అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మంగళవారం 57 డాలర్ల (బ్యారెల్) దిగువకు తగ్గింది. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. 2020లో ఆయిల్ డిమాండ్ అంచనాలను అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ సహా పలు సంస్థలు తగ్గించాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ధర మంగళవారం 1.04 డాలర్లు తగ్గి 56.63 డాలర్లకు చేరింది. అమెరికా వెస్ట్ టెక్సాస్ క్రూడ్ ధర 83 సెంట్లు తగ్గి 51.22 డాలర్లకు చేరింది. మార్చిలో ఉత్పత్తిని తగ్గించే అవకాశాలున్నాయి.
2020-02-18మహాత్మాగాంధీ ఆదర్శాలతో ఉంటారా లేక నాథురాం గాడ్సేని సమర్ధించేవారితోనా? అన్నది బీహార్ సీఎం నితీష్ కుమార్ తేల్చి చెప్పాలని జెడి(యు) బహిష్కృత నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డిమాండ్ చేశారు. ‘‘గాంధీ, జెపి, లోహియా ఆదర్శాలను వదిలేది లేదని నితీష్ చెబుతారు. అదే సమయంలో గాడ్సే సిద్ధాంతాన్ని సమర్ధించేవారితో ఉంటారు. ఈ రెండూ కలసి సాగలేవు’’ అని ప్రశాంత్ వ్యాఖ్యానించారు. 2005లో పేద రాష్ట్రంగా ఉన్న బీహార్ ఇప్పటికీ అదే స్థితిలో కొనసాగుతోందంటూ నితీష్ అభివృద్ధి నమూనాను తప్పు పట్టారు.
2020-02-18అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎపిపి) పోస్టులకు 49 మందిని ఎంపిక చేసినట్టు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మంగళవారం వెల్లడించారు. 50 పోస్టులను నోటిఫై చేస్తే 2,488 మంది దరఖాస్తు చేశారని, వారిలో 1,981 మంది రాత పరీక్ష రాయగా 496 మంది ఉత్తీర్ణులయ్యారని, మౌఖిక పరీక్షకు 97 మందిని ఆహ్వానించి 49 మందిని ఎంపిక చేశఆమని ఆమె వివరించారు. కాగా, ఎంపికైన 49 మందిలో 27 మంది మహిళలే ఉండటం విశేషం. ప్రథమ స్థానంలో నిలిచింది కూడా ఒక మహిళే (ఎం. లావణ్య 281.50 మార్కులు). www.slprb.ap.gov.in లో వివరాలు చూడవచ్చు.
2020-02-18ఏపీ వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) చట్టం కింద తొలి అరెస్టు ఈ నెల 15న జరిగినట్టు రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ పీయూష్ కుమార్ మంగళవారం వెల్లడించారు. గాజువాక సర్కిల్ పరిధిలో పాత ఇనుము వ్యాపారం చేసే దుడ్డు శేఖర్ పన్ను ఎగవేతకు పాల్పడ్డట్లు ఆయన తెలిపారు. శేఖర్ ట్రేడర్స్, వెంకటసాయి ట్రేడర్స్ యజమాని అయిన ఈ వ్యాపారి రూ. 14.40 కోట్ల టర్నోవరుపై రూ. 2.60 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. శేఖర్ ను ఆర్థిక నేరాల కోర్టులో 16న హాజరు పరచగా రిమాండ్ విధించారని, నిందితుడు విశాఖ సెంట్రల్ జైలుకు వెళ్లాడని వివరించారు.
2020-02-18సోమవారం అర్దరాత్రి వరకు చైనాలో కరోనా వైరస్ వల్ల 1,868 మంది మరణించినట్లు ఆ దేశ జాతీయ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఇప్పటిదాకా 72,436 మందికి కరోనా నిర్ధారణ కాగా వారిలో 12,552 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి ఇళ్ళకు వెళ్ళారు. మిగిలిన 58,016 కేసుల్లో 11,741 మందికి వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ఒక్క హుబీ ప్రావిన్సులోనే 59,989 కేసులు రిపోర్టు కాగా 7,862 మందికి నయమై డిశ్చార్జి అయ్యారు. ఆ ప్రావిన్సులోనే 1,789 మంది మరణించారు. వారిలో ‘వుహాన్’ నగరానికి చెందినవారు 1,381 మంది.
2020-02-18 Read Moreఈ నెల 21వ తేదీని ‘రెడ్ బుక్ డే’గా పాటిస్తున్నట్లు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు వెల్లడించారు. మార్క్స్-ఏంగెల్స్ రచించిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ లక్ష కాపీలను తెలుగు ప్రజలకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. 1848లో రచించిన ఈ 50 పేజీల చిరుగ్రంథం ప్రపంచాన్ని చుట్ట చుట్టినట్లుగా పాఠకులకు పరిజ్ఞానాన్ని అందిస్తుందని, సమకాలీన భారత సమాజానికి అది చాలా అవసరమని రాఘవులు చెప్పారు. పెట్టుబడి పర్యవసానాలను అర్దం చేసుకోవడానికి ఈ గ్రంథాన్ని అందరూ చదవాలని పిలుపునిచ్చారు.
2020-02-18గ్రామీణ వైద్యశాలల నుంచి బోధనాసుపత్రుల వరకు.. అన్నింటి రూపు రేఖలు మారుస్తామని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. మూడు దశల్లో నాడు-నేడు కార్యక్రమం కోసం రూ. 15,337 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. మంగళవారం కర్నూలులో ‘వైఎస్ఆర్ కంటి వెలుగు’ మూడో దశను సిఎం ప్రారంభించారు. స్వాతంత్రానంతరం ఇప్పటిదాకా కేవలం 11 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయని, ఇకపైన ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
2020-02-18ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ పత్రిక ‘సాక్షి’కి ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ ఎడిటర్ అయిన ధనుంజయరెడ్డిని ఆ స్థానం నుంచి తప్పించినట్టు ఓ వార్త. అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉందని, నిర్ణయం మాత్రం జరిగిందని ఆ వార్త సారాంశం. చిన్న వయసులో రెసిడెంట్ ఎడిటర్ బాధ్యత స్వీకరించిన ధనుంజయరెడ్డి తొలగింపునకు... ఆయనపై వచ్చిన ఆరోపణలే కారణంగా చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పత్రికపై ఫోకస్ తగ్గించి ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణ అంతర్గతంగా వినిపిస్తోంది.
2020-02-18 Read More2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ పరిమాణం రూ. 5,12,860 కోట్లుగా ఉంది. నూతన బడ్జెట్ ను ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సురేష్ ఖన్నా మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఇది నాలుగో బడ్జెట్. 2022లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు ప్రజాకర్షక నిర్ణయాలకు నిధులు కేటాయిస్తోంది.
2020-02-182012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషులను మార్చి 3 ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని తాజాగా ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మరో డెత్ వారెంట్ జారీ చేసింది. దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ సింగ్ లను ఫిబ్రవరి 1న ఉరి తీయాలని జనవరి 17నే కోర్టు డెత్ వారెంట్ జారీ అయింది. అయితే, వినయ్ శర్మ, అక్షయ్ క్షమాబిక్ష పిటిషన్లు పెండింగ్ లో ఉండటంతో జనవరి31న ట్రయల్ కోర్టే ఉరిపై స్టే ఇచ్చింది. తర్వాత ఫిబ్రవరి 5న ఢిల్లీ హైకోర్టు దోషులకు ఇచ్చిన వారం గడువు కూడా ముగియడంతో తాజా వారెంట్ జారీ అయింది.
2020-02-18