రాష్ట్రంలో ఇసుక కొరతతో ఆత్మహత్యలు జరగడం దారుణమని, వరద సహాయక చర్యల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి వైఎస్ (సుజనా) చౌదరి విమర్శించారు. బీజేపీ గాంధీ సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఇంకా ఎన్నికల మూడ్ నుంచి పరిపాలనా మోడ్ లోకి రాలేదని వ్యాఖ్యానించారు. బంధుప్రీతితో సొంత మనుషులకు ఏం చేసుకోవాలా? అనే ధోరణే తప్ప సమస్యల పరిష్కారంపై సిఎంకు దృష్టి లేదని సుజనా ఆరోపించారు.
2019-10-31ఆంధ్రప్రదేశ్ ఇసుక సంక్షోభానికి మరొకరు బలయ్యారు. ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న గుంటూరు జిల్లాలోనే మరో ప్రాణం ఇసుకలో సమాధి అయింది. జిల్లాలోని చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ నాగుల్ మీరా గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనను గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
2019-10-31ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులను కాలం చెల్లి చనిపోయారంటూ వైసీపీ నేతలు ఎగతాళి చేసి మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆక్షేపించారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబ సభ్యులతో గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రాష్ట్ర మంత్రులపై మండిపడ్డారు. ‘‘23 సంవత్సరాలు, 45 సంవత్సరాలకే కాలం చెల్లి పోయారా’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. పేదవాళ్ల జీవితాలను ఎగతాళి చేసేలా మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు.
2019-10-312019-20 ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్ నుంచి రూ. 4,48,122 కోట్ల మేరకు అప్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించుకుంది. అయితే, సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల్లోనే రూ. 4,78,253 కోట్లు మార్కెట్ నుంచి సేకరించింది. అంటే ఏడాది మొత్తంలో చేయవలసిన అప్పుల కంటే ఆరు నెలలకే ఎక్కువ (107 శాతం) చేసింది. గత ఏడాది ఇదే కాలంలో వార్షిక లక్ష్యానికి 82 శాతం మేర మార్కెట్ రుణాలు సేకరించింది.
2019-10-312019-20 తొలి అర్ధ భాగంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయం రూ. 8,37,065 కోట్లుగా ఉంటే వ్యయం రూ. 14,88,619 కోట్లుగా తేలింది. పన్నుల ద్వారా వచ్చింది రూ. 6,07,429 కోట్లయితే పన్నేతర ఆదాయం రూ. 2,09,038 కోట్లు. వ్యయంలో రెవెన్యూ పద్ధు రూ. 13,01,082 కోట్లు. కేపిటల్ వ్యయం 1,87,537 కోట్లు కాగా వడ్డీ చెల్లింపులకే రూ. 2,70,696 కోట్లు పోయింది. సంవత్సరం మొత్తంలో రూ. 27,86,349 కోట్ల వ్యయం అవుతుందని బడ్జెట్లో అంచనా వేయగా ఆర్నెల్లలో అందులో 53.4 శాతం పూర్తయింది. ఆదాయం మాత్రం లక్ష్యంలో 40.2 శాతమే వచ్చింది.
2019-10-312019-20 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ. 4,85,503 కోట్లు ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసింది. అయితే, సెప్టెంబరుతో ముగిసిన ఆర్నెల్లలోనే లోటు రూ. 4,84,615 కోట్లకు చేరింది. అంటే వార్షిక అంచనాలో 99.8 శాతం. అదే సమయంలో ద్రవ్య లోటు 92.6 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ. 7,03,760 కోట్లు ఉంటుందనుకుంటే ఆర్నెల్లకే రూ. 6,51,554 కోట్లు తేలింది. గురువారం కేంద్ర ప్రభుత్వం తాజా గణాంకాలను వెల్లడించింది.
2019-10-31లెక్కల్లోకి రాని బంగారాన్ని వ్యక్తులు, సంస్థలు వెల్లడించేలా ప్రభుత్వం ఓ పథకాన్ని తేనుందని వచ్చిన వార్తలను అధికార వర్గాలు అనధికారికంగా ఖండించాయి. అలాంటి పథకం ఏదీ ఆదాయ పన్ను శాఖ పరిశీలనలో లేదని ఆ వర్గాలు తెలిపాయి. నోట్ల రద్దు నాటి నుంచి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో అల్లాడుతున్న ప్రజలు... ఈ ‘బంగారం వెల్లడి పథకం’ వార్తలతో అయోమయానికి గురయ్యారు. దీంతో అధికారులు పత్రికలకు వివరణ ఇచ్చారు. బడ్జెట్ రూపకల్పన ప్రారంభమయ్యాక ఇలాంటి వార్తలు రావడం సహజమని వారు చెప్పారు.
2019-10-31 Read Moreనిరంతరం ఆందోళనలతో అశాంతి నెలకొనడంతో హాంగ్ కాంగ్ ఆర్థిక వ్యవస్థ తిరోగమించింది. 2019 మూడో త్రైమాసికంలో హాంగ్ కాంగ్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గత ఏడాది అదే కాలంతో పోలిస్తే 2.9 శాతం తగ్గింది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత హాంగ్ కాంగ్ జీడీపీ తిరోగమించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాలలో వరుసగా 0.6 శాతం, 0.4 శాతం వృద్ధి నమోదైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో పాటు హాంగ్ కాంగ్ లో జరుగుతున్న ఆందోళనలు హఠాత్పతనానికి కారణాలని ప్రభుత్వం పేర్కొంది.
2019-10-31ఐటి దిగ్గజం ‘కాగ్నిజంట్’ త్వరలో 12,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపనుంది. 2019 సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి 497 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,500 కోట్ల) లాభాన్ని ప్రకటించిన రోజే...కంపెనీ ఉద్యోగుల తగ్గింపు నిర్ణయాన్నీ వెల్లడించింది. అమెరికా కేంద్ర బిందువుగా పని చేసే ‘కాగ్నిజంట్’ ఇండియాలో పెద్ద మొత్తంలో ఉద్యోగులను కలిగి ఉంది. ఖర్చు తగ్గింపులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 12 వేల మంది మధ్య తరహా, సీనియర్ స్థాయి అసోసియేట్లను తప్పించనున్నట్టు కంపెనీ స్వయంగా తెలిపింది.
2019-10-31 Read Moreవాట్సాప్ లో భారతీయ జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై ఇజ్రాయెలీ గూఢచర్య సాఫ్ట్ వేర్ ను ప్రయోగించిన విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇజ్రాయెలీ గ్రూపు ఎన్.ఎస్.ఒ. తన పెగాసస్ సాఫ్ట్ వేర్ తో సుమారు 1400 మంది ఇండియన్లపై గూఢచర్యం చేసినట్లు వాట్సాప్ నిర్ధారించింది. అయితే, ఎవరికోసం ఈ నేరానికి పాల్పడ్డారనే విషయం రహస్యంగానే ఉంది. గత ఎన్నికలకు ముందు తమపై అత్యాధునిక టెక్నాలజీతో గూఢచర్యం జరిగినట్లు పాతిక మంది వరకు వాట్సాప్ కు ఫిర్యాదు చేశారు.
2019-10-31