అనిల్ అంబానీ గ్రూపు కంపెనీలపై క్లాస్ యాక్షన్ దావా వేస్తానని ఓ వాటాదారుడు తీవ్రంగా హెచ్చరించాడు. సోమవారం జరిగిన రిలయన్స్ పవర్ వార్షిక సాధారణ సమావేశంలో ఓ వాటాదారు కోపంగా మాట్లాడాడు. అనిల్ అంబానీకి చెందిన ఏడు కంపెనీలలో మూడింట తాను రూ. 3 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టానని, అసమర్ధ నిర్వహణ కారణంగా అందులో 90 శాతం కోల్పోయానని ఆ వ్యక్తి చెప్పాడు. దేశ చరిత్రలోనే తొలి క్లాస్ యాక్షన్ దావా వేయడానికి తాను సిద్ధమని అనిల్ అంబానీని ఉద్ధేశించి బెదిరించినట్టు వార్తలు వచ్చాయి.
2019-10-01 Read Moreజీవించి ఉన్న అమెరికా మాజీ అధ్యక్షులలో వయోవృద్ధుడు జిమ్మీ కార్టర్ మంగళవారం 95వ జన్మ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. జార్జియా వేరుశెనగ రైతు కుమారుడైన జిమ్మీ కార్టర్ 1924 అక్టోబర్ 1న జన్మించారు. అమెరికాకు 39వ అధ్యక్షుడిగా 1977, 1981 మధ్య కాలంలో పని చేశారు. మానవ హక్కుల రంగంలో కృషి చేసినందుకు ఆయనను 2002లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. క్యాన్సర్ వ్యాధితో పోరాడిన కార్టర్ ఇప్పటికీ తన పనులు తాను చేసుకోగలుగుతున్నారు.
2019-10-01 Read Moreమహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల విభాగం ఆధ్వర్యంలో రూపొందిన కొన్ని ఉత్పత్తులను కేంద్ర చిన్నతరహా పరిశ్రమలు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఆవిష్కరించారు. అందులో వెదురు బొంగులతో తయారు చేసిన సీసాలు ఉన్నాయి. 700 మిల్లీ లీటర్లు, 900 మిల్లీ లీటర్ల నీటి సామర్ధ్యం ఉన్న ఈ సీసాలను త్రిపురకు చెందిన ఓ సంస్థ తయారు చేసింది. ప్లాస్టిక్ సీసాలకు ఈ వెదురు బొంగు సీసాలు మంచి ప్రత్యామ్నాయమని మంత్రి గడ్కరీ ప్రశంసించారు.
2019-10-01 Read Moreఆలస్యంగా ప్రవేశించినా అధిక వర్షాలను కురిపించాయి నైరుతి రుతుపవనాలు. ఫలితంగా భారీ వర్షాలు, వరదలకు జూన్-సెప్టెంబర్ కాలంలో దేశవ్యాప్తంగా 1600 మంది మరణించినట్టు మంగళవారం ఓ ప్రభుత్వ నివేదిక తెలిపింది. తాజాగా కూడా రెండు ఉత్తరాది రాష్ట్రాలు వరదల బారిన పడగా ఓ నగరంలో బురదనీరు చేరింది. రుతుపవనాలు అక్టోబర్ ప్రథమార్ధంవరకు కొనసాగనున్నట్టు ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. గత 50 సంవత్సరాల సగటు వర్షపాతం కంటే ఈ ఏడాది ఇప్పటికే 10 శాతం అదనంగా నమోదైంది.
2019-10-01 Read Moreనేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ (ఆన్.ఆర్.సి)ని బెంగాల్ రాష్ట్రానికీ విస్తరిస్తామని, చొరబాటుదారులను వెళ్ళగొడతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అయితే, ఈలోగా పౌరసత్వ చట్టానికి సవరణ బిల్లు తెస్తామని, దేశంలోకి వచ్చిన హిందువులు, సిక్కులు, జైన్లు, బుద్ధిస్టులు అందరికీ పౌరసత్వం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. మంగళవారం బెంగాల్ పర్యటనలో ఉన్న అమిత్ షా, ఎన్.ఆర్.సి.పై జరిగిన ఓ సదస్సులో మాట్లాడారు.
