణలో సరిగ్గా 35.20%, 27% ఉన్నాయి. పన్ను పూర్తిగా శాతంలోకి మార్చినందువల్ల...చమురు ధర పెరిగినప్పుడు ప్రభుత్వ ఆదాయమూ పెరుగుతుంది.
2020-01-29విశాఖపట్నం సముద్ర తీరానికి 40-50 కిలోమీటర్ల దూరంగా పరిపాలనా రాజధాని ఏర్పాటుకు తమ కమిటీ సిఫారసు చేసిందని మాజీ ఐఎఎస్ అధికారి జి.ఎన్. రావు బుధవారం వెల్లడించారు. విశాఖకు తుపానుల ముప్పు ఉందని కమిటీ పేర్కొన్నట్లు పత్రికలు బుధవారం ఎత్తిచూపడంతో...జి.ఎన్.రావు హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. తుపానులు, సముద్రపు కోత వంటి సమస్యలు ఉన్నమాట నిజమేనని, అందుకే నగరానికి ఉత్తరాన రాజధాని ఏర్పాటు చేయాలని సూచించామని రావు చెప్పారు.
2020-01-29కమెడియన్ కునాల్ కమ్రాను విమాన యాన సంస్థలు నిషేధించడంపై సామాజిక మాథ్యమాల్లో వ్యంగ్య వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ‘‘సో, ఆర్ణబ్ గోస్వామితో ఆర్ణబ్ గోస్వామిలా ప్రవర్తించినందుకు కునాల్ నిషేధానికి గురయ్యారన్నమాట’’ అని ‘డాన్ టిప్లర్’ అనే ట్విట్టర్ యూజర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ ‘‘నిజం ఏంటంటే...తన ప్రవర్తనను తనకే రుచి చూపించిన సమయం ఇది’’ అని వ్యాఖ్యానించారు.
2020-01-29