అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఢిల్లీ బీజేపీ నేత మనోజ్ తివారీ కార్యకర్తలకు ఓ గుళిక వేశారు. 27 నియోజకవర్గాల్లో 1000 ఓట్ల కంటే తక్కువ తేడాతో ఓడామని చెప్పారు. వాస్తవం ఏమంటే.. ఒకే ఒక్క చోట బిజెపి 1000 కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడింది. బిజ్వసాన్ సెగ్మెంట్లో బిజెపి అభ్యర్ధి సత్ ప్రకాష్ రాణా, ‘ఆప్’ అభ్యర్ధి భూపీందర్ సింగ్ జూన్ చేతిలో 753 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదర్శ్ నగర్లో 1589 ఓట్ల తేడాతో బిజెపి ఓడిపోగా, మిగిలిన అన్ని చోట్లా ‘ఆప్’ మెజారిటీ 3000 పైమాటే!
2020-02-11ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన సీట్లలో 8 చోట్ల 40 వేల కంటే ఎక్కువ మెజారిటీ నమోదైంది. అందులో మూడు ఎస్.సి. నియోజకవర్గాలు. బురారి నియోజకవర్గంలో ఆప్ అభ్యర్ధి సంజీవ్ ఝా జెడి(యు) అభ్యర్ధి శైలేంద్ర కుమార్ పై అత్యధికంగా 88,158 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఓఖ్లాలో అమనతుల్లా ఖాన్ బిజెపి అభ్యర్ధి బ్రహమ్ సింగ్ పై 70,675 ఓట్ల తేడాతో, సీమా పూరి (ఎస్.సి) సెగ్మెంట్లో రాజేంద్రపాల్ గౌతమ్ లోక్ జన శక్తి అభ్యర్ధి సంత్ లాల్ పైన 56,108 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మతియా మహాల్ లోనూ మెజారిటీ 50 వేలు దాటింది.
2020-02-11ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లకు ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చివరి రౌండ్లకు వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్ లో ఉన్న సీట్ల సంఖ్య పెరుగుతుండటం విశేషం. రెండు గంటల క్రితం 56 సీట్లలో ముందంజ వేసిన ‘ఆప్’ ఇప్పుడు 62 సీట్లకు పెరిగింది. బిజెపి కేవలం 8 సీట్లలో ముందుంది. తుది ఫలితం వెలువడే సరికి ఈ సంఖ్యల్లో కొద్దిగా మార్పు ఉండవచ్చు.
2020-02-11పార్లమెంటులో ప్రశ్నలు, చర్చలు, బిల్లులు, తీర్మానాలు దేశం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. ఏడాదికోసారి ప్రవేశపెట్టే బడ్జెట్ అత్యంత ముఖ్యమైన అంశల్లో ఒకటి. అలాంటి బడ్జెట్ పై చర్చకు ఎంపీలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? మంగళవారం రాజ్యసభను చూస్తే అర్ధమవుతోంది. మెజారిటీ సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్న ఈ చిత్రం మన ఎంపీల ప్రాధాన్యతకు దర్పణం పడుతోంది. పైగా... తమ సభ్యులందరూ మంగళవారం తప్పనిసరిగా హాజరు కావాలని బిజెపి విప్ కూడా జారీ చేసింది.
2020-02-11ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నా... ‘ఆప్’ ఘన విజయం ఖాయమైపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు నగరమంతటా సంబరాలు జరుపుతున్నారు. సిఎం పీఠాన్ని మూడోసారి అధిరోహించబోతున్న పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జమిలి వేడుకలను నిర్వహించారు. మంగళవారం కేజ్రీవాల్ భార్య సునీత జన్మదినం కూడా కావడంతో... పార్టీ కార్యాలయంలో ఫలితాలను టీవీలో చూస్తున్న సమయంలోనే కేక్ కట్ చేయించారు.
2020-02-11ఢిల్లీ 6వ అసెంబ్లీని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రద్దు చేశారు. 7వ అసెంబ్లీ ఏర్పాటుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఇప్పటివరకు సుమారు 15 సీట్లకు ఫలితాలు వెలువడగా మిగిలిన చోట్ల మరికొన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది.
2020-02-11హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సీనియర్ డాక్టర్ వసంత్ పెట్రోలు సీసాలు దుస్తుల్లో పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని హడావుడి చేశారు. కరోనా వైరస్ భయాలను వ్యాపింపజేశారంటూ నిన్న వసంత్ సహా ముగ్గురిని అధికారులు సస్పెండ్ చేశారు. ఇది తనపైన కక్ష సాధింపేనని వసంత్ ఆరోపించారు. ‘గాంధీ’ సూపరింటెండెంట్ సహా పలువురిపై అవినీతి ఆరోపణలు చేశారు. సుమారు గంట తర్వాత పోలీసులు ఆయను అదుపులోకి తీసుకోగలిగారు.
2020-02-11ఎగ్జిట్ పోల్స్ నిజమవుతున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన వివరాల ప్రకారం 53.3 శాతం ఓట్లతో 58 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజ వేసింది. ఈ నెల 8న పోలింగ్ ముగియగా, మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో బిజెపి 12 సీట్లకు పరిమితం అవుతుండగా, ఇతర పార్టీలేవీ ఖాతా తెరిచేలా లేవు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 8000కు పైగా ఓట్ల లీడ్ తో కొనసాగుతుండగా, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, పాఠశాలల రూపుమార్చిన ఆతిషిలతో విజయం దోబూచులాడుతోంది.
2020-02-11సిఎఎ వ్యతిరేక నిరసనలపై అణచివేత పెరుగుతోంది. సోమవారం పార్లమెంటు వైపు ప్రదర్శనగా వెళ్తున్న జామియా మిలియా ఇస్లామియా విద్యార్ధులపై ఢిల్లీ పోలీసులు విరుచుకుపడ్డారు. ‘‘10 మందికి పైగా మహిళా విద్యార్ధులకు మర్మావయవాలపై కొట్టిన గాయాలున్నాయి. బలమైన గాయాలను చూసి అల్ షిఫా ఆసుపత్రికి తరలించవలసి వచ్చింది’’ అని జామియా హెల్త్ సెంటర్ రెసిడెంట్ డాక్టర్లు చెప్పారు. కొంతమందిని ఛాతీపై లాఠీలతో కొట్టడంతో అంతర్గత గాయాలయ్యాయని వారు తెలిపారు.
2020-02-10రాష్ట్ర విభజన నాటి హామీ ‘ప్రత్యేక కేటగిరి హోదా’కు బదులు ‘ప్రత్యేక సాయం’ ప్రకటించిన కేంద్రం ఈ మూడేళ్లలో ఏపీకి ఇచ్చిందెంత? అక్షరాలా రూ. 16 కోట్లు కూడా లేదు. 2017-18లో సున్నా.. 2019-20లో నవంబరు 7వ తేదీవరకు ఇచ్చింది సున్నా. మధ్యలో 2018-19లో మాత్రం రూ. 15.81 కోట్లు విదిలించింది. ఈ మూడేళ్ళలో వివిధ రాష్ట్రాలకు కేంద్రం చేసిన ‘ప్రత్యేక సాయం’ రూ. 12,195 కోట్లు. అందులో ఏపీ వాటా 0.0129 శాతం. దీన్ని ఏమంటారు?
2020-02-10