2019-10-01 Read Moreయునైటెడ్ స్టేట్స్, దాని మిత్రదేశాలు మోహరించిన క్షిపణి నిరోధక కవచాలన్నింటినీ ఛేదించగల కొత్త హైపర్సోనిక్ బాలిస్టిక్ అణు క్షిపణి (డిఎఫ్ -17)ని చైనా మంగళవారం ప్రదర్శించింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 70వ వార్షికోత్సవం సందర్భంగా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ నేతృత్వంలో జరిగిన పెద్ద సైనిక కవాతులో అధునాతన ఆయుధాలను చైనా ప్రదర్శించింది. డిఎఫ్-17 వేగం.. ప్రతిస్పందనగా అణ్వాయుధాలను ప్రయోగించాలా లేదా అని ప్రత్యర్ధులు నిర్ణయించుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వదు.
2019-10-01 Read Moreమహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కష్టాల్లో పడ్డారు. గతంలో ఎన్నికల అఫిడవిట్లో అతను ఇచ్చిన తప్పుడు సమాచారం పైన కింది కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు క్లీన్చిట్ ని సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దీంతో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రాసిక్యూషన్ కు మార్గం సుగమమైంది. దేవేంద్ర ఫడ్నవీస్ 2014 ఎన్నికల అఫిడవిట్లో 2 క్రిమినల్ కేసుల గురించి సమాచారం ఇవ్వలేదని సతీష్ అనే పిటిషనర్ కోర్టులో సవాలు చేశాడు. 1996, 1998 లో నమోదైన చీటింగ్ ఫోర్జరీ కేసు సంబంధించి సమాచారం ఇవ్వలేదు.
2019-10-01మోహన్ లాల్ ప్రధాన పాత్రధారిగా కథానాయకుడు పృథ్వీరాజ్ రూపొందించిన మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘లూసిఫర్’ను తెలుగులో రాంచరణ్ రీమేక్ చేయనున్నట్టు సమాచారం. మోహన్ లాల్ పాత్రలో చిరంజీవి, పృథ్వీరాజ్ పాత్రలో స్వయంగా రాంచరణ్ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చిరంజీవి భారీ చిత్రం ‘సైరా...’ రేపు విడుదల కాబోతోంది. తర్వాత కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో నటించబోతున్నారు. ఆ తర్వాత ‘లూసిఫర్’ తెలుగు వెర్షన్ రానున్నట్టు తెలుస్తోంది.
2019-10-01 Read Moreప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో హూస్టన్ సభలో ‘అబ్ కి బార్ ట్రంప్ సర్కార్- మరోసారి ట్రంప్ ప్రభుత్వం’ అని పిలుపు ఇవ్వడంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వివరణ ఇచ్చారు. మోదీ ఉద్ధేశం అది కాదని, ట్రంప్ గతంలో చెప్పిన మాటను మాత్రమే గుర్తు చేశారని జైశంకర్ పేర్కొన్నారు. ‘‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటున్న మీరు (ట్రంప్) అధ్యక్ష అభ్యర్ధిగానూ ఇండియన్ అమెరికన్లతో బంధాన్ని కోరుకుంటున్నారని అర్ధమవుతోంది’’ అని మోదీ చెప్పారని జైశంకర్ చెప్పుకొచ్చారు.
2019-10-01 Read Moreసెప్టెంబరులో భారతదేశ ఉత్పాదక రంగంలో వృద్ధి బలహీనంగా ఉంది. ఒక ప్రైవేట్ వ్యాపార సర్వే ప్రకారం, చలనం లేని ఆర్థిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో కోలుకునే అవకాశాలు కనపించడంలేదు. ‘ఐహెచ్ఎస్ మార్కిట్’ సంకలనం చేసిన నిక్కీ మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సెప్టెంబరులో 51.4 గా ఉంది, ఆగస్టు స్థాయి నుంచి మారలేదు. గత ఏడాది మే నుంచి ఇదే తక్కువ స్థాయి. ప్రభుత్వం, విధాన రూపకర్తలు చింతించాల్సిన అవసరం ఏమిటంటే, మొత్తం డిమాండ్ సెప్టెంబరులో స్వల్పంగా పెరిగింది.
2019-10-01 Read More